అల్ వలీద్ బిన్ తలాల్ ఈయన పేరు మన దేశంలో తెలియక పోవచ్చు కాని సౌదీలో అందరి కంటే ధనవంతుడు పెద్ద వ్యాపారవేత్త, ధనవంతుల జాబితాలో ఆయన ముందు వరుసలో ఉంటారు..అతని సంపద $ 32 బిలియన్ డాలర్ల కంటే ఎక్కువ విలువను కలిగి ఉంది. ప్రపంచంలోని అత్యంత సంపన్న వ్యక్తుల జాబితాలో ర్యాంకులు ఫోర్బ్స్ ప్రకటిస్తే కచ్చితంగా ఆయన పేరు టాప్ 10 లో ఉంటుంది.అల్ వలీద్ వ్యాపారం చిన్న చిన్న బ్రాంచీల నుంచి అనేక వ్యాపారాలకు విస్తవరించింది., ఆయనకు ప్రముఖ హోటల్స్ అయిన ఫోర్ సీజన్స్, ఫెయిర్ మౌంట్, మోవేన్పిక్ మరియు స్విస్కోల్ వంటి హోటల్ లో షేర్లు ఉన్నాయి.. ఈ సౌదీ కుబేరుడికి ఎయిర్బస్ A-380 ఉంది..ఒక జాకుజీ, వ్యాయామశాల, ప్రార్ధన గది, రెండు కారు గ్యారేజ్ లు, రెండు పెద్ద బెడ్ రూములు మరియు ఒక బంగారు సింహాసనంతో అతనిని ప్రత్యేకంగా దీనిని తయారు చేశారు.

అల్ వలీద్, సౌదీ అరేబియా, కింగ్ అబ్దులాజిజ్ బిబ్ సౌద్ యొక్క ఆధునిక రాష్ట్ర స్థాపకుడికి మనవడు. మరియు అతని తాత, తల్లి వైపు, లెబనాన్ యొక్క ప్రధాన మంత్రి. అతను ప్రిన్స్ తలాల్ మరియు మోనా అల్ సోల్ కుమారుడు.యునైటెడ్ స్టేట్స్లోని కాలిఫోర్నియాలోని మెన్లో విశ్వవిద్యాలయంలో చదువుకున్న సమయంలో ఈ ప్రపంచం ఎంత అభివృద్ది చెందుతుందో తెలుసుకున్నాడు.. ఆ సమయంలో చిన్న మొత్తంగా పెట్టుబడి డబ్బులు తండ్రి నుంచి పొంది ఇప్పుడులక్షల కోట్ల రూపాయల సంపద సృష్టించాడు.
ఈ క్రింది వీడియో చూడండి
ప్రస్తుతం ప్రిన్స్ ఆల్ వలేడ్, సౌదీ అరేబియాలోని రియాద్లో తన భార్యతో కలిసి , 420 గదులతో ఉన్న భవనంలో నివసిస్తున్నారు. ఈ నిర్మాణం అత్యుత్తమ పాలరాయితో నిర్మించబడింది మరియు గోడలు భారీ పెయింటింగ్స్ మరియు గిగాన్టోగ్రాఫిలతో అలంకరించబడి ఉంటాయి. దీనికి రెండు ఇండోర్ కొలనులు మరియు టెన్నిస్ కోర్టులు ఉన్నాయి..ఇలా ప్రిన్స్ తన ఇంటిని తనకు ఇష్టమైన రీతిలో నిర్మించుకున్నారు.ఈ యువరాజు వ్యవసాయం కూడా చేస్తారు కేవలం దీని కోసం 120 ఎకరాలు కొనుగోలు చేశారు, ఇక ఇంటి నిర్మాణం కూడా 100 ఎకరాల్లో చేశారు ప్రిన్స్ అల్ వలేద్… ఆయనకు పెట్స్ తో కలిసి ఒక ప్రైవేట్ జూ ఉంది.. ఆయనకు నచ్చిన జంతువులు డజన్లకొద్ది గుర్రాలు మరియు ఐదు కృత్రిమ సరస్సులు ఇక్కడ ఉన్నాయి… ఈయన రాత్రి విలాసాల కోసం నెలకు 100 కోట్ల రూపాయలు ఖర్చు చేస్తారు అంటే ఆశ్చర్యపోవాల్సిందే, అంత ధనవంతుడు కాబట్టే ఆయన ఖర్చు ఆయన కంపెనీల విలువ ఇలా ఉంది అని చెబుతున్నారు బిజినెస్ టైకూన్స్ . మరి ఆయన లగ్జరీ జీవితం పై ఈ స్టోరీ చూశారుగా, దీనిపై మీ అభిప్రాయాన్ని కామెంట్ ల రూపంలో తెలియచేయండి.