చాలా మంది నిద్రని బాగా ఇష్టపడతారు.. నిద్రలేకపోతే వారికి ఏదో ఆనందం కోల్పోయాము అని ఫీలు అవుతారు. అయితే రోజుకి ఆరు నుంచి ఏడు గంటల నిద్ర చాలు, ఇంకా ఎక్కువ నిద్ర అనేది చిన్నపిల్లలకు మాత్రమే మంచిది. అయితే వయసులో ఉన్న యువకులు ముఖ్యంగా నైట్ కల్చర్ కు అలావాటు పడి ఉదయం ఎప్పుడో 11 గంటలకు లేవడం జరుగుతుంది. అయితే ఇలా నిద్రపోవడం వల్ల ఇంటికి నెగిటీవ్ ఎనర్జీ వస్తుంది అంతేకాదు ఇలాంటి నిద్రవల్ల ఆరోగ్యానికి కూడా చాలా చేటు. మరి కొందరు ఉదయం నిద్రలేచి వారు జీవితంలో అన్ని పనులు చాలా యాక్టీవ్ గా చేసుకుంటారు… మరికొందరు మాత్రం ఎంతో బద్దకంగా కనిపిస్తారు. అలాగేమధ్యాహ్నం కూడా భోజనంచేసి పడుకోవడం చాలా మందికి అలవాటుగా ఉంటుంది ..ఇది కూడా మంచిది కాదు అనిచెబుతున్నారు పండితులు. ఇలాంటి నిద్ర వల్ల ఇంటికి చాలా దోషాలు ఉంటాయి అని చెబుతున్నారు పండితులు. మరి అవి ఏమిటి అనేది ఇప్పుడు చూద్దాం.

మధ్యాహ్నం పడుకుంటే దేవతల ఆశీర్వాదం ఉండదు… అలాగే లక్ష్మీదేవి కటాక్షం కూడా ఉండదట ఇంటికి వచ్చే లక్ష్మీ కటాక్షం దూరం అవుతుంది అని చెబుతున్నారు, ఇక ముఖ్యమైన సమస్య ఇలా మధ్యాహ్నం పడుకోవడం ఉదయం ముందుగా లేవకపోవడం వల్ల రకరకాల ఆరోగ్య సమస్యలు వస్తాయి అని చెబుతున్నారు. అలాగే సూర్యోదయం తర్వాత నిద్రమంచిది కాదు అని, కచ్చితంగా ఉదయం నిద్రలేవాలి అని చెబుతున్నారు పండితులు.
ఈ క్రింది వీడియో చూడండి
ఇలా ఉదయం నిద్రలేవడం సూర్యాస్తమయం కంటే ముందు లేవడం వల్ల నెగిటీవ్ ఎనర్జీ పోవడమే కాదు, స్వచ్చమైన గాలి పీల్చుకుంటారు అని చెబుతున్నారు.. ముఖ్యంగా దుప్పటి కప్పుకుని ఉదయం 11 గంటలు అయినా సరే లేవకుండా పడుకుంటే, లక్ష్మీదేవి ఆ ఇంటికి దూరం అవుతుంది అని చెబుతున్నారు పండితులు. అంతేకాదు వ్యాపారంలో ఉద్యోగంలో అలాంటి వారి జీవితాల్లో ఎదుగుదల ఉండదు. మధ్యాహ్న సమయంలో పడుకుంటే ఆరోగ్యానికి కూడా మంచిది కాదు, జీర్ణాశయం సమస్యలు అజీర్తి వస్తాయి. గ్యాస్ సమస్యలు ఆరునెలలకే వస్తాయి, ముఖ్యంగా అధిక బరువు పెరుగుతారు. ఏపనిచేసినా ఎదుగుదల ఉండదు మంద బుద్ది వస్తుంది.. మెదడు పనితీరు మందగిస్తుంది చివరకి మెమరి పై ప్రభావం పడుతుంది. ఇక శివుడు పార్వతి మహాలక్ష్మి శక్తిస్వరూపాలు మధ్యాహ్న వేళ సంచరిస్తారు, ఈ సమయంలో పడుకున్నా లేక శృంగారంలో పాల్గొన్నా ఆఇంటికి మంచిది కాదు అని రాక్షసులు కూడా పుట్టే అవకాశం ఉంటుంది అని పండితులు చెబుతున్నారు. మరి చూశారుగా ఇలాంటి మత్తు నిద్ర జోగు నిద్ర చేయకండి, ఇలాంటి అలవాటు ఉన్నా మానుకోండి, మరి ఈ వీడియోపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియచేయండి.