ప్రస్తుతం భారత ప్రజలు పాకిస్థాన్‌పై ప్రతీకార చర్యను ఆస్వాదిస్తున్నారు. పుల్వామా దాడిలో 40 మంది వీర జవాన్‌లను పొట్టనబెట్టుకున్న పాకిస్థాన్ ఉగ్రవాదులపై ప్రతీకారం తీర్చుకున్న ఇండియన్ ఎయిర్ ఫోర్స్ సైనికులకు భారత ప్రజలు నీరాజనాలు పడుతున్నారు. మంగళవారం తెల్లవారుజామున భారత వాయు సేన పాక్ ఆక్రమిత కశ్మీర్‌తో పాటు పాకిస్థాన్ భూభాగంలోని ఉగ్రవాద స్థావరాలపై బాంబుల వర్షం కురిపించింది. నియంత్రణ రేఖ నుంచి 50 కిలోమీటర్ల దూరంలో ఉన్న పాక్ భూభాగంలోని బాలాకోట్ ఉగ్రవాద శిక్షణ శిబిరంపై తెల్లవారుజాము 3.45 గంటలు, పీఓకేలోని ముజఫర్‌బాద్‌లోని శిబిరంపై 3.48, చికోటీలో 3.58 గంటలకు మిరాజ్ 2000 రకానికి చెందిన 12 యుద్ధ విమానాలతో దాడిచేసింది. ఈ దాడుల్లో దాదాపు 300 మంది తీవ్రవాదులు హతమయ్యుంటారని భావిస్తున్నారు.
ఈ ప్రతీకార చర్యపై ప్రతి భారత పౌరుడు హర్షం వ్యక్తం చేస్తున్నాడు. ‘సర్జికల్ స్ట్రైక్ 2’ అని, ‘ఇండియా స్ట్రైక్ బ్యాక్’ అని తమ ఆనందాన్ని సోషల్ మీడియా ద్వారా పంచుకుంటున్నారు. వీరిలో సినీ తారలు కూడా ఉన్నారు. భారత వాయు సేన దాడులను ప్రశంసిస్తూ ట్వీట్లు చేస్తున్నారు. ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌ను చూసి భారతీయులుగా తాము గర్వపడుతున్నామని అంటున్నారు. ఇలా స్పందించిన వారిలో కమల్ హాసన్, రామ్ చరణ్, అక్కినేని అఖిల్, వరుణ్ తేజ్, సాయిధరమ్ తేజ్, రకుల్ ప్రీత్ సింగ్, అనుపమా పరమేశ్వరన్ తదితరులు ఉన్నారు.
ఈ క్రింది వీడియో చూడండి
మెగా పవర్ స్టార్ రాంచరణ్ పాక్ పై భారత వైమానిక దాడుల వార్త తెలియగానే సోషల్ మీడియాలో స్పందించారు. భారత వైమానిక దళాలని చూస్తుంటే గర్వంగా ఉంది. జై హింద్ అంటూ ఇండియా స్ట్రైక్ బ్యాక్ అనే హ్యాష్ టాగ్ ని జత )చేశాడు. రాంచరణ్ ఈ సందేశాన్ని ఫేస్ బుక్ లో పోస్ట్ చేయగా.. ఉపాసన దీనిని ట్విట్టర్ లో షేర్ చేసింది.యువ హీరో నితిన్ కూడా వైమానిక దాడులపై స్పందించాడు. భారత వైమానిక దళాలకు సెల్యూట్. జయహో.. జైహింద్.. మేరా భరత్ మహాన్ అని నితిన్ ట్వీట్ చేశాడు. మనం ఏమైనా చేయగలమని నిరూపించారు. సెల్యూట్ టూ ఇండియన్ ఎయిర్ ఫోర్స్ అని అఖిల్ ట్వీట్ చేశాడు.ఇండియన్ ఎయిర్ ఫోర్స్ కు సెల్యూట్. ఇండియా మొత్త గర్వపడుతుందని రకుల్ ట్వీట్ చేశారు.ఇలా సినీ సెలెబ్రిటీలందరు ఇండియన్ ఎయిర్ ఫోర్స్ కు సెల్యూట్ చేస్తున్నారు. మనం కూడా ఒక బిగ్ సెల్యూట్ చేద్దాం మన ఇండియన్ ఎయిర్ ఫోర్స్ కు. మరి ఈ ప్రతీకారదాడి గురించి అలాగే సినిమా సెలెబ్రిటీలు చేసిన ట్వీట్స్ గురించి అలాగే ఇంకా ఏం చేస్తే బాగుంటుందని మీరనుకుంటున్నారో మాకు కామెంట్ రూపంలో చెప్పండి.