Quantcast
Channel: Viral – Telugu Messenger
Viewing all articles
Browse latest Browse all 2371

నాతో కాపురం చెయ్యి.. అమర జవాను భార్యకి మరిది వేధింపులు

$
0
0

ఓ అమర జవాను భార్యకు అత్తారింటి నుంచి వేధింపులు మొదలయ్యాయి. భర్త అమరుడయ్యి కనీసం 15 రోజులు కూడా కాలేదు. అప్పుడే మరిది పెళ్లి చేసుకోవాలంటూ వేధించడం మొదలుపెట్టాడు. ఈ దారుణ సంఘటన కర్ణాటక  రాష్ట్రం మాండ్యాలో చోటుచేసుకుంది.పూర్తి వివరాల్లోకి వెళితే.. ఇటీవల పుల్వామా ఉగ్రదాడిలో 43 మంది జవానులు అమరులైన సంగతి తెలిసిందే. కాగా.. అమరులైన వారిలో కర్ణాటకలోని మాండ్యాకు చెందిన హెచ్ గురు కూడా ఉన్నారు.

Karnataka: Asked to marry brother-in-law, Pulwama martyr's wife seeks cops help

కాగా.. ఆయన భార్య కళావతి .. భర్త కోల్పోయిన బాధలో ఉన్నారు. ఆమెను ఓదార్చాల్సిన కుటుంబసభ్యులు వేధించడం మొదలుపెట్టారు. హెచ్ గురు అమరుడయ్యాడు కనుక.. ఆయన భార్యకు ప్రభుత్వం ఆర్థిక సహాయం అందించనుంది. ఆ డబ్బు కోసం ఆమెను అత్త, మామతోపాటు మరిది వేధించడం మొదలుపెట్టారు.

ఈ క్రింది వీడియో చూడండి 

ఆమె తన భర్తను కోల్పోయి  కనీసం పక్షం రోజలు కూడా కాకముందే.. మరిది ఆమెను పెళ్లి చేసుకోవాలని బలవంతం చేయడం గమనార్హం. ఈ నేపధ్యంలో కళావతి మాండ్యా పోలీసులను ఆశ్రయించారు. కాగా సినీనటి సుమలత కూడా అమరజవాను హెచ్ గురు కుటుంబానికి అర ఎకరం భూమి ఇచ్చేందుకు హామీనిచ్చారు. కళావతి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. ఇదిలావుండగా అమర జవాను భార్య కళావతికి ప్రభుత్వ ఉద్యోగం కేటాయించాలని కర్నాటక సీఎం కుమారస్వామి ఇప్పటికే సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.


Viewing all articles
Browse latest Browse all 2371

Trending Articles