Quantcast
Channel: Viral – Telugu Messenger
Viewing all articles
Browse latest Browse all 2371

భ‌ర్త‌ని వ‌దిలేసి ప్రియుడితో పారిపోయిన భార్య గ్రామ‌స్తులు ఏం శిక్ష విధించారో తెలిస్తే..

$
0
0

ప్రేమ పెళ్లి చేసుకుంటున్న వారిని చాలా మందిని చూస్తున్నాం… అంతేకాదు ఇలాంటి వారిని వెతికి తీసుకువచ్చి గ్రామ‌క‌ట్టు బాట్ల ప్ర‌కారం శిక్ష కూడా విధిస్తున్నారు గ్రామ‌స్తులు.. అయితే పెళ్లి చేసుకోవ‌డానికి అబ్బాయి అమ్మాయి ఇష్టంతో పాటు వారి త‌ల్లిదండ్రుల అభిప్రాయం కూడా క‌ల‌వాలి… కాని కుటుంబాల క‌ట్టుబాట్లు వారి ప్రేమ మాకు అవ‌సరం లేదు అని చెబుతున్నారు ప్రేమికులు. ఇలా కొంద‌రు చేసే పనులు పెద్ద‌ల‌కు అలాగే పెళ్లి చేసుకున్న జంట‌ల‌కు పెద్ద ఇబ్బందిగా మార‌తున్నాయి. అయితే వ‌య‌సుకు వ‌చ్చి ప్రేమ‌తో వీరు పారిపోవ‌డం పెళ్లి చేసుకోవ‌డం చూస్తున్నాం, దీనికి భిన్నంగా పెళ్లి అయిన యువ‌తులు కూడా కొంద‌రు త‌మ ప్రియుళ్ల‌తో పారిపోతున్నారు, భ‌ర్త‌ని పిల్ల‌ల‌ని వ‌దిలి వేరే చోటికి వెళ్లిపోతున్నారు, ప్రియుడి మోజు తీరాక మ‌ళ్లీ భ‌ర్త పిల్లల ద‌గ్గ‌ర‌కు వ‌స్తున్నారు.

మధ్యప్రదేశ్‌లో దారుణం జరిగింది. ఇతర కులానికి చెందిన వ్యక్తితో పారిపోయిందని ఓ వివాహితకు వింత శిక్ష విధించారు గ్రామ పెద్దలు.. ఇంట్లో నుంచి పారిపోయిన ఆమెను పట్టుకొచ్చి మరి దారుణంగా హింసించారు. పరాయి కులస్తుడితో వెళ్లినందుకు శిక్షగా భర్తను భుజంపై ఎక్కించి ఊరేగించారు. గ్రామపెద్దల ఆదేశాలతో చేసేది ఏమి లేక భర్తను తన భుజాలపై కూర్చోబెట్టుకుని ఆమె నడక ప్రారంభించింది. ఆమె అలా నడుస్తూ వెళ్తుంటే ముందు కొందరు వ్యక్తులు డ్యాన్సు చేస్తూ గుంపుగా వెళ్లారు. అతడి బరువును మోయలేక ఆమె ఆగితే వెంటనే చుట్టూ ఉన్న జనం అరుపులు, కేకలతో కర్రలతో దాడి చేశారు. దీన్ని మరికొందరు వీడియోలు తీశారు. ఈ వీడియోలు వాట్సాప్‌లో చక్కర్లు కొట్టడంతో పోలీసుల దృష్టికెళ్లింది.

వెంటనే కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ఈ ఘటనకు సంబంధించిన 12 మందిని అదుపులోకి తీసుకున్నట్లు చెప్పారు. ఈ అమానుష ఘటనపై ఎస్పీ వినీత్ జైన్ మాట్లాడుతూ.. ‘10 రోజుల క్రితం సదరు మహిళ తన ప్రియుడితో పారిపోయింది. 10-12 రోజుల తర్వాత ఆ ప్రియుడు ఆమెతో అసభ్యకరంగా ప్రవర్తించడం మొదలు పెట్టారు. ఇంతలో ఆమెను వెతుక్కుంటూ భర్త, అతని సోదరులు వచ్చారు. ఆమెను ఇంటికి తీసుకెళ్లి కులపెద్దల సమక్షంలో పంచాయితీ పెట్టారు. వారు అమానుషంగా భర్తను భుజాలపై ఎక్కించుకొని ఊరేగాలని శిక్షవిధించారు. అంతేకాకుండా చున్నీని లాగేసి తీవ్రంగా అవమానించారు. ఇలాంటి అమానవీయ ఘటనలు చోటు చేసుకోకుండా చర్యలు తీసుకుంటాం’ అని ఎస్సీ మీడియాకు తెలిపారు. మ‌రి ఈ శిక్ష పై మీ అభిప్రాయాన్ని కామెంట్ల రూపంలో తెలియ‌చేయండి.


Viewing all articles
Browse latest Browse all 2371

Trending Articles