సమాజంలో పాపాలు చేసేవారు రోజురోజుకు పెరిగిపోతున్నారు. డబ్బు కోసం నీచపు పనులు చెయ్యడానికి కూడా వెనుకాడటం లేదు. మొన్నటికి మొన్న ఒక మహిళ డబ్బు కోసం దొంగనోట్లను ముద్రించడానికి ఇంట్లోనే మిషన్ పెట్టుకున్న ఘటన వెలుగులోకి వచ్చింది. ఆమె ముద్రించిన దొంగనోట్లు మార్కెట్ లో చలామణి కూడా అయ్యాయి. ఇప్పుడు మరొక దొంగనోట్ల ఘటన వెలుగులోకి వచ్చింది. మరి ఆ ఘటన గురించి పూర్తీగా తెలుసుకుందామా.

ఈ రోజుల్లో ఎంత సంపాదించినా ఒక ఫ్యామిలీని బాగా చూసుకోవడమే కష్టంగా మారింది. అలాంటిది టీవీ సీరియల్స్‌కి స్ర్కిఫ్ట్ రాసే ఓ వ్యక్తి ఇద్దరిని పెళ్లి చేసుకున్నాడు. తనకొచ్చే అరకొర ఆదాయంతో వారి బాగోగులు చూసుకోవడం కష్టంగా మారింది. దీంతో అతి తెలివి ఉపయోగించి దొంగనోట్లు ప్రింటింగ్ చేయడం ప్రారంభించాడు. దొంగపని చేస్తే ఎప్పటికైనా దొరకాల్సిందే కదా.. అతడికి అలాగే జరిగింది. పాపం పండి ఇప్పుడు జైల్లో ఊచలు లెక్కపెడుతున్నాడు. ముంబయిలోని ఎస్.వి.రోడ్‌లో సోమవారం అనుమానాస్పదంగా తిరుగుతున్న వ్యక్తిని క్రైమ్ బ్రాంచ్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అతడి బ్యాగును తనిఖీ చేయగా దొంగనోట్లు కనిపించాయి. సినిమాలు, సీరియళ్లకు స్క్రిఫ్టులు రాసే దేవ్‌కుమార్ రామ్‌రతన్ పటేల్‌గా గుర్తించిన పోలీసులు అతడిని అదుపులోకి తీసుకుని విచారించారు.
ఈ క్రింది వీడియో చూడండి
నలసొపరలోని అతడిని ఇంటిని తనిఖీ చేయగా రూ.5లక్షల విలువైన రూ.500, రూ.2000 నోట్లు బయటపడ్డాయి. వాటితో పాటు కంప్యూటర్, స్కానర్, ప్రింటర్‌ను స్వాధీనం చేసుకున్నారు. తనకు ఇద్దరు భార్యలున్నారని, తనకొచ్చే ఆదాయంతో ఇద్దరినీ పోషించడం కష్టంగా మారడంతోనే దొంగనోట్లు ప్రింట్ చేస్తున్నట్లు పటేల్ పోలీసులకు చెప్పాడు. ముంబయిలో దొంగనోట్లు చెలామణి చేస్తే దొరికిపోతామన్న ఉద్దేశంతో మధ్యప్రదేశ్‌లోని గ్రామీణ ప్రాంతాలకు వెళ్లి అక్కడ మారుస్తున్నట్లు చెప్పడంతో పోలీసుల అవాక్కయ్యారు. నిందితుడు ఇప్పటికే రూ.15లక్షల మేర దొంగనోట్లు చెలామణి చేసిట్లు పోలీసులు గుర్తించారు. పటేల్ ఇద్దరు భార్యల్లో ఒకరు మోడల్ కాగా, మరొకరు హౌస్ వైఫ్ అని పోలీసులు తెలిపారు. నిందితుడిని అరెస్ట్ చేసి రిమాండ్ తరలించారు. చూశారుగా ఈ వ్యక్తి ఎలా దొరికిపోయాడో. మరి దొంగనోట్లను ముద్రిస్తున్న ఈ వ్యక్తి ఘటన గురించి మీ అభిప్రాయాలను మాకు కామెంట్ రూపంలో చెప్పండి.