ఈమధ్య ఎవరు చూడు ఎక్కువగా సోషల్ మీడియాలోనే గడుపుతున్నారు. కొత్తకొత్త పరిచయాలు చేసుకుంటున్నారు.సోషల్ మీడియా పరిచయాలను అడ్డుకొని సైబర్ క్రైమ్స్ కు పాల్పడుతున్నవారి ఉదంతాలు ఇటీవలి కాలంలో కోకొల్లలుగా వెలుగుచూస్తున్నాయి. అయితే ఇటువంటి ఘటనల్లో సాధారణంగా పురుషులే ఇలాంటి బెదిరింపులకు పాల్పడుతుండటం కద్దు. కానీ ఇందుకు భిన్నంగా ఒక ఘటన జరిగింది. ఒక మహిళ నగ్న ఫొటోలను అడ్డు పెట్టుకుని ఎలాంటి వేషాలు వేసిందో చూసి పోలీసులే షాక్ కు గురయ్యారు. మరి ఆ మహిళ ఏం చేసిందో పూర్తీగా తెలుసుకుందామా.
గుంటూరు జిల్లా నర్సరావుపేటకు చెందిన 23 ఏళ్ల యువకుడు బ్యాటరీల పనిచేస్తుంటాడు. ఇతడికి ఇటీవలే ఫేస్‌బుక్ ద్వారా ఒక మహిళ పరిచయం అయింది. ఆ క్రమంలో వీరి పరిచయం పెరిగి ఇద్దరూ తరచుగా ఛాటింగ్ చేసుకుంటూ ఉండేవారు. తనది గుంటూరు అని, తాను ఓ సాఫ్ట్‌వేర్ సంస్థలో పనిచేస్తున్నానని చెప్పిన ఆ యువతి తనకు వివాహమైందని, భర్త హైదరాబాద్‌లో పనిచేస్తాడని, ఒక పాప కూడా ఉందని చెప్పుకొచ్చింది. ఆ తరువాత వీరి మధ్య ఛాటింగ్ మరింత పెరిగిన క్రమంలో ఇటీవల ఆమె తన నగ్నచిత్రం అంటూ ఒక ఫొటోను ఫేస్‌బుక్ ద్వారా ఆ యువకుడికి పంపింది. ఆ తర్వాత నువ్వు కూడా అలాగే నీ నగ్నచిత్రం నాకు పంపించమని అడిగింది. దీంతో ఆ యువకుడు ఆమె కోరిన విధంగానే తన న్యూడ్ ఫోటో ఆమెకు పంపించాడు. ఆ మరుసటి రోజే ఆ మహిళ తనకు అర్జంటుగా డబ్బు అవసరం అయిందని, ఆ డబ్బు సర్ధమని అడిగింది. అతడు తన వద్ద డబ్బు లేదనడంతో నువ్వు డబ్బులు ఇవ్వకపోతే నీ ఫొటోను అన్ని సామాజిక మాధ్యమాల్లో పెట్టేస్తానని బ్లాక్ మెయిల్ చేయడం ప్రారంభించింది.
ఈ క్రింది వీడియో చూడండి
ఆ బెదిరింపులు కొనసాగుతుండగానే ఈ యువకుడు పని మీద విజయవాడ అశోక్‌నగర్‌లోని తన అక్క, బావ ఇంటికి వచ్చాడు. ఈ క్రమంలో ఆ యువతి డబ్బుల కోసం మరోసారి ఫోన్ చేసి బెదిరించింది. ఆ క్రమంలో యువకుడి వాలకం గమనించి యువకుడి సోదరి బావ విషయం తెలుసుకున్నారు. వాళ్ళు ఒక్కసారిగా షాక్ అయ్యారు. ఆ తర్వాత ఈ విషయమై విజయవాడ పటమట పోలీసులను ఆశ్రయించారు. బాధిత యువకుడి ఫిర్యాదు మేరకు పోలీసులు మంగళవారం కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ఫేస్‌బుక్, వాట్సాప్ వంటి సామాజిక మాధ్యమాల్లో తమ వ్యక్తిగత విషయాలు ఫొటోలు పెట్టి ఇబ్బందుల్లో పడొద్దని, సోషల్ మీడియా వినియోగించేప్పుడు అప్రమప్తంగా వ్యవహరించాలని పటమట సీఐ ఉమామహేశ్వరరావు ఈ సందర్భంగా ప్రజలకు సూచించారు.చూశారుగా ఈ మహిళ ఎంతటి పని చేసిందో. కాబట్టి ఇలా సోషల్ మీడియాలో పరిచయం అయిన వాళ్ళతో కాస్త జాగ్రత్త. మరి ఈ మహిళా చేసిన ఈ నీచపు పని గురించి అలాగే ఇలా న్యూస్ పిక్స్ ను అడ్డు పెట్టుకుని వేధించేవాళ్ల గురించి మీ అభిప్రాయాలను మాకు కామెంట్ రూపంలో చెప్పండి.