తల్లి కావాలని ప్రతి మహిళా అనుకుంటుంది.తల్లి అవ్వడం అనేది స్త్రీ జీవితంలో పునర్జన్మ లాంటిది.ముఖ్యంగా ప్రసవం సమయంలో ఆమె పడే బాధ అంతా ఇంతా కాదు.బిడ్డ బయటకు వస్తున్న సమయంలో ఆమె అనుభవించే బాధ ప్రపంచంలో ఎవరు అనుభవించారు.చుట్టూ డాక్టర్స్ ఉన్నా కూడా సరే ఆమె బాధను ఎవరు తీర్చలేరు.అలాంటిది ఎలాంటి డాక్టర్ లేకున్నా ఒక 150 స్పీడ్ తో వెళ్తున్న కారులోనే నిండు గర్భీని ప్రసవించాల్సి వస్తే ఆమె పరిస్థితి ఎలా ఉంటుందో ఒక్కసారి ఊహించుకోండి.ఇప్పుడు ఇదే పరిస్థితి ఒక మహిళకు వచ్చింది.కారులోనే ప్రసవించింది.ఆ సమయంలో ఈమె భర్త ఒక్కడే పక్కనే ఉన్నాడు.అయితే ఆమె ప్రసవం ఎలా జరిగింది.ప్రసవం తర్వాత ఏం జరిగింది.ఆ విషయాలు పూర్తీగా తెలుసుకుందామా.
అమెరికాలో ఉన్న పిట్స్ బర్గ్ అనే ప్రాంతానికి చెందిన లెజియా అనే మహిళ నిండు గర్భిణి.ప్రసవ సమయం దగ్గరకు రావడంతో తన భర్త జోన్ తో్ కలిసి హోస్టన్ లో ఉన్న తమ ఇంటి నుంచి బయలుదేరారు. పసదినాలోని బర్తింగ్ సెంటర్ కు సొంత టయోటా కారులో బయలుదేరారు. ముప్పావు గంట తర్వాత లెజియాకి ప్రసవ నొప్పులు తీవ్రమయ్యాయి. తట్టుకోలేని నొప్పులు వచ్చినా అది ప్రసవానికి కొద్ది క్షణాలేనని ఆమెకు అర్థమైంది.కారు నిలిపి సహాయం కోసం చుట్టూ చూసినా ఎవరూ లేరు. ఇంతలో కడుపులోని బిడ్డ వెలుపలకు రావడం ప్రారంభించింది.వెంటనే భర్తకు చెప్పింది. అతడు కారు జాగ్రత్తగా ఆస్పత్రి వైపు నడుపుతూ భార్యకు జాగ్రత్తలు చెప్పాడు.ఇక ఆమె శిశువు తల బయటకు రావడం గమనించి తగు జాగ్రత్తలు తీసుకుంది.
ఆ సమయంలో ధైర్యం తెచ్చుకుని తనకు తానే ప్రసవం చూసుకుంది. కారులోనే బిడ్డకు జన్మనిచ్చింది.వెంటనే స్పందించి జాగ్రత్తగా బయటకు తీసింది.అయితే బిడ్డ చుట్టూ చర్మం కప్పి పుట్టడంతో భయపడ్డ ఆ మహిళ తన భర్తను హాస్పిటల్ కు తొందరగా వెళ్ళమని చెప్పింది.ఎలాగోలా ఆస్పత్రికి చేరుకున్న ఆ మహిళకు చికిత్స అందించడంతో శిశువు, తల్లిని వైద్యులు కాపాడగలిగారు. అమినోటిక్ శాక్‌తోనే బిడ్డ కడుపు నుంచి బయటికి రావడంతో శిశువుకు చికిత్స అందిస్తున్నామని.. ఇలాంటి ప్రసవాలు రేర్ అంటూ వైద్యులు చెప్పుకొచ్చారు.80వేల మందిలో ఒకరే ఇలా అమినోటిక్ శాక్‌తో పుడతారని వైద్యులు చెప్తున్నారు.
ఈ క్రింద వీడియో మీరు చూడండి
ఆ శిశువు 10 (4.5 కేజీలు) పౌండ్ల బరువుతో ఆరోగ్యంగా ఉన్నాడు.అయితే లెజియా నొప్పులు ఎక్కువ అవుతున్నాయి అనేప్పటి నుంచి ప్రసవించేంత వరకు జోన్ తన కెమెరాలో బంధించాడు.దానిని యూట్యూబ్ లో పెడితే 3.5 కోట్ల మంది ఆ వీడియోను వీక్షించారు. ఈ సందర్భంగా లెజియా మాతృ హృదయాన్ని వీక్షకులు కొనియాడారు. ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.విన్నారుగా కారులోనే ఈ మహిళ బిడ్డకు ఎలా జన్మనిచ్చిందో.మరి ఈ ఘటన గురించి మీరేమంటారు.మనకు జన్మనిచ్చిన మాతృముర్తుల గురించి ప్రసవించే సమయంలో ఆమె పడే బాధ గురించి మీ అభిప్రాయాలను మాకు కామెంట్ రూపంలో చెప్పండి.