ఆ యువకుడు దేశ సేవకు ప్రతిరూపమైన ఆర్మీలో పనిచేస్తున్నాడు. నెలకు ఏ రెండు, మూడు నెలలో మినహా ఇంటికి వచ్చే అవకాశం ఉండదు. ఇంట్లో వాళ్లు మంచి సంబంధం చూడడంతో పెళ్లి చేసుకున్నాడు. అలా పెళ్లయింది.. సెలవులు ముగియడంతోనే వెంటనే వెళ్లి డ్యూటీలో జాయిన్ అయ్యాడు. . తీరా ఇంటికి వచ్చిన తర్వాత భార్య ప్రెగ్నెంట్ అని తెలిసింది. ఆ ప్రెగ్నెన్సీ తన వల్ల వచ్చింది కాదని తనకు తెలుసు. మరి తర్వాత ఏమైంది. ఆ ఆర్మీ జవాన్ ఏం చేశాడు. పూర్తీగా చెబుతా వినండి.
21సంవత్సరాల ఆకాష్ సింహ్ కు మే 7.. 2017న నికిత తో పెళ్ళి చేశారు. ఆర్మీలో సెలవులు ముగియడంతో భార్యను పుట్టింట్లో వదిలి విధులకు వెళ్లిపోయాడు. కొత్త కాపురం కదా అధికారులను రిక్వెస్ట్ చేసుకుని సెలవులకని ఇంటికి వచ్చాడు. పుట్టింటి దగ్గర ఉన్న భార్యను తన ఇంటికి పిలుచుకొని వచ్చాడు. అయితే మరుసటిరోజు ఆమె స్పృహ తప్పి పడిపోవడంతో ఆసుపత్రికి తీసుకొని వెళ్ళారు.. ఆమె మూడు నెలల గర్భవతి అని వైద్యలు తేల్చారు. ఈ విషయంపై ఆకాష్ కు సందేహం కలిగింది. భార్య వేరొకరితో సంబంధం పెట్టుకొందని అనుమానించాడు. ఆ తర్వాత ఫుల్ గా మద్యం తాగాడు. రాత్రికి ఇంటికి వచ్చిన ఆకాష్ భార్యతో గొడవపెట్టుకున్నాడు. ఆమె మెడకు టెలిఫోన్ వైర్ బిగించి ఊపిరి ఆడకుండా చేసి చంపేశాడు. ఆ తర్వాత రైలు కింద తలపెట్టి ఆకాష్ కూడా ఆత్మహత్య చేసుకున్నాడు.
ఈ క్రింద వీడియో మీరు చూడండి
చనిపోడానికి ముందు ఆకాష్ సూసైడ్ నోట్ రాశాడు. ‘నేను నా భార్య చనిపోవాలని అనుకున్నామని.. మొదట నికితను గొంతు నులిమి నేనే చంపేశాను.. ఆ తర్వాత తాను కూడా రైలు కింద పడి చనిపోబోతున్నా’నని అందులో పేర్కొన్నాడు. ఇందులో నా కుటుంబానికి ఎటువంటి సంబంధం లేదని నేనే కారణమని తెలిపాడు. కాగా నికిత పోస్ట్ మార్టం రిపోర్టులో ఆమెకు మూడు నెలల గర్భవతి అని తేలింది. భార్యకు కడుపు తన వల్ల కాదని వేరే వ్యక్తితో వచ్చిందని అనుమానం పెంచుకున్న భర్త, భార్యను చంపి అతను రైలు కింద పడి సూసైడ్ చేసుకున్నాడని పోలీసులు నిర్దారణకు వచ్చారు. కొత్త దంపతులు ఇలా చనిపోవడం చూసి కుటుంబంలో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.మరి ఈ ఆర్మీ జవాన్ ఘటన గురించి అలాగే ఇలా వివిధ కారణాల వలన ఒకరిని ఒకరు చంపుకుంటున్న భార్యాభర్తల ఘటనల గురించి మీ అభిప్రాయాలను మాకు కామెంట్ రూపంలో చెప్పండి.