ఇటీవల కుల మతాలకు అతీతంగా పెళ్లిళ్లు జరుగున్న సంగతి తెలిసిందే ఇక దేశాలక విదేశాలకు వలస వె్ళ్లి లేదా ఉద్యోగంలో సెటిల్ అయ్యి అక్కడ అమ్మాయిని అక్కడ అబ్బాయిని పెళ్లి చేసుకుంటున్న సందర్బాలు చూస్తున్నాం. అయితే ఇప్పుడు ఓ కొత్త వాదన వినిపిస్తోంది మరి అది ఏమిటో చూద్దాం.భారతీయ యువతులు చైనా యువకులను ఎందుకు పెళ్లి చేసుకోరు?… ప్రస్తుతం చైనా ఇంటర్నెట్ వినియోగదారులంతా సమాధానం తెలుసుకోవడానికి ఎదురు చూస్తున్న ప్రశ్న ఇది.ఈ ప్రశ్నను చైనాకు చెందిన ప్రశ్నోత్తరాల వెబ్‌సైట్ ‘జిహు’లో ఏడాది క్రితం పోస్ట్ చేశారు. ఇప్పుడు కూడా ఆ ప్రశ్నకు ప్రజలు స్పందిస్తూనే ఉన్నారు. ఇప్పటిదాకా ఆ ప్రశ్నకు 12లక్షలకు పైగా హిట్లు వచ్చాయి.
భారత్-చైనా… రెండు దేశాల్లోనూ పెళ్లికి చాలా ప్రాధాన్యం ఇస్తారు. చైనాలో మహిళల కంటే 3.4కోట్ల మంది పురుషులు ఎక్కువగా ఉన్నారు. తాజా గణాంకాల ప్రకారం భారత్‌లో మహిళలకంటే 3.7కోట్ల మంది మగవాళ్లు ఎక్కువగా ఉన్నారు.భారత్‌లో కట్నం నిషేదం. కానీ పెళ్లి కూతురి కుటుంబం డబ్బు, బంగారం, ఇతర వస్తువులను పెళ్లి కొడుకు కుటుంబానికి ఇచ్చే సంప్రదాయం ఇంకా కొనసాగుతోంది. చైనాలో మాత్రం పెళ్లి కూతురికే పెళ్లికొడుకు కుటుంబం డబ్బులివ్వడం ఆనవాయతీ.చైనాలో ఎంగేజ్‌మెంట్ నాడు లక్ష యన్‌లను బహుమతిగా అమ్మాయికి ఇస్తుంటారు. ఒక యన్ భారత కరెన్సీలో పది రూపాయలతో సమానం.
చైనాలో ఎంగేజ్‌మెంట్ రోజున అమ్మాయికి ఇచ్చే బహుమతి, భారత్‌లో రైతుల పదేళ్ల సగటు ఆదాయానికి సమానం. కాబట్టి అక్కడి వాళ్లు తమ కష్టాన్ని కట్నం రూపంలో ధారపోసే బదులు, తమ అమ్మాయిలకు చైనా యువకులతో పెళ్లిళ్లు చేసి డబ్బును కూడా కూడగట్టొచ్చు’ అని జిహు వెబ్‌సైట్‌లో ఓ వ్యక్తి పేర్కొన్నారు.
భారత్‌తో పోలిస్తే చైనాలో జీవన ప్రమాణాలు ఎక్కువ. సమాజంలో స్త్రీలకు ఉండే గౌరవం కూడా భారత్ కంటే చైనాలోనే మెరుగ్గా ఉంటుంది. చైనీయుల్ని వియత్నమీస్, బర్మీస్, లావోషియన్, ఉక్రేనియన్ యువతులు కూడా వివాహం చేసుకుంటారు. అలాంటప్పుడు చైనీయులను భారత మహిళలు పెళ్లి చేసుకోవడం ఎందుకు అంత అరుదుగా కనిపిస్తుంది?’ అని అదే వ్యక్తి ప్రశ్నించారు…జిహు వెబ్‌సైట్‌లో కట్నం గురించి కూడా చర్చ జరిగింది.భారత్‌లో కట్నాన్ని బట్టి వధువులను ఎంపిక చేసుకుంటారని, కొన్ని సార్లు ఆ కట్నమే మహిళలకు ప్రాణాంతకంగా మారుతుందని కొందరు యూజర్లు అన్నారు. కొన్నిసార్లు తమ పరపతి చూపించుకోవడానికి, తమ కూతురిపైన తమకున్న ప్రేమను తెలియజేయడానికి తండ్రులే ఎక్కువ కట్నం ఇస్తారని ఇంకొందరు యూజర్లు పేర్కొన్నారు.
