ఏపీలో ఎన్నికల సీజన్ కనిపిస్తోంది. ఎక్కడ చూసినా ప్రచార సభలు, రోడ్ షోలతో అభ్యర్థులు, నేతలు బిజీ అయ్యారు. ఇక బహిరంగ సభలు, రోడ్ షోలకు భారీగా జన సమీకరణ చేస్తున్నాయి పార్టీలు. ఇక సందట్లో సడేమియా అన్నట్లు ఎన్నికల ప్రచారంలో దొంగలు కూడా చేతివాటం ప్రదర్శిస్తున్నారు. వారం క్రితమే ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్‌కు దండ వేస్తున్నట్లు నటించి మెడలో చైన్ కొట్టేశారు కేటుగాళ్లు. తాజాగా ఈ వింత అనుభవం వైసీపీ అధినేత జగన్ సోదరి షర్మిలకు ఎదురయ్యింది.
గుంటూరు జిల్లా మంగళగిరి నుంచి బస్సు యాత్ర ప్రారంభించిన షర్మిల.. రోడ్ షోలతో బిజీ అయ్యారు. శనివారం స్థానికులకు అభివాదం చేస్తూ ముందుకు సాగారు. ఇదే సమయంలో పార్టీకి చెందిన కొందరు కార్యకర్తలు షర్మిలకు షేక్ హ్యాండ్ ఇచ్చేందుకు పోటీపడ్డారు. కార్యకర్తల ఉత్సాహం చూసి ఆమె బస్సులో నుంచే చేయి అందించారు. ఇదే అదనుగా ఓ వ్యక్తి షర్మిల చేతికి ఉన్న ఉంగరాన్ని కొట్టేసేందుకు ప్రయత్నించాడు.

ఆ వ్యక్తి షర్మిల చేతికి ఉన్న ఉంగరాన్ని లాగేందుకు ప్రయత్నించాడు. వెంటనే అప్రమత్తమైన షర్మిల.. తన చేతిని వెనక్కు లాక్కున్నారు. ఉంగరం కాస్త బిగుతుగా ఉండటంతో వేలు నుంచి రాలేదు. ఈ చోరీ యత్నం మొబైల్‌లో రికార్డ్ చేసి సోషల్ మీడియాలో షేర్ చేయడంతో వైరల్‌గా మారింది. అయితే వీడియో పుటేజ్ ద్వారా ఆ వ్యక్తిని గుర్తించారట పోలీసులు.. స్ధానికుడు అక్కడ వ్యక్తే ఈ దొంగతనానిని పాల్పడ్డాడు అని పోలీసులు తెలియచేశారు అయితే ఆమె చేతిని వెనక్కిలాక్కోవడం వల్ల ఇలా దొంగతనం జరగలేదని చెబుతున్నారు, ఇక పాల్ కూడా తాను నిలబడి మాట్లాడుతున్న సమయంలో దండలు తీశారు ఆ దండ మీకు బంగారు చైన్ లా కనిపించింది అంతే తాను బంగారు గొలుసు వేసుకోను అని చెప్పాడు పాల్ మరి ఇప్పుడు షర్మిల ఉంగరం పోవడంతో, రాజకీయ నాయకులు కాస్త సెక్యూరిటీ విషయంలో కూడా జాగ్రత్త వహించాలి అని అనుకుంటున్నారట. మరి ఇంకా ఎన్నికలకు 10 రోజుల సమయం ఉంది ఇంకెన్ని ఇలాంటి విచిత్రాలు చూడాలా అనిఅనుకుంటున్నారు జనం.