జీవితంలో సర్దుకుపోయి బతికే వారున్నట్టే నచ్చిన విధంగా బతికే వారూ ఉంటుంటారు. సర్దుకుపోయి బతికేవారిలో నచ్చిందేదో సాధించలేకపోయామనే అసంతృప్తి ఎప్పుడూ వెంటాడుతూ ఉంటుంది. కానీ.. కొందరు మాత్రం సర్దుబాటు జీవితంలోకి ఒకవేళ విధి లేక అడుగుపెట్టినా ఆ తర్వాత నచ్చిన వైపు అడుగులేసి అనుకున్నది సాధిస్తుంటారు. ఎప్పటికైనా వాళ్ళ డ్రీమ్ ను నెరవేర్చుకుంటారు. అలా తన కలను నిజం చేసుకున్న ఒక యువతీ గురించే ఇప్పుడు మీకు చెప్పబోతున్నాను. విని తెలుసుకోండి.
కళాకారులు తమలోని ప్రతిభను నిరూపించుకోవడానికి యూట్యూబ్ అద్భుతమైన సాధనంగా ఉపయోగపడుతోంది. అలాంటి ఓ యూట్యూబ్ స్టారే సోనాలి. ముంబైకి చెందిన సోనాలికి డ్యాన్స్ అంటే చాలా ఇష్టం. మధ్య తరగతి కుటుంబానికి చెందిన సోనాలి కుటుంబ పరిస్థితుల దృష్ట్యా తన ఇష్టాన్ని చంపుకుని చదువు పూర్తి చేసుకున్న తర్వాత ఇన్ఫోసిస్‌లో ఉద్యోగంలో చేరింది. అక్కడే పనిచేసే ఓ వ్యక్తితో వివాహమైంది. అంతా బాగానే ఉంది. కానీ.. సోనాలిని తాను ఏదో సాధించలేకపోయాననే ఆత్మన్యూనత వెంటాడింది. పరిస్థితులన్నీ చక్కబడిన తర్వాత తన భర్తతో డ్యాన్స్‌పై తనకున్న మక్కువ గురించి చెప్పింది. భర్త కూడా ప్రోత్సహించాడు. సాటి వారు మాత్రం వేల రూపాయలు వచ్చే ఉద్యోగాన్ని వదులుకుని రిస్క్ చేయడం అవసరమా అని హెచ్చరించారు. కొందరు ఆమె ఆలోచన గురించి తెలిసి నవ్వారు. వెటకారం చేశారు. కానీ.. భర్త ప్రోత్సాహంతో ఆమె వాటన్నింటినీ అధిగమించింది.
ఈ క్రింది వీడియో చూడండి
ఉద్యోగానికి గుడ్‌బై చెప్పింది. ‘లివ్ టూ డ్యాన్స్ విత్ సోనాలి’ అనే ఓ యూట్యూబ్ ఛానల్‌కు శ్రీకారం చుట్టింది. మొదట్లో అంత ఆదరణ లేకపోయినప్పటికీ మెల్లిమెల్లిగా ఆమె ఓ యూట్యూబ్ స్టార్‌గా సెన్సేషన్ సృష్టించింది. ఆమె చేసిన ప్రతీ డ్యాన్స్ వీడియోకు మిలియన్లలో వ్యూస్ వచ్చాయి. అంతే ఆమె ఇప్పటివరకూ వెనక్కి తిరిగి చూసుకోలేదు. ప్రస్తుతం ఆమె యూట్యూబ్ ఛానల్‌కు 16లక్షల మందికి పైగా సబ్‌స్రైబర్స్ ఉన్నారు. ఆమెని చూసి నవ్విన వారే ఇప్పుడు మెచ్చుకోకుండా ఉండలేని పరిస్థితి. ఇదీ ఓ మాజీ సాఫ్ట్‌వేర్ ఉద్యోగి యూట్యూబ్ స్టార్‌గా ఎదిగిన వైనం.మరి ఈ యూట్యూబ్ స్టార్ గా ఎదిగిన ఈ యువతీ గురించి అలాగే అనుకున్నది చెయ్యలేక చేసే పని నచ్చక ఎలాగోలా జీవించేవాళ్ల మీద మీ అభిప్రాయాలను మాకు కామెంట్ రూపంలో చెప్పండి.