మాతృదేవో భవ ,పితృదేవో భవ ఆచార్య దేవోభవ అని అంటారు. అంటే తల్లిదండ్రుల తర్వాతి స్థానం గురువుది. గురువును దేవుడితో సమానంగా చూస్తాం.కానీ ఈ మధ్య కొందరు టీచర్స్ చేస్తున్న పనులు చూస్తే సభ్యసమాజం తలదించుకునేలా ఉంది. స్కూల్ కు వచ్చే పిల్లలకు ప్రేమగా పాఠాలు చెప్పాల్సింది పోయి వారిని ఘోరంగా కొడుతున్నారు. స్టూడెంట్స్ ను కొట్టడం తప్పు అని ప్రభుత్వాలు హెచ్చరిస్తున్నా కూడా ఇంకా కొంతమంది టీచర్స్ అమానుషంగా ప్రవర్తిస్తున్నారు. ఇప్పుడు ఒక టీచర్ ఒక పాపను కొట్టిన ఘటన అందరిని కలచివేస్తుంది. మరి ఆ ఘటన గురించి పూర్తీగా తెలుసుకుందామా.
పాఠాలు నేర్పించాల్సిన టీచర్లు ప్రాణాలు పోయేలా కొట్టారు, విద్యాబుద్ధులతో ముందుకు నడిపించాల్సిన గురువులే వీపు, కాళ్ళు దద్దులు వచ్చేలా కొట్టారు. అయ్యో పాపం అనిపించేలా ప్రతి ఒక్కరినీ కంటతడి పెట్టిస్తున్న ఈ ఘటన రెండు రోజుల క్రితం రంగారెడ్డి జిల్లాలో చోటు చేసుకుంది. రంగారెడ్డి జిల్లాలోని మీర్ పేట్ పోలీస్ స్టేషన్ పరిధిలోగల నందనవనం కాలనీలో ఉన్న కృష్ణవేణి హైస్కూల్ లో నిఖిల్ అనే ఈ చిన్నారి నర్సరీ చదువుతున్నాడు. స్కూల్ ఫీజు సరైన టైంలో కట్టలేదని పెద్ద కర్రతో టీచర్, ప్రిన్సిపాల్ మరియు డైరెక్టర్ ఇష్టం వచ్చినట్లుగా పసివాడు అని కూడా చూడకుండా ఇలా కొట్టారు. వీపు, కాళ్లపై దద్దులు వాతలు కనబడుతూ రక్తం వస్తోంది. తమ పిల్లాడిని ఇలా చిత్రహింసలకు గురిచేసిన టీచర్, ప్రిన్సిపాల్, డైరెక్టర్ ను వెంటనే అరెస్ట్ చేయాలని స్కూల్ ముందు పిల్లాడి పేరెంట్స్ తో పాటు వారి బంధువులు మరియు మిగతా విద్యార్థుల పేరెంట్స్ ధర్నా చేశారు.

తమ చిన్నారిపై ఇలా అమానుషంగా దాడి చేయడంతో చిన్నారి తల్లితండ్రులు బాలల హక్కుల సంఘం పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ చేయగా టీచర్, ప్రిన్సిపాల్ మరియు డైరెక్టర్ ను అరెస్ట్ చేసారు. ఈ పిల్లాడి తండ్రి ప్లంబర్ గా పనిచేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. టీచర్ కొట్టిందని గట్టిగా అరిచి చెప్పలేక ఇదిగో ఇలా తన కాళ్ళు, వీపుపై పడ్డ వాతలను, దద్దుర్లను చూపించాడు. పిల్లలను ఇలా హింసిస్తున్న ఇటువంటి స్కూల్స్ ను వెంటనే మూసివేయాలని అందరూ డిమాండ్ చేస్తున్నారు. స్కూల్ ఫీజు కట్టకపోతే పేరెంట్స్ కు కబురుపెట్టి అడగాలి గానీ ఇలా అభం శుభం తెలియని చిన్నారులను హింసించడం ఎంతవరకు సమంజసం..? ఈ టీచర్ చిన్నారిని కొట్టిన ఈ ఘటన గురించి అలాగే ఇలా స్టూడెంట్స్ పట్ల టీచర్స్ అమానుషంగా ప్రవర్తిస్తున్న ఘటనల గురించి మీ అభిప్రాయాలను మాకు కామెంట్ రూపంలో చెప్పండి.