ఈ మధ్య ఎటు చూసి అక్రమ సంబంధ ఘటనలే వెలుగులోకి వస్తున్నాయి. భార్యాభర్తలు ఒకరికి తెలియకుండా మరొకరితో అక్రమ సంబంధం పెట్టుకుంటున్నారు. కొందరు ఆడవాళ్లు అయితే రాక్షసుల్లా మారి చంపడానికి కూడా గురవుతున్నారు. భర్తలు కూడా అక్రమ సంబంధాలు లాంటివి అనేక మైంటైన్ చేస్తున్నారు. ఇంట్లో సౌందర్యం ఒలకబోసే కుందనాల బొమ్మలాంటి భార్య ఉన్నప్పటికీ చాలా మంది పురుషులు ఇతర మహిళలపై కన్నేస్తుంటారు. అలా అని ఆడవాళ్ళూ తక్కువేమి తినడం లేదు. భర్తను కాదని పరాయి మగాడితో సంబంధం పెట్టుకుంటున్నారు. అవసరం అయితే అడ్డుగా ఉన్న భర్తలను చంపుతున్నారు. ఇలాంటి ఘటనే ఇప్పుడు ఒకటి చోటుచేసుకుంది. మరి ఏమైందో పూర్తీగా తెలుసుకుందామా.
కర్ణాటకలోని బైహోంగల్ ప్రాంతం నుంచి బసురాజ్ బసు తన భార్య కల్పన, తన ఇద్దరు పిల్లలను తీసుకుని బతుకుదెరువు కోసం గోవా వెళ్ళాడు. అక్కడ టాక్సీ డ్రైవర్ గా ఉద్యోగం చేసుకుంటూ.. కుటుంబాన్ని పోషిస్తున్నాడు.. దీంతో అతను 15 రోజులకు ఒకసారి ఇంటికి వచ్చేవాడు.. ఇంటిలో ఒంటరిగా ఉంటున్న కల్పన భర్త స్నేహితులతో వివాహేత సంబంధం పెట్టుకుంది. భర్త ఇంటివద్ద లేనన్ని రోజులు వారితో రాసలీలలు నడపడం మొదలు పెట్టింది.. తన భార్య ప్రవర్తనపై అనుమానం వచ్చిన బసురాజ్ ఆమెను నిలదీశాడు.. తిట్టాడు.. కానీ కల్పన తన నడవడికను మార్చుకోలేదు.. సరికదా.. ఇంకా ప్రియులతో కలిసి ఉండడం ఎక్కువ చేసింది.. దీంతో భార్య భర్తల మధ్య గొడవ జరిగింది. నిన్న ప్రియుడితో సరసాలు ఆడుతూనే అడ్డంగా భర్తకు దొరికిపోయింది. దాంతో మరింత పెద్ద గొడవ జరిగింది. వెంటనే భర్త అడ్డును తొలగించుకోవాలని భావించిన కల్పన తన ప్రియులు సురేష్ కుమార్, అబ్దుల్ కరీం, పంకజ్ పవార్ లతో కలిసి ప్లాన్ చేసింది.
ఈ క్రింది వీడియో చూడండి
మళ్ళీ తనతో గొడవ పడుతున్న భర్తపై కత్తితో దాడి చేసి చంపేసింది. వెంటనే తన ప్రియులకు ఫోన్ చేసి ఈ విషయం చెప్పగా వారు ఇంటికి వచ్చి బసురాజ్ మృతదేహాన్ని ముక్కలుగా నరికి మూట కట్టి కారులో ఊరుబయట పడేసి ఏమీ తెలియనట్లు ఎవరి పనుల్లో వారు మునిగిపోయారు. ఐతే కల్పన ప్రవర్తనపై అనుమానం వచ్చిన పొరుగింటి వ్యక్తి పోలీసులకు ఫిర్యాదు చేశాడు.పోలీసులు వచ్చి విచారణ చేపట్టగా కల్పన నిజం చెప్పేసింది. ప్రియుళ్ళతో కలిసి భర్తను చంపినట్టు ఆమె ఒప్పుకుంది.. దీంతో పోలీసులు నిందితులను అదుపులోకి తీసుకుని దర్యాప్తు చేపట్టారు.చూశారుగా ఈ దుర్మార్గురాలు ఎంతటి పని చేసిందో. మరి ఈ ఘటన గురించి అలాగే అక్రమ సంబంధాల కోసం కట్టుకున్న భర్తలను చంపుతున్న భార్యల గురించి మీ అభిప్రాయాలను మాకు కామెంట్ రూపంలో చెప్పండి.