ఇప్పుడు ఎక్కడ చూసినా సెల్పీ మేటర్ అనే చెప్పాలి.. ఈ సెల్పీల కోసం కొందరు చాలా డేంజర్ స్టంట్స్ కూడా చేస్తున్నారు.. అయితే సెల్ఫీ తీసుకున్న తర్వాత ఆ సెల్పీ ఎలా వచ్చింది అని చూసుకునేవారు చాలా మంది ఉంటారు.. ముఖ్యంగా సెల్పీ క్రేజ్ అలా మారిపోయింది.. అయితే కొందరు స్కూల్లలో కూడా విద్యార్దులు సెల్ ఫోన్ ఎక్కువగా వాడుతున్నారు, ఇక మార్కెట్ లో ఎలాంటి ట్రెండ్ నడుస్తుందో అదే ఫాలో అవుతున్నారు యువత, ఇప్పుడు ఇలాగే ఓ స్కూల్ కు విద్యార్దులు స్కూల్ కు సెల్ ఫోన్ తీసుకువెళ్లారు. ఈ సమయంలో బాత్రూం దగ్గర సెల్పీ తీసుకున్నారు ఇద్దరు అమ్మాయిలు.. ఈ సమయంలో వారు సెల్పీ ఎలా వచ్చింది అని చూసుకున్నారు. కాని ఆ సెల్పీ తీక్షణంగా పరిశీలిస్తే షాక్ అయ్యే పిక్చర్ కనిపించింది మరి అదేమిటో తెలుసుకుందాం.
నార్వేలో ఓ స్కూల్లో ఇద్దరు అమ్మాయిలు బాత్రూం దగ్గర సెల్ఫీ తీసుకున్నారు. అందమైన అమ్మాయిలు తమ సెల్పీలకు లైకులు షేర్లు వస్తాయి అని అనుకున్నారు. అంతే అందంగా ఆనందంగా ఆ సెల్ఫీ ఎలా వచ్చింది అని చూసుకున్నారు. ఈ సమయంలో వారు ఆ ఫోటోలో చూస్తే చివరన వారికి వేరే వ్యక్తి ఉన్నట్లు కనిపించాడు ..తర్వాత వచ్చి చూస్తే అక్కడ ఆ వ్యక్తి లేడట. ఇదే విషయం చెబుతూ సోషల్ మీడియాలో ఈ ఫోటో షేర్ చేశారు .కాని వాస్తవంగా ఇది నిజమా కాదా అని చాలా మంది కామెంట్లు పెట్టారు.
ఈ క్రింది వీడియో చూడండి
బాత్రూంలో మేము ఫోటో తీసుకున్న సమయంలో తెలియని వేరే వారు చివరన ఉన్నారు అని వీరు స్టేటస్ పెట్టారు.. కాని విచిత్రం ఏమిటి అంటే. అసలు ఈ ఫోటో నిజం కాదని వారు కావాలనే ప్రాంక్ గా చేయడానికి తీసిన ఫోటో అని కొందరు అంటున్నారు.. ఇలాంటి మూడ నమ్మకాలు దెయ్యాల గురించి ఇప్పుడు ఎవరూ పట్టించుకోవడం లేదు.. కావాలనే వారు ఇలా బాత్రూంలో వేరే వ్యక్తిని మూలన కూర్చొబెట్టి ఫోటో తీశారు…ఈ సమయంలో అక్కడ వేరే వ్యక్తి దెయ్యం ఉంది అనేలా ప్రచారం చేశారు అని కొందరు అంటున్నారు.. అయితే ఇది స్కూల్ యాజమాన్యానికి తెలియడంతో వారిపై చర్యలు తీసుకుని, స్కూల్ నుంచి పంపించేశారట. మరి స్కూల్ యాజమాన్యం చేసిన పనిపై మీ అభిప్రాయం తెలియచేయండి.