ఇది అద్భుతం.. మహాద్భుతం. అంతకు మించి పదం ఏదైనా ఉంటే చెప్పుకోవాలి కాబోలు.ఈ మధ్య మనం విచిత్రమైన విషయాల గురించి వింటున్నాం.సోషల్ మీడియా పుణ్యమా అని ఎక్కడ ఏ చిన్న ఘటన జరిగిన అది ప్రపంచం మొత్తం పాకుతుంది.మొన్నామధ్య మేక కడుపునా పంది పుట్టిందని వార్త వచ్చింది.అలాగే గేదె కడుపున కుక్క పుట్టిందని విన్నాం.ఇలాంటి రకరకాల జననాల గురించి విన్నాం.అయితే ఇప్పుడు మరొక అలాంటి జననమే జరిగింది.ఒక మహిళకు వింత కవలలు పుట్టారు. పసిబిడ్డ కడుపులో మరొక బిడ్డ ఉన్నాడు. మరి ఆ వింత కవలల గురించి పూర్తీగా తెలుసుకుందామా.

కొలంబియాకు చెందిన ఇత్జామారా అనే మహిళ బిడ్డకు జన్మనిచ్చింది. అయితే, ఆమెకు పుట్టింది ఒక బిడ్డ కాదు, కవల పిల్లలు. చిత్రం ఏమిటంటే.. సాధారణ కవల పిల్లల్లా ఇద్దరూ సమానంగా ఎదగలేదు. పైగా, రెండో బిడ్డ పిండం రూపంలో శిశువు కడుపులో పెరగడం ప్రారంభించింది. దీంతో వైద్యులు దీన్ని అరుదైన కేసుగా భావించి శస్త్ర చికిత్సతో ఆ పిండాన్ని తొలగించారు. పిండంలో పిండం(fetus-in-fetu) ఏర్పడం వల్లే ఆ కవలలు అలా జన్మించారని వైద్యులు తెలిపారు. గతంలో కూడా ఇటువంటి జననాలు ఏర్పడ్డాయని వైద్యులు పేర్కొన్నారు. 1808లోనే బ్రిటీష్ మెడికల్ జర్నల్ ఇటువంటి జననాలను ప్రస్తావించిందని, ప్రతి ఐదు లక్షల జననాల్లో ఒకరు ఈ విధంగా పుడతారని పేర్కొందని తెలిపారు. ఇటీవల ఇండియా, సింగపూర్‌లో కూడా ఇటువంటి జననాలు ఏర్పడినట్లు వెల్లడించారు. హైదరాబాద్ లోని టోలీచౌక్ లో కూడా ఇలాంటి ఘటన జరిగింది. అప్పుడే జన్మించిన ఒక పాప కడుపులో పిండాన్ని గుర్తించారు. ఇప్పుడు మళ్ళి ఈ మహిళకు జరిగింది.
ఫిబ్రవరి 22న శిశువు తల్లి ఇత్జామారాకు పరీక్షలు నిర్వహించామని, అప్పుడే శిశువు కడుపులో మరో పిండం ఉన్న విషయాన్ని గుర్తించామని తెలిపారు. దీనిపై ఇత్జామారాకు అవగాహన కలిగించి, సిజారియన్ ద్వారా బిడ్డను బయటకు తీశామన్నారు. అనంతరం బిడ్డ లోపల ఉన్న పిండాన్ని లాప్రోస్కోపిక్ సర్జరీ ద్వారా వెలికి తీశామన్నారు. బిడ్డ కడుపులో ఉన్న పిండం రెండు ఇంచులు మాత్రమే ఉందని, దానికి చిన్న తల, కాళ్లు చేతులు ఉన్నాయని తెలిపారు. తల, గుండె లేవన్నారు. 5 లక్షల జనాభాలో ఒక్కరు మాత్రమే ఇలా కడుపులో పిండంతో జన్మిస్తారని, ప్రపంచ వైద్య చరిత్రలో ఇప్పడి వరకు ఇలాంటి కేసులు 200 మాత్రమే నమోదయ్యాయని వైద్యులు తెలిపారు.మరి ఈ వింత కవలల గురించి అలాగే ఈ మధ్య చోటుచేసుకుంటున్న ఇలాంటి అద్భుత జననాల గురించి మీ అభిప్రాయాలను మాకు కామెంట్ రూపంలో చెప్పండి.