ఇప్పుడంటే సాంకేతికంగా ప్రపంచం అభివృద్ధి చెందింది. మెడికల్ రంగంలో కూడా పెనుమార్పులు వచ్చాయి. రోబోటిక్ టెక్నాలజీ అభివృద్ధిలోకి రావడంతో.. సర్జరీకి పెద్ద పెద్ద గాట్లు పెట్టాల్సిన అవసరం లేకుండానే సర్జీరీ చేస్తున్నారు. క్షణాల్లోనే ఎటువంటి పెద్ద ఆపరేషన్ అయినా పూర్తవుతుంది. దీంతో ఇప్పుటి గర్భం ధరించిన మహిళలు నార్మల్ డెలివరీ కంటే సిజేరియన్ డెలివరీ వైపుకే మొగ్గు చూపుతున్నారు. పెద్దగా ఇబ్బంది పడాల్సిన అవసరం ఉండదు. పైగా ఈజీగా పూర్తవుతుంది. ఈ ఆలోచనతోనే ఇప్పటి వారు ఆపరేషన్ కు మొగ్గు చూపుతున్నారు. అంతేకాదు, ఇప్పుడు తీసుకునే ఆహారం కూడా నార్మల్ డెలివరీకి సహకరించడం లేదు. ఒబేసిటీ సమస్య ఇందులో ఒకటి.

శరీరానికి కావలసినంత వ్యాయామం లేకపోవడం, గర్భం ధరించాక ఎక్కువ రెస్ట్ తీసుకోవడం, చిన్న చిన్న పనులకు సైతం మిషిన్ పై ఆధారపడుతుండటంతో ఈ సమస్యలు వస్తున్నాయి.ఇప్పుడంటే సరే.. మరి పూర్వకాలంలో ఎలా చేసేవారు. అప్పట్లో వైద్యరంగం ఇంతగా అభివృద్ది చెందలేదు, కేవలం చిన్న చిన్న రోగాలకు మాత్రమే మెడిసిన్ ఇచ్చేవారు. క్రిటికల్ గా ఉండే జబ్బులకు అప్పట్లో మందులు తక్కువ. కేవలం నగరాల్లో మాత్రమే అటువంటి మందులు, డాక్టర్లు అందుబాటులో ఉండేవారు. పైగా ఖర్చు అధికం. అలంటి సమయంలో ఎలా డెలివరీ చేసేవాళ్ళు. అసలు వాళ్ళు పాటించిన పద్ధతులు ఏమిటి. నార్మల్ డెలివరీ జరిగేదా లేక సిజేరియన్ లు జరిగేవా.. అసలు ఆపరేషన్స్ అనేవి అప్పట్లో ఉండేవా అంటే ఆ కాలంలో ఏమి లేవు. అప్పట్లో గ్రామాల్లో ఉండే ప్రజలు నాటు వైద్యం తీసుకునేవారు.
ఈ క్రింది వీడియో చూడండి
ఇక పాతరోజుల్లో ప్రతి ఒక్కరూ శారీరక శ్రమ ఎక్కువగా చేసేవారు. ఎంత శ్రమ చేస్తారో అంతా ఆహారం తీసుకునేవారు. అదీ బలమైన ఆహారం. ఇప్పటిలా మిషిన్లో తయారు చేసినవి కాదు. స్వయంగా చేత్తో తయారు చేసుకునేవారు, మహిళలు గర్భంతో ఉన్నప్పటికి ఎక్కువ శ్రమ చేసేవారు. ముఖ్యంగా తిరగలిని తిప్పేవారు. తిరగలిని తిప్పినపుడు శరీరంలోని నడుము చుట్టూ భాగం కదులుతుంది. పొట్టపై కదలికలు వస్తాయి. ఫలితంగా కటిభాగంలోని ఎముకలు ఫ్రీ అవుతాయి. గర్భంతో ఉన్న మహిళలు ఆరు నెలల వరకు ఇలా తిరగలి తిప్పడం వంటివి చేసేవారట,అందుకే ఆ కాలంలో నార్మల్ డెలివరీలు ఎక్కువగా ఉండేవి. పుట్టిన బిడ్డ సైతం ఆరోగ్యంగా ఉండేవారు. మరిప్పుడు అంతా మిషిన్ పై ఆధారపడటంతో.. బిడ్డల ఆరోగ్యం ఎలా ఉంటున్నదో చూస్తూనే ఉన్నాం కదా.మరి ప్రస్తుత పరిస్థితుల గురించి అలాగే పూర్వకాలం పాటించిన పద్ధతులు పిల్లలని కనడానికి వాళ్ళు అవలంభించిన విధానం గురించి మీ అభిప్రాయాలను మాకు కామెంట్ రూపంలో చెప్పండి.