సముద్రాలలో వల వేసే సమయంలో చేపల కోసం పెద్ద పెద్ద వలలు వేస్తారు ఏమైనా పెద్ద చేపలు పడితే వారి పంట పండింది అని భావిస్తారు అయితే కొన్ని సమయాలలో అతి విలువైన వస్తువులు దొరుకుతాయి ముఖ్యంగా అరుదైన చేపలు తాబేళ్లు తిమింగలాలు దొరికిన సంఘటనలు ఉన్నాయి ముఖ్యంగా ఇలాంటి టైమ్ లో జాలర్లు వాటిని మంచి మార్కెట్ కు అమ్ముకుంటారు అయితే ఇప్పుడు ఓ తిమింగళం జాలర్లకు చిక్కింది మరి ఆ తిమింగలం కడుపులో ఏమి ఉన్నాయో తెలిస్తే మతిపోవడం ఖాయం. ఈ వీడియోలో అవి ఏమిటో తెలుసుకోండి.
ఈ క్రింది వీడియో చూడండి
ప్లాస్టిక్ వాడకం వల్ల నీళ్లలో జీవించే జంతువుల ప్రాణాలు బలవుతున్నాయి. ప్రపంచంలోనే సముద్రాన్ని ఎక్కువగా పొల్యూట్ చేస్తున్న దేశంలో ఫిలిప్పిన్స్ మొదటి స్థానంలో ఉంది. ఆ దేశస్థులు ప్లాస్టిక్‌ను రీసైకిల్ చేయకపోవడం వల్ల అదంతా సముద్రంలో చేరుతోంది. ఈ కారణంగా సముద్ర జీవులు ప్రాణాలు కోల్పోతున్నాయి. తాజగా ఫిలిప్పిన్స్‌లో ప్లాస్టిక్ కారణంగా ఓ తిమింగిలం మరణించింది. శుక్రవారం మబీని నగరంలో ఒడ్డున పడివున్న తిమింగిలాన్ని చూసిన జాలర్లు దాన్ని తిరిగి సముద్రంలోకి పంపించారు. ఈదుకుంటూ కూడా వెళ్లలేని స్థితిలో తిమింగిలం ఉంది. కొద్ది సేపటికి తిమింగిలం మరణించింది. ఆసుపత్రిలో తిమింగిలానికి పరీక్షలు జరిపించగా.. ఆకలి కారణంగా చనిపోయినట్టు తేల్చారు. ఈ వార్త విని అందరూ ఒకింత ఆశ్చర్యానికి గురయ్యారు. తిండి వెళ్లడానికి వీలు లేకుండా లోపల 40 కేజీల ప్లాస్టిక్ అడ్డుగా ఉండిపోయిందని డాక్టర్లు చెప్పారు. దీంతో ప్రతి ఒక్కరూ ఆవేదన చెందారు.

ఇంత దారుణంగా సముద్రజీవి చనిపోవడం ఇదే మొదటిసారి చూస్తున్నామని డాక్టర్లు తెలిపారు. కాగా, ఇలాంటి సంఘటనలు ప్రపంచవ్యాప్తంగా చాలానే జరుగుతున్నాయి. గతేడాది థాయ్‌ల్యాండ్‌లో 80 ప్లాస్టిక్ బ్యాగులు మింగడం ద్వారా ఓ తిమింగిలం మరణించింది. అయితే సముద్రంలో ప్లాస్టిక్ వస్తువులు చాలా ఎక్కువగా కలుపుతున్నారు కవర్ల వల్ల సముద్రంలో చేపలు తిమింగళాలు వీటిని తిని మరణిస్తున్నాయి, దీనిపై జంతు ప్రేమికులు ఆందోళణ వ్యక్తం చేస్తున్నారు. ఇకనైనా ఇలాంటి వ్యర్దపదార్దాలు సముద్రాల్లో కలపకండి అని కోరుకుంటున్నారు.