చరిత్ర గురించి పుస్తకాల్లో చదువుకుంటాం లేదా ఎక్కడైనా శిధిలాల్లోఏమైనా వస్తువులు బయటపడితే వాటినుంచి వాస్తవాలు చరిత్ర తెలుసుకుంటాం. తాజాగా హరప్పా నాగరికత కాలానికి చెందిన రెండు అస్థి పంజరాలు తవ్వకాల్లో బయటపడ్డాయి. పుణేలోకి దక్కన్ కాలేజ్ డీమ్డ్ యూనివర్సిటీకి చెందిన పురావస్తు శాస్త్రవేత్తలు చేపట్టిన తవ్వకాల్లో ఒకే సమాధిలో స్త్రీ, పురుషుల అస్థి పంజరాలను గుర్తించారు. ఈ రెండూ యుక్త వయసులో ఉన్నవారివి కాగా ఇందులో పురుషుడి ముఖం మహిళవైపు చూస్తున్నట్టుగా ఉంది. దీనిని హరియాణాలోని రఖీగఢిలో గుర్తించారు.ఈ తవ్వకాల్లో బయటపడిన హరప్పా కాలం నాటి తొలి స్మశానం ఇదే కావడం విశేషం. ఈ సమాధిలో జంటను ఒకరి తర్వాత ఒకరు లేదా ఒకేసారి ఇద్దర్నీ పూడ్చిపెట్టారా అనే అంశంపై ఆధారాలు సేకరిస్తున్నట్టు శాస్త్రవేత్తలు తెలిపారు. పురావస్తు తవ్వకాల్లో హరప్పా నాగరికతకు చెందిన అనేక సశ్మాసాలు, సమాధులు బయటపడినా, స్త్రీ, పురుషులు జంటగా ఉన్నవి మాత్రం బయల్పడలేదని అన్నారు. చారిత్రక ఆధారాల కోసం శాస్త్రవేత్తల తవ్వకాలు జరుపుతుండగా వెల్లకిలా పడుకుని, కాళ్లు, చేతులు చాపి ఉన్న ఈ రెండు అస్థి పంజరాలు బయటపడ్డాయి. ఒకే సమాధిలో ఇద్దర్నీ పూడ్చిపెట్టడానికి కారణాలు ఏమై ఉంటాయని శాస్త్రవేత్తలు ఆసక్తి చూపుతున్నారు.
ఈ పరిశోధనకు సంబంధించిన వివరాలను అంతర్జాతీయ సైన్స్ జర్నల్ ఏసీబీ ఆఫ్ అనాటమీ, సెల్ బయాలజీలో ప్రచురించారు. దక్షిణ కొరియాకు చెందిన సియోల్ నేషనల్ యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ మెడిసిన్, పుణే దక్కన్ కాలేజ్ డీమ్డ్ యూనివర్సిటీ సంయుక్తంగా ఈ తవ్వకాలు చేపట్టాయి. చనిపోయిన తర్వాత ఆత్మలు జీవించి ఉంటాయని, ఇవి ఆహారం స్వీకరిస్తాయని హరప్పా కాలం నాటి ప్రజలు నమ్మేవారని, అందుకే సమాధుల్లో కుండలు, పాత్రలను ఉంచేవారని దక్కన్ కాలేజ్ వర్సిటీ వీసీ, పరిశోధకుడు వసంత్ షిండే పేర్కొన్నారు. తవ్వకాలు జరిపినప్పుడు సమాధుల్లో మట్టి పాత్రలు, కుండలు లభ్యమవడానికి కారణం ఇదేనని అన్నారు.
ఈ క్రింద వీడియో మీరు చూడండి
మరణం తరువాత కూడా వ్యక్తి జీవితం ఉంటుందనే సమకాలీన దృక్పథం 5,000 సంవత్సరాలకు పూర్వమే ఉందని వ్యాఖ్యానించారు. గతంలో లోథాల్ వద్ద తవ్వకాల్లో జంట సమాధులు బయల్పడినా, భర్త మరణం తట్టుకోలేక తమకు తాముగా మహిళలు ఆత్మార్పణం చేసుకునేవారని వసంత్ షిండే పేర్కొన్నారు.అయితే మరికొందరు శృంగారం చేస్తూ పట్టబడినా ఇలా సమాధులు చేసేవారు అని కూడా చెబుతున్నారు అయితే దీనిపై పూర్తిగా తెలుసుకున్న తర్వాత వాస్తవాలు తెలుస్తాయి అని అంటున్నారు.. అలాగే దీనిపై మరికొంత మంది పురావస్తు శాస్త్రవేత్తలు మాత్రం.. సమాధిలో బయటపడ్డ అస్థి పంజరాలు లింగభేదం కచ్చితంగా చెప్పలేమని, వీరు దంపతులై ఉండరని అంటున్నారని, కానీ హరప్పా నాగరికతలో ఇంత వరకు ఇలాంటి సమాధులు కనుగొనలేదని అన్నారు. మరి దీనిపై ఎటువంటి విశ్లేషన వస్తుందో చూడాలి.