బంగారం ఆభరణాల పట్ల భారతీయులకు ఉన్నంత మోజు, ప్రేమ మరెక్కడా కనిపించదు. ఈ సంప్రదాయం ఇప్పటిది కాదు.. అనాదిగా వస్తూనే ఉంది. మార్కెట్ లో ఏ కొత్త డిజైన్లు వచ్చినా కొనడానికి రెడీ అవుతారు. నిత్యం ప్రముఖ నగరాల్లో క్వింటాళ్ల కొద్దీ బంగారం వ్యాపారం జరుగుతూ ఉంటుంది. అయితే సామాన్యులు బంగారం కొనేటప్పుడు వివిధ నగరాల్లో బంగారం ధరలను తెలుసుకోవడం ముఖ్యం. గత కొన్ని రోజులుగా భారీగా పెరిగిన బంగారం ధరలు గత నాలుగు రోజులుగా తగ్గుతూ వస్తున్నాయి. ఈరోజు కూడా భారీగా తగ్గింది.. మరి ఈరోజు బంగారం ధరలు ఎలా ఉన్నాయో చూద్దామా.
పసిడి ధర మళ్లీ పడిపోయింది. బంగారం ధర తగ్గడం ఇది వరుసగా రెండో రోజు. దేశీ మార్కెట్‌లో బుధవారం పది గ్రాముల బంగారం ధర రూ.110 తగ్గుదలతో రూ.33,060కు క్షీణించింది. జువెలర్లు, రిటైలర్ల నుంచి డిమాండ్ మందగించడం ఇందుకు కారణం. బంగారం ధర తగ్గితే.. వెండి ధర మాత్రం పెరిగింది. కేజీ వెండి ధర రూ.20 పెరుగుదలతో రూ.39,120కు చేరింది. పరిశ్రమ యూనిట్లు, నాణేపు తయారీదారుల నుంచి డిమాండ్ పెరగడం సానుకూల ప్రభావం చూపింది. గ్లోబల్ మార్కెట్‌లో బంగారం ధర ఔన్స్‌కు 0.13 శాతం పెరుగుదలతో 1,323.15 డాలర్లకు చేరింది. వెండి ధర ఔన్స్‌కు 0.07 శాతం క్షీణతతో 15.41 డాలర్లకు తగ్గింది. ఢిల్లీలో పది గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.110 తగ్గుదలతో రూ.33,060కు, 22 క్యారెట్ల బంగారం ధర రూ.110 తగ్గుదలతో రూ.32,890కు క్షీణించింది. ఇక ప్రభుత్వ సార్వభౌమ పసిడి పథకంలో 8 గ్రాముల బంగారం ధర రూ.26,400 వద్ద స్థిరంగా కొనసాగుతోంది.

కేజీ వెండి రూ.20 పెరుగుదలతో రూ.39,120కు చేరితే.. వారాంతపు ఆధారిత డెలివరీ ధర రూ.82 తగ్గుదలతో రూ.38,283కు క్షీణించింది. ఇక 100 వెండి నాణేల కొనుగోలు, అమ్మకం విషయానికి వస్తే.. కొనుగోలు ధర రూ.80,000 వద్ద, అమ్మకం ధర రూ.81,000 వద్ద స్థిరంగా కొనసాగుతోంది. హైదరాబాద్‌లో10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.32,170 వద్ద, 22 క్యారెట్ల బంగారం ధర రూ.30,640 వద్ద స్థిరంగా కొనసాగాయి. కేజీ వెండి ధర రూ.41,000కు క్షీణించింది. ఇక విజయవాడలో 30,736 32,266, విశాఖ పట్నం 30,748 ,32,278 , బెంగళూరు 30,212 , 31,692 గా ఉంది. చెన్నైలో 30,774 , 32,264 గా కొనసాగుతున్నాయి… చూశారుగా వివిధ నగరాలలో బంగారం రేట్ ఎలా ఉందొ. మరి మార్కెట్ లో ఉన్న బంగారం వెండి దరల గురించి మీ అభిప్రాయాలను మాకు కామెంట్ రూపంలో చెప్పండి.