చిన్న గొడవ చిలికి చిలికి గాలివానగా మారింది. భార్యాభర్తలిద్దరూ మాటామాటా అనుకున్నారు. గొడవ శృతి మించి భార్యపై చేయి చేసుకున్నాడా భర్త.. అంతే ఆమెకు పట్టలేనంత కోపంతో రగిలిపోయిందామె. భర్తపై పెట్రోల్ పోసి తగలబెట్టేసింది. వినడానికి భయంగా ఉంది కదా నిజమే అమ్మాయిలని ఇలా హింసించే పురుషుల తాట తీస్తున్నారు కొందరు మహిళలు. ఇప్పుడు మహిళలు పురుషులు సేమ్ అనేభావన ఉంది అందుకే ఇలాంటి ఘటనలు ఇటు పురుషులు మహిళలు కూడా చేస్తున్న సంఘటనలు అనేకం ఉన్నాయి.
భర్త పై పెట్రోల్ పోసి కాల్చేయడంతో, రెండ్రోజుల పాటు ఆసుపత్రిలో చికిత్స పొందిన అతడు చివరికి చనిపోయాడు. ఇంత రచ్చకూ కారణం అతడు తన ఫోన్ పాస్-వర్డ్ ను భార్యకు చెప్పకపోవడమే కారణం అని తెలుస్తోంది. ఇంత చిన్న విషయాని కి కూడా ఇలా భర్త పై పెట్రోల్ పోసింది ఆ ఇల్లాలు.దీంతో పక్కవారు అందరూ షాక్ అయ్యారు…భర్తలు ఇక్కడ బిక్కు బిక్కు మంటూ మీడియాతో కూడా మాట్లాడటం లేదు.
ఈ క్రింద వీడియో మీరు చూడండి
ఈ ఘటన ఇండోనేషియాలోని ఈస్ట్ లొమ్బోక్ రీజెన్సీలో జరిగింది. దేడి పూర్ణమా కి అతడి భార్య ఇల్హం చయాని కి మధ్య ఈ నెల 12 న వివాదం జరిగిందీ.. ఆ రోజు పూర్ణమా తన ఇంట్లోని ఫ్లోరింగ్ పగిలిపోయి ఉంటే దాన్ని సరి చేస్తూ బిజీగా ఉన్నాడు. ఆ సమయంలో అతడి ఫోన్ లాక్ పాస్ వర్డ్ చెప్పాలని భార్య ఇల్హం అడిగింది. కానీ అతడు చెప్పనన్నాడు. ఎందుకు చెప్పవంటూ ఆమె అడగడంతో గొడవ మొదలైంది. అది కాస్తా పెద్ద రచ్చగా మారిపోయింది. ఆవేశంలో భర్త ఆమెను కొట్టాడు. దీంతో పట్టలేనంత కోపంతో భార్య ఇల్హం పెట్రోల్ తెచ్చి అతడిపై పోసి నిప్పంటించింది.తీవ్ర గాయాలతో ఆసుపత్రిలో పడిన అతడు జనవరి 14న చనిపోయాడు. అతడి భార్యను పోలీసులు అరెస్టు చేశారు. అయితే ఇది కేవలం ఫోన్ పాస్ వర్డ్ చెప్పలేదని చేసిన పనిలాగా లేదని, మనసులో ఏదో పెట్టుకుని కారణం కోసం ఎదురు చూసి హత్య చేసినట్లుగా ఉందని పోలీసులు చెబుతున్నారు. దీనిపై తమ దర్యాప్తులో తేలుతుందని వారు ఆ దేశ మీడియాతో చెప్పారు. అయితే ఆమె మాత్రం ఎటువంటి పశ్చాత్తాపం కూడా చూపించడం లేదట. మరి నిజంగా ఆలోచించాల్సిన ఘటనే ఇది… ఏమంటారు దీనిపై మీ అభిప్రాయం కామెంట్ల రూపంలో తెలియచేయండి.