ప్రతి ఒక్కరు అందంగా ఉండాలని అనుకుంటారు. అందంగా ఉండాలంటే ముఖం మీద మొటిమలు, నల్లటి మచ్చలు, ముడతలు లేకుండా అందంగా కాంతివంతంగా తెల్లగా ఉండాలని కోరుకుంటారు. అందుకోసం రకరకాల ప్రయత్నాలు చేస్తారు. మార్కెట్ లో దొరికే ఏవేవో క్రీమ్ లు వాడి ఉన్న అందాన్ని చెడగొట్టుకుంటారు. అయితే అవేమి పాటించకుండా ఇప్పుడు చెప్పే ఈ చిట్కాను ఫాలో అయితే ముఖం అందంగా తెల్లగా మారుతుంది. కంటి చుట్టూ నల్లటి వలయాలు, నల్లటి మచ్చలు, మొటిమలు, మొటిమల కారణంగా వచ్చే మచ్చలు అన్ని తొలగిపోతాయి. ఒక ముక్కలో చెప్పాలంటే ఈ చిట్కాలను పాటించటం వల్ల ముఖానికి సంబందించిన అన్ని రకాల సమస్యలు తొలగిపోతాయి. ఈ చిట్కాలకు ఏమి అవసరం అవుతాయి. ఎలా తయారుచేసుకోవాలి. ముఖానికి ఎలా అప్ప్లై చేసుకోవాలో వివరంగా తెలుసుకుందాం.
ఈ చిట్కాలకు అవసరమైన అన్ని ఇంగ్రిడియన్స్ మనకు సులభంగా అందుబాటులో ఉండేవే. ఈ చిట్కాల కోసం మనం టూత్ పేస్ట్, ఉప్పు, టమోటో, తేనే వంటివి ఉపయోగిస్తున్నాం. అయితే ప్రతి చిట్కాలోను టూత్ పేస్ట్ ఉపయోగిస్తాం. ఈ చిట్కాల కోసం ఉపయోగించే టూత్ పేస్ట్ తెల్లది అయ్యి ఉండాలి. ఎరుపు, నీలం టూత్ పేస్ట్ లను వాడకూడదు. ఎందుకంటే తెల్లటి టూత్ పేస్ట్ లో ఫ్లోరైడ్ తక్కువగా ఉంటుంది. అందువల్ల మన చర్మానికి ఎటువంటి హాని కలగదు. అదే ఎరుపు, నీలం టూత్ పేస్ట్ లలో ఫ్లోరైడ్ శాతం ఎక్కువగా ఉంటుంది. మీరు ఈ చిట్కాల కోసం పేస్ట్ ని ఉపయోగించే ముందు తప్పనిసరిగా పేస్ట్ లో ఉన్న ఇంగ్రిడియన్స్ ని చూడాలి. తక్కువ ఫ్లోరైడ్ శాతం ఉన్న టూత్ పేస్ట్ ని మాత్రమే ఉపయోగించాలి. ఈ చిట్కాలకు పేస్ట్ ని వాడే ముందు మీరు తప్పనిసరిగా ఒక పని చేయాలి. కొంచెం టూత్ పేస్ట్ ని చేతి మీద రాసి 5 నిమిషాల పాటు ఆలా వదిలేసి ఆ తర్వాత చల్లని నీటితో శుభ్రం చేసుకోవాలి. పేస్ట్ రాసిన ప్రదేశంలో దురద, మంట, ఎలర్జీలు రాలేదని నిర్ధారించుకోవాలి. ఆ తర్వాత మాత్రమే ఈ చిట్కాల కోసం టూత్ పేస్ట్ ని ఉపయోగించాలి. ఒకవేళ మీ చర్మం మీద ఏమైనా రాష్ వస్తే ఈ చిట్కాలను పాటించటకపోవటమే మంచిది.
ఈ చిట్కాకు కేవలం తేనే, టూత్ పేస్ట్ అవసరం అవుతాయి.ఒక బౌల్ తీసుకోని దానిలో కొంచెం టూత్ పేస్ట్ వేయాలి. ఆ తరవాత తేనే వేసి బాగా కలపాలి. తేనె చర్మ సౌందర్యంలోను చర్మ పోషణలోనూ బాగా సహాయపడుతుంది. తేనెలో యాంటీ ఆక్సిడెంట్స్ సమృద్ధిగా ఉండుట వలన మొటిమలను తగ్గించటంలో బాగా సహాయపడుతుంది. అంతేకాక చర్మానికి నూతన కాంతిని తీసుకువస్తుంది .పేస్ట్, తేనే మిశ్రమం బాగా కలిసింది. ఈ మిశ్రమాన్ని మొటిమలు ఉన్న ప్రదేశంలో రాసి ఒక నిమిషం రబ్ చేసి అలా వదిలేయాలి. పది నుంచి 15 నిముషాలు అయ్యాక చల్లని నీటితో శుభ్రం చేసుకోవాలి. అలాగే రాత్రి పడుకొనే ముందు మొటిమలపై ఈ మిశ్రమాన్ని రాసి మరుసటి రోజు ఉదయం చల్లని నీటితో శుభ్రం చేసుకోవాలి. ఈ విధంగా కొన్ని రోజుల పాటు చేస్తూ ఉంటే మొటిమల సమస్య క్రమంగా తగ్గిపోతుంది. అందంగా తయారవుతారు.
ఈ క్రింద వీడియో మీరు చూడండి
అలాగే టమోటాతో కూడా ఒక చిట్కా ఉంది. ఒక బౌల్ లో టమోటా పేస్ట్ తీసుకోవాలి. దానిలో కొంచెం తెల్లటి టూత్ పేస్ట్ కలపాలి. టమోటా పేస్ట్, టూత్ పేస్ట్ బాగా కలిసేలా కలుపుకోవాలి. టమోటా, టూత్ పేస్ట్ లో ఉండే గుణాలు ముఖం మీద నల్లటి మచ్చలను, ముడతలను సమర్ధవంతంగా తొలగించి మంచి స్కిన్ టోన్ ని అందిస్తాయి. ఈ మిశ్రమాన్ని ముఖం మీద అప్లై చేసి వృత్తాకార మోషన్ లో మసాజ్ చేయాలి. ఇలా చేయటం వలన మొటిమలు, మొటిమల కారణంగా వచ్చే మచ్చలు, ముడతలు, కంటి కింద నల్లటి వలయాలు అన్ని తొలగిపోతాయి. మసాజ్ చేయటం పూర్తి అయ్యాక పది నిముషాలు అయ్యాక చల్లని నీటితో శుభ్రం చేసుకోవాలి. ఈ విధంగా వారంలో రెండు సార్లు చేస్తే పేస్ట్ లో ఉండే పోషకాలు, ఇంగ్రిడియంట్స్ ముఖంపై మంచి టోన్ తీసుకువస్తాయి. అలాగే ముఖంపై ఉన్న నల్లటి మచ్చలు, మొటిమలు, వయస్సు రీత్యా వచ్చే ముడతలు అన్ని తొలగిపోయి ముఖం అందంగా, కాంతివంతంగా ఉంటుంది.కాబట్టి ట్రై చేసి చూడండి. మరి ఈ విషయం గురించి మీరేమంటారు. అందం కోసం మేము చెప్పిన ఈ టూత్ పేస్ట్ చిట్కాల గురించి మీ అభిప్రాయాలను మాకు కామెంట్ రూపంలో చెప్పండి.
ఈ క్రింద వీడియో మీరు చూడండి