కొన్ని రోజుల క్రితం దేశ వ్యాప్తంగా సంచలనం స్పృష్టించిన ఘటన మిర్యాలగూడ ప్రణయ్ హత్య ఘటన.మిర్యాలగూడలో ప్రణయ్ హత్య ఉదంతం తెలుగు రాష్ట్రాల్లో సంచలనంగా నిలిచిపోయింది. అమృత, ప్రణయ్ ఇద్దరు ప్రేమించుకొని పెళ్లి చేసుకున్నారు. అది ఇష్టం లేని అమృత తండ్రి మారుతీరావు కిరాయి హంతకులతో ప్రణయ్ ని సెప్టెంబర్ లో హత్య చేయించాడు. ప్రణయ్ హత్య తర్వాత ఆ కేసు పలు మలుపులు తిరిగింది. అమృత వైశ్య సామాజిక వర్గానికి చెందిన యువతి కాగా ప్రణయ్ ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన వాడు. దీనిని సహించని మారుతీరావు దారుణానికి ఒడిగట్టాడు. పోలీసులు నిందితులందరిని అరెస్టు చేసి జైలుకు తరలించారు. తన తండ్రి ఇంటికి వెళ్లేది లేదని తాను ప్రణయ్ హంతకులకు శిక్ష పడే వరకు పోరాడుతానని తెలిపింది. నేతలు, నాయకులు అనేక సంఘాల వారు అమృతను ఓదార్చి పలు హామీలిచ్చారు.
ఈ క్రింద వీడియో మీరు చూడండి
ప్రణయ్ హత్య తర్వాత సోషల్ మీడియాలో అమృత ప్రణయ్ లకు వ్యతిరేకంగా పలు కామెంట్లు వచ్చాయి. 9 వ తరగతిలేం ప్రేమ అని కొందరు, మారుతీరావు చేసింది కరెక్టే అని కొందరు కామెంట్లు చేశారు. ప్రభుత్వం అమృతకు ప్రభుత్వ ఉద్యోగం, 14 లక్షల రూపాయలు, డబుల్ బెడ్ రూం ఇళ్లు, 3 ఎకరాల భూమి ఇస్తామని హామీనిచ్చింది. అలాగే మరికొందరు ప్రణయ్ విగ్రహాన్ని పెట్టాలని డిమాండ్ చేశారు. ప్రణయ్ ఇంటి చుట్టు పలుసార్లు అనుమానాస్పద వ్యక్తులు రెక్కి నిర్వహించడంతో అమృత పోలీసులకు ఫిర్యాదు చేసింది. అప్పటి నుంచి అమృతకు రక్షణగా ఇద్దరు పోలీసులు ఉంటున్నారు. ఇలా ఎన్నో ఘటనలు జరిగాయి ప్రణయ్ హత్య తర్వాత. అయితే ప్రణయ్ చనిపోయినప్పుడు అమృత 5 నెలల గర్భిణి. ఆ తర్వాత అమృత తన తల్లిగారింటికి వెళ్లకుండా ప్రణయ్ ఇంట్లోనే ఉంటోంది.
ఇప్పుడు అమృత మిర్యాలగూడలోని ఓ హస్పిటల్ లో ప్రసవించింది. ఆమెకు మగబిడ్డ పుట్టాడు. పుట్టిన కొడుకులో ప్రణయ్ ని చూసుకుంటానని ఉద్వేగంతో అమృత బంధువులతో అన్నట్టు తెలుస్తోంది. ప్రణయ్ కుటుంబ సభ్యులు కూడా మళ్ళి ప్రణయ్ పుట్టాడని అంటున్నారు. ప్రణయ్ తమ్ముడు అయితే చాలా సంతోషంగా ఉన్నాడంట.కొడుకు పుట్టాడని తెలిసి వెంటనే ఇండియాకు తిరిగొచ్చి చాలా ఎమోషనల్ అయ్యాడంట. అన్నయ్య బతికుంటే ఎంతో బాగుండేది అని వెక్కివెక్కి ఏడ్చాడంటా. కుటుంబ సభ్యులు ఎంత ఓదార్చుతున్న తన ఆనందాన్ని కన్నీళ్ల రూపంలో తెలిపాడు ప్రణయ్ తమ్ముడు. ఆ దేవుడు మగబిడ్డను పుట్టించి మా అన్నయ్య రూపాన్ని మళ్ళి మాకిచ్చాడని కన్నీటి పర్యంతం అయ్యాడంట. ఏది ఏమైనా ప్రణయ్ విషాదం తర్వాత ఇలా ప్రణయ్ కుటుంబంలో ఆనందం వెల్లివిరియడం సంతోషాన్నిచ్చేదే. మరి ఈ విషయం గురించి మీ అభిప్రాయాలను మాకు కామెంట్ రూపంలో తెలియజేయండి.