క్రికెట్ లో అప్పుడప్పుడు చేదు ఘటనలు చోటుచేసుకోవడం మనం చూసే ఉంటాం. కొందరు అయితే మైదానాలలో వివిధ కారణాల వలన కుప్పకూలిపోతారు. కొందరు అయితే ప్రాణాలే విడిచివెళ్లిపోయారు. ప్రాణాలు పణంగా పెట్టి మ్యాచ్ ఆడటమే ప్లేయర్లకు తెలిసిన పని. కానీ, ప్రాణాలకు తెగించి ఆడమని కాదు దాని ఉద్దేశ్యం. ఇప్పుడు ఒక భారత క్రికెటర్ తీవ్రంగా గాయపడ్డాడు. మరి అతనెవరో ఎలా గాయపడ్డాడో ఇప్పుడెలా ఉందొ చూద్దాం.
టీమిండియా పేసర్ అశోక్ దిండా గాయపడ్డాడు. కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్‌లో సోమవారం జరిగిన ఓ ప్రాక్టీస్ మ్యాచ్‌లో అశోక్ దిండా బౌలింగ్ చేస్తుండగా.. బ్యాట్స్‌మెన్ కొట్టిన బంతి నేరుగా వచ్చి అతడి ముఖానికి తాకింది. దీంతో ఆశోక్ దిండా పిచ్‌పైనే కూలబడ్డాడు.దేశవాళీ టోర్నీ ‘సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ’ కోసం బెంగాల్ జట్టు సోమవారం ఈడెన్ గార్డెన్స్‌లో ప్రాక్టీస్ మ్యాచ్ ఆడింది. ఈ మ్యాచ్‌లో అశోక్ దిండా ఆఫ్ స్టంప్‌కి వెలుపగా ఫుల్‌టాస్ బంతిని విసరగా.. ఎడమచేతి వాటం బ్యాట్స్‌మెన్ వివేక్ సింగ్ దానిని స్ట్రైట్‌గా ఆడాడు.దీంతో బంతి నేరుగా వెళ్లి దిండా ముఖాన్ని తాకింది. ప్రథమ చికిత్స అనంతరం సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. గాయానికి సిటీ స్కానింగ్ తీసి అనంతరం వైద్యులు దిండా పెను ప్రమాదం నుంచి బయటపడ్డాడని అయితే కోలుకోడానికి టైం పడుతుందని అన్నారు.
ఈ క్రింద వీడియో మీరు చూడండి
2009, డిసెంబరు 9న శ్రీలంకతో జరిగిన టీ20 మ్యాచ్‌తో భారత్ జట్టులోకి అశోక్ దిండా అరంగేట్రం చేశాడు.ఆ తర్వాత నాలుగేళ్లలోనే జట్టుకు దూరమయ్యాడు. చివరిగా 2013లో భారత్ తరఫున ఆడాడు. ఆ తర్వాత కేవలం ఐపీఎల్, దేశవాళీ క్రికెట్‌కే పరిమితమయ్యాడు.ఐపీఎల్ లో కోల్ కత్తా టీమ్ కు, పూణే టీమ్ కు ప్రాతినిత్యం వహించేవాడు. ప్రస్తుతం కోల్ కత్తా టీమ్ లోనే ఉన్నాడు. ఇంకొక రెండు నెలలో ఐపీఎల్ స్టార్ట్ అవ్వబోతుంది. ఈ సమయంలో ఇలా దెబ్బ తాగడం అశోక్ దిండాకు పెద్ద దెబ్బనే అని చెప్పాలి. ఎందుకంటే ఇండియా టీమ్ లోకి రావాలంటే ఐపీఎల్ ఇప్పుడు బెస్ట్ దారి. ఈ దెబ్బ వలన అతను ఐపీఎల్ కు దూరం అయ్యే అవకాశం ఉంది. అతనికి ఏమి కాకూడదని కోరుకుందాం. మరి అశోక్ దిండా గురించి ఇప్పుడు అతనికి దెబ్బ తగలడం గురించి మీ అభిప్రాయాలను మాకు కామెంట్ రూపంలో చెప్పండి.