Quantcast
Channel: Viral – Telugu Messenger
Viewing all articles
Browse latest Browse all 2371

పెళ్లి అయిన 18 నెలలకే కనిపించకుండా పోయిన వింగ్‌ కమాండర్‌… 47 ఏళ్లుగా ఆ భార్య ఎదురు చూపులు

$
0
0

ఇండియా పాకిస్తాన్‌ మద్య అర్థ శతాబ్ధం నుండి మంటలు కొనసాగుతూనే ఉన్నాయి. కొన్ని వేల మంది రెండు దేశాల జనాలు, ఆర్మీ వారు చనిపోయారు. పాకిస్థాన్‌ దేశం అభివృద్దిలో వెనకబడటంతో పాటు, ఉగ్రవాద దేశంగా మారిపోయింది. అదే సమయంలో ఇండియాను ఏదో విధంగా నాశనం చేయాలని పాకిస్థాన్‌ ప్రేరేపిత ఉగ్రవాదులు ఎప్పుడు దాడులకు తెగ బడుతూనే ఉన్నారు. ఉగ్ర మూకల వల్ల వందలాది మంది ఇండియన్‌ జవాన్‌లు మృతి చెందిన విషయం తెల్సిందే. అయినా పాకిస్థాన్‌ ఉగ్ర మూకలను ఇండియా సమర్థవంతంగా ఎదుర్కొంటూనే ఉంది. ఇటీవల రెండు దేశాల మద్య యుద్ద వాతావరణం నెలకొన్న విషయం తెల్సిందే.భారత వింగ్‌ కమాండర్‌ విక్రమ్‌ అభినందన్‌ పాకిస్థాన్‌కు చిక్కి మళ్లీ తిరిగి ఇండియాకు వచ్చిన విషయం తెల్సిందే. అభినందన్‌ వచ్చినందుకు చాలా సంతోషిస్తున్న ఇండియా, కొన్ని వందలు, వేల మంది ఇంకా కూడా పాకిస్థాన్‌ జైల్లో మగ్గుతున్నారు. మరి కొందరు అసలు బతికి ఉన్నారో లేరో కూడా తెలియని పరిస్థితి నెలకొంది. తమ వారు ఉన్నారో లేరో అనే విషయం తెలియక అత్యంత దయనీయ పరిస్థితులను కొందరు ఎదుర్కొంటున్నారు. అభినందన్‌ మాదిరిగానే పాకిస్థాన్‌ వారికి చిక్కిన విజయ్‌ వసంత్‌ తాంబే ఒకరు.

ఈ క్రింది వీడియో చూడండి

భారత వాయుసేనలో ఫ్లైట్ లెఫ్టినెంట్ గా పనిచేస్తున్న తాంబే 1971లో పాకిస్థాన్ కు పట్టుబడ్డాడు. ఆ వార్తను రేడియోలో (అప్పటికి టీవీలు ఇతర ప్రచారం సాధనాలు పెద్దగా లేవు) విన్న అతడి భార్య దయమంతి తాంబే కుప్పకూలిపోయింది. గుండెలవిసేలా ఏడ్చింది. ఆనాటి నుంచి ఆ గుండె బరువును మోస్తునే ఉంది. అప్పటికి వారి పెళ్లయి కేవలం 18 నెలలే అయింది.భర్తతో కొత్త మురిపెం కూడా తీరని ఆ ఇల్లాలికి అది గుండెకోతే అయ్యింది. దేశ సేవ కోసం వెళ్లిపోయిన భర్త ఈనాటికి తిరిగి రాలేదు. అసలు బ్రతికున్నాడో లేదో కూడా తెలీదు. కానీ ఆ భార్య మాత్రం ఈనాటికి ఎదురు చూస్తునే ఉంది. దయమంతి తాంబే సాధారణ మహిళ మాత్రం కాదు. ఆమె మూడు సార్లు జాతీయ స్థాయి బ్యాడ్మింటన్ చాంపియన్. ఆటలో ఎదురయ్యే ఆటుపోట్లతో పాటు నిజజీవితంలో ఎదురైన ఈ విషమ పరిస్థితులను కూడా తట్టుకుంటూ భర్త కోసం ఎదురు చూస్తునే ఉంది. భర్త మిస్ అయినప్పటి నుంచీ ఆమె తిరగని ప్రభుత్వ ఆఫీస్ లేదు..కలవని ప్రధాని లేరు. ఇప్పటివరకు ఎంతమంది ప్రధానులు పనిచేశారో అందరినీ కలిసి తన భర్త గురించి విజ్ఞప్తి చేస్తూనే ఉన్నారు దమయంతి. ఆమెకిప్పుడు 70 సంవత్సరాలు.

Image result for wing commander

దక్షిణ ఢిల్లీలోని మాణిక్ విహార్ లో తన చిన్న ఫ్లాట్ లో భర్త జ్ఞాపకాలతో కుమిలిపోవడం ఆమె నిత్యజీవితంలో భాగమైపోయింది. పెళ్లయిన కొత్తలో కాశ్మీర్ కు హనీమూన్ వెళ్లగా, అక్కడి ప్రకృతి అందాల్లో భర్తతో కలిసి తీయించుకున్న ఫొటోలే ఇప్పుడామెకు తరగని ఆస్తిగా మారాయి. ఆ ఫొటో ఆల్బంను గుండెకు పొదువుకుని భర్త ఎప్పటికైనా తిరిగొస్తాడని కళ్లు కాయలు కాచేలా ఎదురుచూస్తోంది దయమంతి. ఒకసారి పాకిస్థాన్ లో మగ్గిపోతున్న భారత ఖైదీల బంధువులకు తమవారిని చూసే అవకాశం వచ్చింది. మరికొన్ని గంటల్లో పాకిస్థాన్ వెళతామని అనుకునేంతలో రాజకీయ కారణాలతో ఆ పర్యటన రద్దయిపోయింది. అలాంటి చేదు అనుభవాలు దమయంతిని కొత్తల్లో చాలా బాధపెట్టేవి కానీ ఇప్పుడవి అలవాటయిపోయాయి. భర్త దూరమయ్యాడు కానీ అతని జ్ఞాపకాలతో ఆమె వెన్నంటే ఉన్నాయమంటు అంటూ జీవంలేని నవ్వును ముఖంపై పులుముకుంటు బ్రతుకుని వెళ్లదీస్తోంది దమయంతి తాంబే. ఈమె భర్తను విడిపించేలా చేసి ఆమెకు చివరి రోజుల్లో అయినా భర్త నీడ ఉండేలా ప్రభుత్వం చెయ్యాలని కోరుకుందాం. మరి భర్త కోసం దశాబ్దాలుగా ఎదురుచూస్తున్న ఈ జవాన్ భార్య గురించి అలాగే ఇలా పాక్ చేతిలో చిక్కిన వారి కుటుంబాలు అనుభవిస్తున్న నరకం గురించి మీ అభిప్రాయాలను మాకు కామెంట్ రూపంలో చెప్పండి.


Viewing all articles
Browse latest Browse all 2371

Trending Articles