బీజింగ్ యూనివర్సిటీకి చెందిన ‘హీ వీయ్’ అనే వ్యక్తి మాత్రం భారత్‌లో పెళ్లి కేవలం డబ్బుతో ముడిపడిన అంశం కాదని తన అభిప్రాయం తెలిపాడు. భారత్‌లో గ్రామీణ మహిళలను, చైనాలో భారీ విజయం సాధించిన ‘దంగల్’ సినిమాలోని మహిళా పాత్రలతో ఆ యువకుడు పోల్చాడు. కానీ నగరంలోని యువతులు మాత్రం చైనా మహిళల తరహాలోనే ఆలోచిస్తారని, విదేశీయులను పెళ్లి చేసుకోవడానికి వారికి పెద్దగా అభ్యంతరం ఉండదని హీ వీయ్ అన్నాడు.‘భారతీయ యువతుల్ని పెళ్లి చేసుకోవాలంటే వాళ్లను పై చదువులు చదవనివ్వాలి. ఉద్యోగం చేయడానికి స్వేచ్ఛనివ్వాలి. ప్రేమను పంచే కుటుంబాన్నివ్వాలి. వాళ్లు మీరిచ్చే లక్ష యన్‌లకు ఏమాత్రం ఆశ పడరు’ అంటూ హీ వీయ్ తమ దేశస్థులకే ఘాటుగా బదులిచ్చాడు…రెండు దేశస్థుల మధ్య పెళ్లి అనేది చాలా జటిలమైన విషయం. దాన్ని డబ్బుతో ముడిపెట్టడం ఎంత మాత్రం సబబు కాదు’ అని మరో యూజర్ పేర్కొన్నారు.
ఈ క్రింద వీడియో మీరు చూడండి
‘భారతీయ యువతులు చైనీయులను ఎక్కువగా పెళ్లి చేసుకోకపోవడానికి కారణం… వాళ్లకు చైనా యువకులు ఎక్కువగా పరిచయం కాకపోవడమే’ అని ఫెంగ్ క్వియాన్లీ అభిప్రాయపడ్డారు. ‘చైనాలో చాలామంది భారతీయు యువకులు పనిచేస్తున్నారు. కానీ ఇక్కడ పనిచేసే భారతీయ మహిళల సంఖ్య తక్కువ. భారత్‌లో పనిచేసే చైనా యువకుల సంఖ్య కూడా తక్కువే. మరోపక్క భారత్‌లో కుటుంబ విలువల బరువు పురుషుల కంటే మహిళలపైనే ఎక్కువగా ఉంటుంది’ అని ఫెంగ్ అన్నారు.‘భారతీయ కుర్రాళ్లు సులువుగా అమ్మాయిల మనుసు దోచుకోగలరు. ఆ విషయంలో చైనా యువకులు వాళ్లతో ఏమాత్రం పోటీ పడలేరు’ అని కూడా ఫెంగ్ చెప్పారు.భారత్‌లో సంప్రదాయాలకు చాలా విలువిస్తారు. అక్కడ గ్రామాల్లో వేరే కులస్థులకు అమ్మాయినిచ్చి పెళ్లి చేయడానికే తల్లిదండ్రులు వెనకాడుతారు. అలాంటిది విదేశీయులతో పెళ్లంటే ఎలా ఆలోచిస్తారో…’ అని జిహు వెబ్‌సైట్‌లోనే మరో యూజర్ రాశారు.భారతీయ తల్లిదండ్రులు తమ కూతుళ్లను చైనీయులకంటే పాశ్చాత్య యువకులకు ఇచ్చి పెళ్లి చేయడానికే మొగ్గు చూపుతారని ఇంకొందరు కామెంట్ చేశారు. తూర్పు ఆసియా ప్రజల గురించి పాశ్చాత్య మీడియా చేసే దుష్ప్రచారం దీనికి ఓ కారణమైతే, చైనీయులు తమ జాతికి దగ్గరగా ఉండేవాళ్లకే ప్రాధాన్యమివ్వడం మరో కారణం కావొచ్చని ఇంకొందరు పేర్కొన్నారు. మరి దీనిపై మీరు ఏమనుకుంటున్నారో కామెంట్ ల రూపంలో తెలియచేయండి.