Quantcast
Channel: Viral – Telugu Messenger
Viewing all articles
Browse latest Browse all 2371

ఇన్‌స్టాగ్రామ్ వల్లే మా అమ్మాయి చనిపోయింది –ఓ తండ్రి ఆవేదన

$
0
0

సోషల్ మీడియా.. ఈ రోజుల్లో మనుషులు ఇందులోనే నవ్వుతున్నారు.. ఏడుస్తున్నారు.. అరుస్తున్నారు.. కరుస్తున్నారు.ప్రపంచ జనాభాలో దాదాపు 300 కోట్ల అంటే 40 శాతం మంది సోషల్ మీడియాలో విహరిస్తున్నట్లు అంచనా. వీరు రోజుకు సగటున 2 గంటల సమయం ఇందులోనే గడుపుతున్నట్లు నివేదికలు చెబుతున్నాయి.జీవితంలో ఇంతగా భాగమై పోయిన ఈ సోషల్ మీడియా మనిషికి భారంగా మారుతుంది. కొందరు అయితే దీని మాయలో పడి చనిపోతున్నారు కూడా.

Image result for instagram

బ్రిటన్‌లో ప్రతి సంవత్సరం దాదాపు 200 మంది విద్యార్థులు ప్రాణాలు తీసుకుంటున్నారు. వీరి మరణాలకు కారణం సోషల్ మీడియానే అనేది వారి తల్లిదండ్రుల ఆరోపణ.నిత్యం సోషల్ మీడియా పేజీల్లో పోస్ట్ అవుతున్న హింస, ఆత్మహత్యలు, స్వీయ హింసలకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు, గ్రాఫిక్ చిత్రాలు చూస్తున్న పిల్లలు వాటి మాయలో పడిపోతున్నారు. ఈ కంటెంట్‌ను చూస్తున్నవారిని కూడా అలా చేయాలని ప్రేరేపించేలా ఉంటున్నాయి.ఇలాంటి మాయలో పడి ఇటీవల ఆత్మహత్య చేసుకున్న విద్యార్థుల్లో మోలీ రసెల్ ఒకరు.మోలీ ఇన్‌స్టాగ్రామ్‌లో ఆత్మహత్యలకు సంబంధించిన ఫొటోలు, వీడియోలను ఎక్కువగా చూసేది. కొద్దిరోజులకు అదో వ్యసనంలా మారి, దాని మాయలో పడింది.”నన్ను క్షమించండి. దీనికి వేరెవరూ కారణం కాదు” అని ఓ లేఖ రాసి తన ప్రాణాలను తీసుకుంది.మా అమ్మాయిపై ఎన్నో ఆశలు పెట్టుకున్నా. అవన్నీ ఆవిరైపోయాయి. దీనంతటికీ కారణం ఇంటర్నెట్, సోషల్ మీడియాలే అని మోలీ తండ్రి అయాన్ రసెల్ ఆవేదన చెందుతున్నారు.

ఈ క్రింద వీడియో మీరు చూడండి

ఎన్నో అకౌంట్లు ఇలాంటి సమాచారాన్ని పోస్ట్ చేస్తున్నట్లు ఒక పరిశోధనలో తేలింది.”దూకేయండి” అని చూపించే చిత్రాలు, చేతి మణికట్టుపై గాట్లు పెట్టుకుని తమను తాము హింసించుకుంటున్న గ్రాఫిక్ చిత్రాల వంటివి ఇప్పుడు సోషల్ మీడియాలో కోకొల్లలు. కొన్ని వేల అకౌంట్ల ద్వారా ఇలాంటి సమాచారం పోస్ట్ అవుతోందని పరిశోధనలో తేలింది. అయితే, “ఆత్మహత్యలు, స్వీయహింస, అతిగా తినమని ప్రోత్సహించడం వంటి వాటికి సంబంధించిన సమాచారాన్ని మేం ఎట్టిపరిస్థితుల్లోనూ అనుమతించబోం. అలాంటి కంటెంట్ ఉంటే దాన్ని తొలగిస్తాం” అని ఇన్‌స్టాగ్రామ్ ప్రతినిధులు తెలిపారు.మరి ఈ విషయం గురించి మీరేమంటారు. సోషల్ మీడియా వల్ల యువతీయువకులు చనిపోవడం గురించి మీ అభిప్రాయాలను మాకు కామెంట్ రూపంలో చెప్పండి.


Viewing all articles
Browse latest Browse all 2371

Trending Articles