చాలా కాలం తర్వాత మళ్లీ ప్రజాశాంతి అధ్యక్షుడు కెఎ పాల్ తెలుగు రాజకీయాల్లో సందడి చేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో ఆయన తన సహజశైలిలో మాటల మూట విప్పుతున్నారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాజకీయాలతో పాటు దేశ రాజకీయాలపైనా తన స్టైల్ కామెంట్లు వదిలారు. కేసీఆర్, జగన్ కలిసిపోయినందుకు ధన్యవాదాలు తెలిపారు. జగన్ కోసం ఏపీలో టీఆర్ఎస్ ప్రచారం చేస్తే బాగుంటుందని సూచించారు. ఇటీవల అసెంబ్లీ ఎన్నికల్లో టీఆర్ఎస్ గెలుస్తుందని తాను ముందే చెప్పిన విషయాన్ని గుర్తు చేశారు. ఇక, తాను స్థాపించిన ప్రజాశాంతి పార్టీ.. బడుగు బలహీన వర్గాలదేనని స్పష్టం చేశారు. 1800 మంది కో ఆర్డినేటర్లను కలిశానని, హెలికాప్టర్లకు అనుమతి ఇవ్వనందున.. ఇన్నోవా వాహనంలోనే ప్రచారానికి వెళ్తానని కేఏ పాల్ చెప్పారు.
జనసేన అధినేత పవన్ కల్యాణ్ తో కలుస్తారా అని అడిగితే అటువంటి సంకేతాలు వస్తే ఆలోచిస్తామని జవాబిచ్చారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డిలకు వ్యతిరేకంగా తాము పనిచేస్తామని చెప్పారు. దేశంలో 18 రాష్ట్రాల్లో పలు పార్టీలను తామే గెలిపించామని ఢంకా బజాయించుకున్నారు.తమ పార్టీ నిర్మాణంలో హిప్నో కమలాకర్ చురుగ్గా పనిచేస్తున్నట్లు చెబుతున్నారు. పార్టీలో పది మందిని చేర్పించినవారికి టికెట్ ఇస్తామని చెప్పారు. తాము ఏ పార్టీతోనూ పొత్తు పెట్టుకోబోమని, కలిసి వచ్చే పార్టీలతో కలిసి ముందుకు సాగుతామని చెప్పారు. మొత్తం పాల్ సందడి ఎపి రాజకీయాల్లో వినోదాన్ని పంచుతున్నాయి.
ఈ క్రింద వీడియో మీరు చూడండి
ఈ విషయాలన్నీ ఇలా ఉంటె పాల్ ఇప్పుడు ఆయన భార్య గురించి మాట్లాడి అందరిని ఆశ్చర్యపరిచాడు. సోషల్ మీడియా వేదికగా మాట్లాడుతూ.. వచ్చే ఎన్నికలలో నా భార్య పాత్ర కూడా ఉంటుంది.తొందర్లోనే ఆమెను మీ ముందుకు తీసుకువస్తాను.నా భార్య అమెరికాలో ఉందని అందరు అనుకుంటున్నారు కానీ ఆమె ఇండియాలోనే ఉంది. త్వరలో ఆమె కూడా మీ ముందుకు వస్తుంది. వచ్చే ఎన్నికలలో ప్రజాశాంతి పార్టీ గెలవడం ఖాయమని ka పాల్ తెలిపాడు. అయితే ఇప్పటివరకు ka పాల్ భార్య ఎలా ఉంటుందో తెలియని ప్రజలు ఆయన భార్య ఎప్పుడు వస్తుందా ఎప్పుడు చూస్తామా అని చాలా అతృతతో ఉన్నారు. చూడాలి మరి ka పాల్ తన భార్యకు ఎప్పుడు తీసుకొస్తాడో.మరి ఈ విషయం గురించి మీరేమంటారు. ka పాల్ గురించి ఆయన చేస్తున్న కామెంట్స్ గురించి మీ అభిప్రాయాలను మాకు కామెంట్ రూపంలో చెప్పండి.