ఆడపిల్లకి తండ్రి అంటే ఇష్టం ఉంటుంది.. అందుకే ఇంటిలో ఆడపిల్ల ఉంటే ఆమెని తండ్రి చిన్నమాట కూడా అనకుండా పెంచుతారు. ఆడపిల్ల ఇంటిలో తెలియక ఏమైనా చిన్న తప్పు చేసినా తండ్రి పోలే చిన్నపిల్ల అని సముదాయిస్తారు. అంతేకాని వారిని బాగా తిట్టడం చేయరు… ఇక మగపిల్లలు చెడుతిరుగుళ్లు జల్సాలు చేస్తారు అనే భయంతో తండ్రులు జాగ్రత్తలు తీసుకుంటారు.. అయితే ఏ ఇంటిలో అయినా ఆడపిల్లని మహాలక్ష్మిలా చూసుకుంటారు.. వారు చేసే పనులు చాలా సరదాగా ఉంటాయి. ఇక తండ్రి ఎక్కడ అయినా నాకూతురు నా బంగారు తల్లి అని అందరిలో చెబుతారు. ఇలా ఓ కుటుంబంలో ఆ కూతురుచేసిన పనికి ఆ తండ్రి నిజంగా షాక్ అయ్యాడు మరి ఆ విషయం ఏమిటో ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం.
ఈ క్రింది వీడియో చూడండి
తన ఇంటిలో చిన్న బకెట్ వేసుకుని ఆడుకుంటూ, దానిపై గెంతుతూ ఓ చిన్నారి ఆటలాడుతోంది.. ఈ సమయంలో ఆయన షేవ్ చేసుకుంటూ గెడ్డం గీసుకునే బ్లేడుతో ఉన్నాడు… ఈ సమయంలో ఆమె అల్లరిని చూస్తు నవ్వుతున్నాడు, సమయం ఎప్పుడూ ఒకేలా ఉండదుకదా..అతని బ్లేడ్ ఒక్కసారిగా చేతికి గుచ్చుకుని గాయం అయింది.. ఇక రక్తం గట్టిగా వస్తోంది. దీంతో ఆ పాపని పిలిచి అతని భార్యని పిలవమన్నాడు , అయితే చిన్నారి మాత్రం తల్లిని పిలవకుండా తండ్రికి గాయానికి కారణం అయిన ఆ బ్లేడ్ ని తీసుకుని నేలపై పెట్టింది, వెంటనే దానిని తిడుతూ దాని చుట్టు తిరుగుతూ వార్నింగ్ ఇచ్చింది.. ఇది చూసిన అతను షాక్ అయ్యాడు.. ఆ తర్వాత అమ్మా అని పిలిచింది. పసుపు ఆ గాయం పై వేయడంతో రక్తం రావడం ఆగిపోయింది, తనకు గాయం అవడానికి ఈ బ్లేడు కారణం అని, తన కూతురు ఆ బ్లేడుని తిట్టడం చూసి ఆ తండ్రి షాక్ అయ్యారు. ఇదే విషయం అతని భార్యకు చెప్పాడు. మరి చూశారుగా ఆ చిన్నారి చేసిన పనిపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియచేయండి.