ఎవరికి అయినా ఉద్యోగం చేసిన తర్వాత కాస్త విరామం ఉండాలి అని అనుకుంటారు.. కాస్త రిలాక్స్ అయితే మళ్లీ ఉదయం తమ రోజు వారి పనిలో నిమగ్నం అయిపోతారు. అయితే ఎవరు ఎంత కష్టం చేసుకున్నా రాత్రి కచ్చితంగా నిద్ర ఉండాలి.. ముఖ్యంగా ఎనిమిది గంటలునిద్ర ఉంటేనే అతను సరిగ్గా ఏదైనా పని చేయగలుగుతాడు. అంతేకాదు ఆరోగ్యం కూడా బాగుంటుంది. అందుకే ఎవరైనా సరే నిద్ర తిండికి ప్రయారిటీ ఇస్తారు. అవును నిజమే కోట్ల రూపాయాలు సంపాదించినా కచ్చితంగా కావలసింది కంటినిండానిద్ర కడుపునిండా భోజనం అంతే. అయితే ఇప్పుడు మనం చెప్పుకునే దేశంలో కాస్త డిఫరెంట్ గా ఉంటుంది. మరి ఆదేశం ఏమిటి అక్కడ డిఫరెంట్ గా ఉన్న విషయం ఏమిటి అనేది ఇప్పుడు తెలుసుకుందాం.
ఈ క్రింది వీడియో చూడండి
ఉద్యోగం చేసిన తర్వాత విశ్రాంతి కావాలి అని కోరుకుంటారు.. కంటి నిండా నిద్ర తిండి కడుపునిండా ఉండాలి అని కోరుకుంటారు. కాని అసలు రాత్రి అనే సమయం లేకపోతే ఎలా, నిజమే అసలు నిద్ర అంటే ఇష్టం ఉన్నవారు ఈ దేశానికి వెళ్లరు. మరి ఎందుకు అనేది ఇప్పుడు చెప్పుకుందాం. యూరల్ లోని నార్వేలో నాలుగు గంటల 40 నిమిషాలు మాత్రమే రాత్రి ఉంటుంది. అందమైన దేశం ఇది.. ప్రకృతితో అందంగా గ్రీనరీ పరిచి మిమ్మల్ని పిలుస్తుంది. ప్రకృతి సౌందర్యాలు రమణీయంగా ఉంటాయి, కాని ఇక్కడకు వచ్చే వారు ఎవరైనా రాత్రి అనే సమయం ఇంత తక్కువగా ఉంది ఏమిటి అని షాక్ అవుతారు.. ఇక్కడ రెండు మూడు రోజులు ఉంటే చల్లని ఆస్వాదన కలుగుతుంది. రాత్రి చాలా తక్కువ సమయం ఉంటుంది.

జూలై నెలలో సూర్యాస్తమయం ఉండదు.. సూర్యుడు ఉంటాడు ఇక రోజు అంతా సూర్యుడిని చూస్తు ఉంటారు. ఇక వేడి గాలి కూడా చెప్పుకునే అంత వేడిగా ఉండవు. చల్లటి ప్రాంతంగా ఇక్కడ వారికి అందరికి ఫేవరెట్ ప్లేస్ గా నార్వే మారిపోయింది….జనవరి- ఫ్రిబ్రవరి నెలలో రాత్రి మాత్రమే ఉంటుంది.. టైమ్ మాత్రమే ఇక్కడఫాలో అవుతారు. పగలు రాత్రి అనేది కేవలం గడియారం చూసి ఫాలో అవుతారు టూరిస్టులు. అందుకే దీనిని బెస్ట్ స్పాట్ గా చెప్పుకుంటారు.. మరి ఇక్కడ చదువులు కూడా అంతే, ఉదయమే స్కూల్స్ కాలేజీకి వెళతారు..సాయంత్రం నాలుగు గంటలకు తిరిగి వస్తారు, ఇక రాత్రి సమయం తక్కువ ఉండటంతో రెస్టారెంట్లు కాఫీ షాపులు నిత్యం తెరచి ఉంటాయి. ఈ ప్రాంతంలో నివసించే వారికి ఈ లైఫ్ స్టైల్ బాగా అలవాటు అయింది. ఇక కొత్తవారు జస్ట్ టూరిస్టులుగా వస్తారు కాబట్టి, దీనిని బాగా ఎంజాయ్ చేస్తారు. అందుకే ఈ దేశంలో బెస్ట్ టూరిస్ట్ స్పాట్ లు ఉన్నాయి అని మౌత్ పబ్లిసిటీ వెళుతుంది. ముఖ్యంగా ఇక్కడ రోజుకి పది వేల మంది టూరిస్టులు వస్తారు అంటే తెలుసుకోవచ్చు, ఇక్కడ ప్రకృతికి అంత ప్రేమికులు ఉన్నారు. మరి చూశారుగా ఈ వీడియో పై మీ అభిప్రాయాలను కామెంట్ ల రూపంలో తెలియచేయండి.