భార్యను ప్రేమించే భర్త.. భర్తను ప్రేమించే భార్య.. వారి అన్యోన్య దాంపత్యానికి గుర్తుగా ఇద్దరు పిల్లలు. ఇలా చాలా జీవితాలు ఉంటాయి ముఖ్యంగా ప్రేమకు చిహ్నంగా అన్యోన్యానికి దాంపత్య జీవితానికి గుర్తుగా ఇలాంటి వారిని చెప్పవచ్చు.. అవును ఇంతకు మించి ఏ దంపతులకు అయినా కావాల్సింది ఏమి ఉంటుంది…ఇలా అన్యోన్యంగా ఉంటున్న ఈ కుటుంబాన్నిఓ యాక్సిడెంట్ కుదిపేసింది.
ఉద్యోగానికి వెళుతున్న భర్తకు ఓరోజు అనుకోకుండా పెద్ద యాక్సిడెంట్ అయింది. ప్రాణాలతో బయట పడ్డాడు. కానీ పక్షవాతం వచ్చింది. దీంతో భార్య భర్తకు సేవ చేసేది. అయితే భర్తకు మాత్రం ఇది నచ్చలేదు. భార్యతో అన్నాడు.. తనను విడిచి పెట్టి మరొక వ్యక్తిని పెళ్లి చేసుకుని సుఖంగా ఉండమని చెప్పాడు. అయినా భార్య వినలేదు. చివరకు భర్త చెప్పినట్టుగా ఆమె మళ్లీ ఇంకో వ్యక్తిని పెళ్లి చేసుకుంది. … భార్య తన పాత భర్తను వదల్లేదు. కొత్త భర్త, అతనితో కలిగిన పాప, తన పాత భర్త, అతనితో కలిగిన ఇద్దరు పిల్లలతో కలిసి ఒకే ఇంట్లో ఉంటోంది. ఇంకా ఇందులో విచిత్రం ఏమిటంటే.. భార్య తన కొత్త భర్తతో కలిసి పాత భర్తకు సేవలు చేస్తూనే ఉంది. అవును, షాకింగ్ గా ఉన్నా ఇది నిజమే. చైనాలో జరిగింది ఈ యదార్థ సంఘటన.

వారి పేర్లు షు షిహాన్, షై షైపింగ్. వీరిద్దరిదీ అన్యోన్య దాంపత్యం. వీరికి ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. షు షిహాన్ ఓ మైనింగ్ కంపెనీలో పనిచేసేవాడు. 2002లో ఇతనికి యాక్సిడెంట్ అయింది. అయితే యాక్సిడెంట్‌లో ప్రాణాలతో బయట పడ్డాడు కానీ షు షిహాన్‌కు పక్షవాతం వచ్చింది. దీంతో మంచానికే పరిమితం అయ్యాడు. అయినా షైపింగ్ తన భర్తకు సేవలు చేసింది. అయితే ఆమె పడుతున్న కష్టం చూసి నొచ్చుకున్న షిహాన్ ఆమెను రెండో పెళ్లి చేసుకోమని, ఇంకో వ్యక్తితో సుఖంగా ఉండమని ఎన్నో సార్లు చెప్పాడు. అయినా షైపింగ్ వినలేదు. అయితే చివరకు భర్త చెప్పిన మాటనే షైపింగ్ అనుసరించాల్సి వచ్చింది. ఆమె తన కాలేజీ ఫ్రెండ్ అయిన లూ జాంగ్‌కుయ్‌ను పెళ్లి చేసుకుంది. అతనితో ఒక పాపను షైపింగ్ కన్నది.

అయితే లూ ను పెళ్లి చేసుకున్నా షైపింగ్ మాత్రం తన మాజీ భర్త షిహాన్‌ను వదల్లేదు. తన కొత్త భర్త లూ తో కలిసి షిహాన్ బాగోగులు చూసేది. అందుకు లూ సహకరించేవాడు కూడా. ఈ క్రమంలోనే షైపింగ్ తన మాజీ భర్త షిహాన్, అతనితో కలిగిన ఇద్దరు పిల్లలతోపాటు కొత్త భర్త లూ, అతనితో కలిగిన ఓ పాపతో కలిసి అందరూ ఒకే ఇంట్లో ఉంటున్నారు. షైపింగ్, లూ ఇద్దరూ షిహాన్‌ను కంటికి రెప్పలా చూసుకుంటున్నారు. ఇద్దరూ కలిసి షిహాన్‌కు సేవలు చేస్తున్నారు. అయితే లూ ను పెళ్లి చేసుకోవడం కోసం షైపింగ్ తన మాజీ భర్త షిహాన్‌కు విడాకులు ఇచ్చింది. అవును, మీరు విన్నది నిజమే. చట్ట ప్రకారం మళ్లీ పెళ్లి చేసుకోవాలంటే పాత భాగస్వామికి విడాకులు ఇవ్వాలి కదా. అందుకే షైపింగ్ అలా చేసింది. ఏది ఏమైనా.. నిజంగా ప్రేమ అంటే వీరిదే కదా. భర్తను వదలని భార్య, భార్యను వదలని భర్త.. పాత భర్తకు సేవలు చేసేందుకు పెళ్లి చేసుకుని కొత్త భర్తతో కాపురం ఉంటున్న భార్య… ఇద్దరూ కలిసి సేవలు చేయడం… నిజంగా ఏ కుటుంబమైనా వీరిని చూసి నేర్చుకోవాలి. అప్పుడు ఎలాంటి దారుణాలు జరగకుండా ఉంటాయి. ఏది ఏమైనా ఈ కుటుంబానికి హ్యాట్సాఫ్ చెప్పాల్సిందే.. మరి మీరు ఏమంటారు ఈ స్టోరీ పై
మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియచేయండి.