ఈ ప్రపంచంలో మనుషులు, జంతువుల పుట్టుకలో అనేక విచిత్రమైన సంఘటనలు నమోదవుతూన్నాయి.. వీటిలో కొన్ని అసహజమైనవిగా ఉంటే, కొన్ని భయానకంగా ఉన్నాయి. ఆ మధ్య ఒక కన్ను కలిగిన బిడ్డ జన్మించాడు. ఆ తర్వాత పంది కడుపులో మేక జన్మించింది. అలాగే మేక కడుపులో గుర్తించలేని ఒక వింత జీవి జన్మించింది. ఇలా చెప్పుకుంటూపోతే ఇలాంటి జననాలు ఈ మధ్య చాలా జరిగాయి. అలా వింతగా ఒక మేక ఇప్పుడు జన్మించింది.మరి దాని గురించి పూర్తీగా తెలుసుకుందామా.
తూర్పు చైనాలోని యెజై గ్రామంలో ఒక వింత మేక జన్మించింది. ఇది రెండు తలలు, నాలుగు కళ్ళు మరియు మూడు చెవులను కలిగి ఉంది. ఈ మేక జన్మించడానికి ప్రసవానికి కూడా 7 గంటల సమయంకన్నా ఎక్కువే పట్టింది. దాని వైకల్యం కారణంగా కనీసం తన సొంత కాళ్ళమీద కూడా నిలబడలేకపోయింది. అయితే జన్యు సంబంధిత సమస్యల వలనే ఇది ఇలా జన్మించిందని డాక్టర్స్ చెప్పారు. దీనికి ఏదైనా ఆహారమివ్వాలి అన్నా రెండు తలలు, తలకొక నోరు ఉంది. దాంతో కొంత ఇబ్బంది అయ్యింది. అయితే ఆ మేకల వ్యాపారి దీనిని తన స్టోర్ లో పెట్టుకోడానికి కూడా ఇబ్బంది పడ్డాడు.ఎందుకంటే తన బిజినెస్ మీద ప్రభావం చూపుతుంది అని. కొందరు దీనిని మ్యూటెంట్ కిడ్ అని కూడా వ్యవహరించడం మొదలుపెట్టారు. నిజానికి మ్యూటెంట్ అంటే తనకు తాను రూపాన్ని మార్చుకోగలిగిన శక్తిని కలిగి ఉండడం, అది ఎక్స్-మెన్ వంటి సినిమాల్లోనే సాధ్యమవుతుంది. కానీ అది మ్యూటెంట్ కాదు, పైన చెప్పినట్లు జన్యుసంబంధ లోపాల వలనే ఇలా జన్మించింది.
ఈ క్రింద వీడియో మీరు చూడండి
ప్రజలు దీనిని దేవుని జన్మగా భావించిన కారణంగా, దీన్ని కొనుగోలు చేసేందుకు కూడా ప్రయత్నించారు. ఈ మేక జనన వార్త అనతి కాలంలోనే దావానలంలా అంతటా వ్యాపించి, ప్రజలు ఈ అసాధారణ జీవిని చూడటానికి గుమిగూడడం మొదలుపెట్టారు. కొందరు వేలం దారులు ఈ విచిత్రమైన మేకను కొనుగోలు చేయడానికి ప్రయత్నించారు. ఎందుకంటే కొన్ని ప్రాంతాలలో ఇటువంటి పుట్టుకలను, పవిత్రమైనవిగా భావించడం జరుగుతుంది. అయినప్పటికీ, ఆ కాపరి దానిని ఎవరికీ విక్రయించలేదు. కానీ దురదృష్టవశాత్తు ఈ మేక జన్మించిన 4 రోజుల తరువాత మరణించింది. యెజై గ్రామంలో గడ్డకట్టే ఉష్ణోగ్రతలు నమోదైన కారణంగా, మరియు దాని అంతర్గత శారీరిక సమస్యల కారణంగా మేక మరణించిందని డాక్టర్స్ చెప్పారు.విన్నారుగా రెండు తలలు మూడు చెవులతో జన్మించిన ఈ మేక విశేషాలు. మరి వింతగా జన్మించిన ఈ మేక గురించి అలాగే ఈ మధ్య నమోదవుతున్న ఇలాంటి వింత జీవుల గురించి మీ అభిప్రాయాలను మాకు కామెంట్ రూపంలో చెప్పండి.