అభినందన్ వర్ధమాన్.. భారత గుండె ధైర్యానికి.. సాహసానికి ప్రతీకగా నిలిచిన ఈ వింగ్ కమాండర్ గురించి ఎంత చెప్పుకున్న తక్కువే. శత్రువులకు చిక్కినా సరే తన దైర్యం ఎక్కడా తగ్గలేదు భయం లేదు అతని చూపు అతని ధ్యేయం భారత్ కోసమే, శత్రుసేనలు ఎన్ని ఇబ్బందులు పెట్టినా మానసికంగా హింసించినా ఎలాంటి విషయాలు చెప్పలేదు అందుకే అభినందన్ ని ప్రతీ భారతీయుడు మెచ్చుకుంటున్నారు శత్రుమూకలు ఎదుటే ఉన్నా చలించని ఆయన ధైర్యం దేశానికి స్ఫూర్తినిచ్చింది. తన ప్రాణాలు సైతం లెక్కచేయకుండా భారత్ కోసం పోరాడిన అభినందన్ ను పాకిస్తాన్ ఆర్మీ ఎంత టార్చర్ పెట్టినా దేశ రహస్యాలు చెప్పలేదు. కనీసం తన సొంత ఊరు పేరు కూడా బయటపెట్టకపోవడం గమనార్హం.
అయితే పాకిస్తాన్ ఆర్మీ మన అభినందన్ ను మానసికంగానే హింసించిదని ఇన్నాళ్లు అందరూ భావించారు. కానీ శారీకరంగా కూడా అభినందన్ ను టార్చర్ పెట్టిందని తాజాగా ఓ ఆంగ్ల వెబ్ సైట్ సంచలన కథనాన్ని ప్రచురించింది. దాదాపు 60 గంటల పాటు పాక్ సైన్యం చెరలో ఉన్న అభినందన్ ను శాంతికి సంకేతంగా పాక్ తిరిగి భారత దేశానికి పంపించిందని అందరూ భావించారు. కానీ 60 గంటలు అభినందన్ ను పాక్ చిత్రహింసలకు గురిచేసినట్లు వెబ్ సైట్ పేర్కొంది.అభినందన్ నుంచి నిజాలు రాబట్టేందుకు పాక్ ఆర్మీ.. అతడు భరించలేనంత శబ్ధాలు పెట్టారని.. అంతేకాక చాలా కాంతివంతమైన లైట్ ను అతని కళ్లల్లో వేసినట్లు కథనంలో పేర్కొంది.
ఈ క్రింది వీడియో చూడండి
నిజాలు చెప్పకపోవడంతో దాదాపు 24 గంటల పాటు అభినందన్ నిద్రపోకుండా హింసించారని తెలిపింది. ఒకరు తర్వాత ఒకరు పాక్ ఆర్మీ అధికారులు అభినందన్ పై ప్రశ్నల వర్షం కురిపించినట్లు తెలిపింది.దేవుడి దయ వల్ల అభినందన్ భారత్ కు తిరిగి వచ్చాడని.. లేకుంటే అతడిపై ఎన్ని ఘోరాలు జరిగేవో అని వెబ్ సైట్ సంచలన కథనాన్ని రాసుకొచ్చింది. ఇవన్నీ ప్రస్తుతం మిలటరీ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న వర్థమాన్ భారత అధికారులతో చెప్పినట్లు సమాచారం. ఇక పాక్ మాత్రం తాము ఎటువంటి హింసలు చేయలేదు అని అభినందన్ ను తాము బాగా చూసుకున్నాము అని చెబుతున్నారు, అయితే ఇప్పటికే అభినందన్ మానసికంగా తనని హింసించారు అని తెలియచేశారు.. మొత్తానికి ఆయనని పూర్తిగా విచారించి ఈ వాస్తవాలు బయటపెట్టనున్నారు భారత ఆర్మీ అధికారులు. అయితే ఎన్ని ఇబ్బందులు పెట్టినా అభినందన్ మాత్రం భారత్ విషయాలు ఆర్మీ రక్షణ కీలక విషయాలు తెలియచేయలేదు, అందుకే ఆయనకు మరోసారి సెల్యూట్ చేయాల్సిందే.