అమ్మాయిలు ఒంటరిగా ప్రయాణం చెయ్యాలి అంటేనే భయపడిపోతున్నారు, ఎక్కడికి అయినా రాత్రి సమయాల్లో ఒంటరిగా వెళితే తిరిగి వస్తారా లేదా అనే అనుమానం ఆ కుటుంబాల్లో పెరిగిపోయింది. అందుకే ఒంటరిగా రాత్రి పూట ప్రయాణాలు చాలా మంది మానేస్తున్నారు. ఇక ఓ అమ్మాయిని కిడ్నాప్ చేసి దారుణంగా హింసించారు కొందరు నీచులు, చివరకు వారి పాపం పండింది, వారు ప్రయాణిస్తున్న కారు ఓవర్ స్పీడు వెళ్లడంతో స్ధానికులకు అడ్డంగా దొరికిపోయారు. మరి ఆ ఘనట సంగతి ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం.
సిరిసిల్ల రాజన్న జిల్లా ఎర్రగొడ్ల మండలం బ్రిడ్జి దగ్గర కారు ప్రమాదం జరిగింది… కారును ఢీకొన్న వ్యక్తి మృతి చెందారు. దీంతో కారును స్పీడుగా నడుపుతూ వ్యక్తిని గుద్దడంతో అతను మృతి చెందాడు అని , స్ధానికులు కారులో ఉన్న వారిని కిందకి దించారు.. ఈ సమయంలో కారులో నలుగురు వ్యక్తులు ఉన్నారు. అంతేకాదు వారితో ఓ 20 ఏళ్ల అమ్మాయి కూడా ఉంది .ఆమె శరీరం పై గాట్లు ఉన్నాయి. ఆమె మొఖం అంతా దెబ్బలతో కందిపోయి ఉంది, ఆమెని అక్కడ ఉన్న వారు ఏమి జరిగింది అని విషయాలు అడిగి తెలుసుకున్నారు, తనని కిడ్నాప్ చేసి ఎక్కడికో తీసుకువెళుతున్నారు అని కన్నీటితో చెప్పింది ఆయువతి.

వెంటనే అక్కడ వారికి విషయం అర్దమవడంతో వారిని చెట్టుకుకట్టేశారు, ఆ అమ్మాయి సిరిసిల్లకు చెందిన అమ్మాయి అని , పని నుంచి ఇంటికి వెళ్లుతున్న సమయంలో రోడ్డుపై ఆమెని కారులోకి లాగి తీసుకువచ్చారని తెలియచేశారు.. ఆమెని అనుభవించి అత్యాచారం చేయాలి అని అనుకున్న సమయంలో ఆమె కేకలు వేయడంతో ఆమెని కారులోనే చిత్ర హింసలు పెట్టారు. ఈ సమయంలో ఎదురుగా వస్తున్నబైక్ ను చూడకపోవడంతో అతనిని ఢీకోట్టారు అని పోలీసుల విచారణలో అక్కడే తెలియచేశారు ఈ నలుగురు నీచులు.

వెంటనే పోలీసులు వీరిపై నిర్భయ చట్టం కింద కేసు నమోదుచేయాలి అని అక్కడ వారు కోరారు, ఇక్కడ ప్రమాదం జరగడంతో ఓ వ్యక్తి ప్రాణాలు కోల్పోయాడని ఇలాంటి వారిని వదిలిపెట్టకూడదు అని స్దానికులు పోలీసులకు కంప్లైంట్ ఇచ్చారు, ఆమెని కుటుంబ సభ్యులకు అప్పగించడంతో ఆమె కూడా వారిపై కేసు పెట్టింది. మొత్తానికి ఈ ఘటనలో అన్యాయంగా ఓ బైక్ పై వెళుతున్న వ్యక్తి ప్రాణాలు కోల్పోవడం అక్కడ వారిని కలిచివేసింది. చూశారుగా ఒంటరి ప్రయాణాలు ఎలాంటి పరిస్దితికి అయినా దారితీయచ్చు అనేది గుర్తు ఉంచుకోండి అని చెబుతున్నారు పోలీసులు.