ఇప్పుడు సక్రమ సంబంధాలు ఎన్ని ఉంటున్నాయో తెలియదు కాని, కొన్ని అక్రమ సంబంధాలు రోజూ బయట వందల ఘటనలు బయటపడుతున్నాయి. అక్రమ సంబంధం కారణంగా నిండు ప్రాణం బలి… ఇలాంటి వార్తలు కనీసం రోజుకొకటి కనిపిస్తుంటాయి…ఒకప్పుడు అక్రమ సంబంధం నేరమని తేల్చి చెప్పిన కోర్టు ఇటీవలే ఇద్దరికీ ఇష్టమైతే అక్రమ సంబంధం నేరం కాదు అని తీర్పునిచ్చింది… వివాహిత 18 సంవత్సరాలు నిండిన వ్యక్తి ఎవరితోనైనా ఇష్టపూర్తిగా ఆ సంబంధాన్ని పెట్టుకోవచ్చు… అది నేరం కాదు కానీ ఆ సంబంధం ఎంతవరకు మంచిది అన్న విషయాన్ని ఆలోచించలేదు.ఆ విషయం పట్ల సగం శాతం కన్నా ఎక్కువ ఏ వైపు మొగ్గు చూపుతారో ఆ వైపు న్యాయం చెప్పడం సమంజసం.. కోర్టు తీర్పును సమర్ధించేవారు కొందరైతే విమర్శించే వారు మరికొందరు.. తాజాగా అక్రమ సంబంధం కారణంగా ఓ వివాహిత నిండు ప్రాణం కోల్పోయింది.
రాజమండ్రి ప్రాంతానికి చెందిన ధనుంజయ అనే వ్యక్తికి స్థానికంగా ఉండే ఉషతో ఎనిమిదేళ్ల క్రిందట వివాహం జరిగింది… వారి సంసారం ఎంతో సాఫీగా సాగిపోతుంది… వారి పండంటి కాపురానికి నిదర్శనంగా ఏడేళ్ల కూతురు కూడా ఉంది… వృత్తి రీత్యా ధనుంజయ ఆటో నడిపిస్తాడు.. ఇటీవలే ధనుంజయ కు ఆటో యాక్సిండెంట్ కావడంతో తీవ్ర గాయాలపాలయ్యాడు.. దీనితో కుటుంబ భారం మొత్తం ఉషపై పడింది.. ఇక కుటుంబాన్ని పోషించేందుకు స్థానికంగా ఉండే తన స్నేహితురాలి బ్యూటీపార్లర్‌లో వర్కర్‌గా చేరి ఎలాగోలా కుటుంబాన్ని నెట్టుకొద్దామని భావించింది.. జాయిన్ అయిన 15 రోజులకే ఆమె పని చేసే బ్యూటీపార్లర్ ఎదురింట్లో ఉంటున్న బాలాజీ అనే వ్యక్తి మాయమాటలు చెప్పి ఉషను లొంగదీసుకోవాలనే ప్రయత్నం చేశాడు..

డబ్బాశ కూడా చూపాడు.. మొదట నిరాకరించినప్పటికీ కుటుంబ భారం గుర్తుకువచ్చి ఉష అతనికి లొంగక తప్పలేదు.. అలా పలుమార్లు వారిద్దరూ వ్యక్తిగతంగా ఏకాంతంగా కలిశారు.. క్రమంగా ఓ రోజు వారిద్దరూ ఏకాంతగా కలిసున్న సమయంలో తీసిన వీడియోను బాలాజీ ఆమెకు చూపించి నాతో పాటు నాకున్న ఆరుమంది మిత్రులతో గడపాలని చెప్పాడు.. లేదంటే ఆ వీడియోలను సామజిక మాధ్యమాల్లో పెడతానని నిత్యం బాలాజీ తో పాటు అతని స్నేహితులు ఫోన్ చేసి వేదించేసరికి చేసేదేమి లేక పరువుపోతుందని భావించి తీవ్ర మనస్తాపంతో ఇంట్లో ఉరేసుకొని ఆత్మహత్య చేసుకుంది.. దీనితో తమ కుటుంబానికి న్యాయం చేయాలని ఉష బంధువులు డిమాండ్ చేస్తున్నారు… చూశారుగా ఇలాంటి కేడీగాళ్లు ఎలాంటి ఆశచూపి లొంగదీసుకుంటున్నారో, మరి దీనిపై మీ అభిప్రాయాన్ని కామెంట్ల రూపంలో తెలియచేయండి.