ఒక అమ్మాయికి గర్భం రావడం అనేది సహజం. కానీ దానికి ఒక ప్రాసెస్ ఉంటుంది. తన గర్భవతి అయినట్టు ఆ మహిళకు తెలుస్తుంది. ఒక్కొక్క నెల డెవలప్ అయ్యేకొద్దీ ఆమెలో వచ్చే మార్పును ఆమె గమనిస్తుంది. కానీ ఇప్పుడు చేప్పే ఘటన గురించి వింటే మీరు తప్పకుండ షాక్ అవుతారు. ప్రమాదవశాత్తు కోమాలోకి వెళ్లిన ఓ 18 ఏళ్ల అమ్మాయి అందులోంచి బయటికి వచ్చేసరికి గర్భం దాల్చినట్టుగా గుర్తించి షాక్‌కు గురైంది. అలాగని ఆమె నెలలపాటు కోమాలో ఉండిందీ లేదు. తర్వాతి రోజే కోమా నుంచి బయటికి వచ్చింది. అప్పుడే, అంతలోనే అలా ఎలా సాధ్యమైందని అనుకుంటున్నారా. .మరి ఎలా సాధ్యమయ్యిందో తెలుసుకుందామా.
ఈ క్రింది వీడియో చూడండి
ఇంగ్లండ్‌లోని ఓల్దామ్ సిటీకి చెందిన ఏబోనీ స్టీవెన్‌సన్… తలనొప్పిగా ఉందని తన బెడ్‌రూమ్‌లో పడుకుంది. లేచి చూసేసరికి ఓ పెద్ద ఆసుపత్రిలో ఉంది… ఎక్కడున్నానని ఆలోచించేలోపే… తన కడుపును చూసి ఆశ్చర్యపోయింది. తాను ఏడు నెలల గర్భవతిని అని అర్థమై అసలేమైందో తెలియక పిచ్చెక్కినంత పనైంది. అలాగని ఆమెపై ఎటువంటి అత్యాచారం, లైంగిక దాడి జరగలేదు. కొన్ని నెలల క్రితం తన బాయ్‌ఫ్రెండ్‌తో కలిసి శృంగారంలో పాల్గొంది ఏబోనీ. అయితే ఆ తర్వాత కూడా ఆమె నెలసరి సరిగ్గా క్రమం తప్పకుండా రావడంతో గర్బం దాల్చిన విషయం గుర్తించలేదు. అదీ గాక యుట్రేనస్ డిడిల్‌పీస్ అనే వింత వ్యాధికి గురైన ఏబోనీకు రెండు గర్భసంచులు ఉన్నాయి. దాంతో ఒక గర్భసంచిలో బిడ్డ ఉండడంతో, మరో గర్భాశయం నుంచి రుతుక్రమం రాసాగింది. బిడ్డ ఉన్న గర్భసంచి, వెన్నుపూసకి వెనకాల ఉండడంతో పొట్ట సైజు కూడా పెద్దది కాలేదు. దీని వల్ల ఆమె ఏడో నెల వచ్చినా గర్భం దాల్చిన విషయాన్ని గుర్తించలేకపోయింది.
ఈ క్రింది వీడియో చూడండి
ఉన్నట్టుండి 18 ఏళ్ల అమ్మాయికి తీవ్రమైన తలనొప్పి రావడం, ఆ వెంటనే ఆమె కోమాలోకి జారుకోవడానికి కూడా ఇదే కారణమని తేల్చారు వైద్యులు. ఎట్టకేలకు బిడ్డను ఆరోగ్యంగా బయటికి తీయగలిగారు డాక్టర్లు. ఫిజియోథెరపీ చదువుతున్న ఏబోనీ 18 ఏళ్ల వయసులోనే ఓ బిడ్డకు జన్మనివ్వడం ఆనందంగా ఉందని తెలపడం కొసమెరుపు. గత ఏడాది ఇంగ్లండ్‌లోనూ ఇలాంటి సంఘటనే ఒకటి వెలుగుచూసింది. ఇదండీ ఆ అమ్మాయి గర్భం వెనుక ఉన్న కథ. మరి ఈ అమ్మాయికి జరిగిన ఈ ఘటన గురించి అలాగే అప్పుడప్పుడు జరిగే ఇలాంటి ఘటనల గురించి మీ అభిప్రాయాలను మాకు కామెంట్ రూపంలో చెప్పండి