ఈ ప్రపంచంలో ఉన్న గొప్ప బంధాలలో భార్యాభర్తల బంధం గొప్పది.ఎవరో తెలియని వ్యక్తిని పెళ్లి చేసుకుని వారితో జీవితాంతం జీవించాలి.ఈ మధ్య కొందరు ప్రేమ పెళ్లి చేసుకుంటున్నారనుకోండి.అయితే కాపురం అన్నాక భార్యాభర్తల మధ్య రకరకాల గొడవలు వస్తుంటాయి. కొన్నివిషయాల్లో భర్త, మరికొన్ని విషయాల్లో భార్య సర్దుకుపోతే సమస్యలు వాటంతట అవే సమసిపోతాయి. దీనిని అర్థం చేసుకున్న ఏ భార్యాభర్తలు అయినా సంతోషంగా ఉంటారు. అలాంటి ఒక జంట గురించే మీకు చెప్పబోతున్నాను. భర్త సక్సెస్ కోసం భార్య చేసిన పని సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. మరి వారి స్టోరీ గురించి పూర్తీగా తెలుసుకుందామా.

బెంగుళూర్ కు చెందిన మనోజ్ కు ఏదైనా వ్యాపారం చెయ్యాలని ఆశ. చాలా ఏళ్ళు కష్టపడి 5 లక్షలు జమచేసి ఒక తోళ్ల పరిశ్రమను స్టార్ట్ చేశాడు. అయితే బిజినెస్ స్టార్ట్ చేసిన కొత్తల్లో ఉండే కష్టాలు వాళ్ళకు వచ్చాయి. అయినా మనోనిబ్బరంతో ఉండాల్సిన పాట్నర్స్ పక్కకు తప్పుకున్నారు. అప్పటికే పెట్టిన డబ్బంతా కరిగిపోయింది. సేవింగ్స్ అన్ని కరిగిపోయాయి. ఇప్పుడు కుటుంబం గడవాలంటే ఖచ్చితంగా జాబ్ చెయ్యాల్సిన పరిస్థితి వచ్చింది. బిజినెస్ చేసి మంచిగా సంపాదించాలని ఉన్నా భార్యాబిడ్డల కోసం జాబ్ చెయ్యడానికి సిద్దమయ్యాడు. ఇంతలో మనోజ్ భార్య శ్రవణ్య అతనికి అండగా నిలిచింది. నాకు జాబ్ వచ్చింది. ఇంటి అవసరాల మీద దృష్టి పెట్టకుండా బిజినెస్ మీద దృష్టి పెట్టమని సలహా ఇచ్చింది. అయితే శ్రవన్యకు వచ్చింది నైట్ షిప్ట్ జాబ్. దాంతో రోజు రాత్రి ఆమె జాబ్ కు వెళ్ళింది. ఇక మనోజ్ బిజినెస్ మీద దృష్టి పెట్టాడు. పోయిన అనుభవంతో ఈసారి నష్టాలూ రాకుండా జాగ్రత్త పడ్డాడు. డబ్బులు మిగలకపోయిన బిజినెస్ లో సర్కిల్ ఏర్పడుతూ వచ్చింది. ఇంటి అవసరాలు భార్య చూసుకుంటుండంతో మనోజ్ పూర్తీగా బిజినెస్ మీద దృష్టి పెట్టాడు.అయితే ఒకరోజు రాత్రి 7 గంటలకు ప్రభుత్వ కాంట్రాక్ట్ వచ్చినట్టు మెయిల్ వచ్చింది. దాని విలువ 40 లక్షలు. ఈ ప్రాజెక్ట్ తో మనోజ్ లైఫ్ సెటిల్ అయ్యినట్టే. ఇక తన ఆఫీస్ లోనే ఉండి కాంట్రాక్ట్ ప్రాసెస్ ను పూర్తీ చేసుకుని రాత్రి 10 గంటలకు బయటకు వచ్చాడు మనోజ్.
ఈ క్రింది వీడియో చూడండి
ఈ విషయాన్నీ అతని భార్యకు చెప్పడానికి నేరుగా ఆమె ఆఫీస్ కు వెళ్ళాడు. అక్కడ అడగగా శ్రవణ్య అనే పేరుతో ఇక్కడ ఎవరు పనిచెయ్యడం లేదు అని చెప్పారు. ఆ మాట విన్న వెంటనే మనోజ్ షాక్ అయ్యాడు. మరి ఎక్కడ జాబ్ చేస్తుంది. నాతో ఎందుకు అబద్దం చెప్పింది అని ఆలోచిస్తూ ఇంటికి వెళ్తుంటే రోడ్డు మీద శ్రవన్యను చూసి షాక్ అయ్యాడు. రోడ్డు పక్కన ఒక హోటల్ లో శ్రవణ్య పనిచేస్తూ భర్తకు కనిపించింది.చెమటలు కక్కుతూ పొయ్యి మీద ఏదో పెట్టి వండుతూ ఉంది. దీనిని చూసి మనోజ్ నమ్మలేకపోయాడు.తన భార్య దగ్గరకు వెళ్ళాడు.భర్తను చూసి శ్రవణ్య ఉలిక్కిపడింది. ఇద్దరికీ పరిస్థితి అర్థం అయిపొయింది. ముందు భయంతోనే శ్రవణ్య మాట్లాడటం మొదలుపెట్టింది.మీరు అనుకున్నది సాధించాలంటే నేను మీకు సాయంగా ఉండాలనుకున్నా. అందుకే ఇక్కడ వంట మాస్టర్ గా చేరాను. మీకు చెప్పుకునే చేశా నన్ను క్షమించండి అని అన్నది. ఆమె మాట పూర్తీ అవ్వకముందే భార్య కాళ్ళ మీద పడ్డాడు భర్త. నీలాంటి భార్య దొరికినందుకు నేను చాలా అదృష్టవంతుడిని. నీకు ఏమి ఇచ్చి ఋణం తీర్చుకోగలను అని కన్నీళ్లు పెట్టుకున్నాడు. అక్కడ ఉన్న వాళ్లందరికీ వీళ్ళ ప్రేమ అర్థం అయ్యింది.మనోజ్ తనకు వచ్చిన ప్రాజెక్ట్ గురించి చెప్పాడు. అప్పుడు శ్రవణ్య ఆనందానికి అవధులు లేకుండా పోయాయి.నాకు తెలుసండి మీరు సాధిస్తారు అని భర్తను గట్టిగా కౌగిలించుకుంది. ఇదంతా అక్కడ ఉండి చూస్తున్న ఒక ఐటీ ఉద్యోగి వీళ్ళ కథను తెలుసుకుని పేస్ బుక్ లో పోస్ట్ చేశాడు. దాంతో ఈ భార్యాభర్తల ఘటన వైరల్ అయ్యింది. వీళ్ళ కథ వింటుంటే భార్య అంటే ఇలాగె ఉండాలి అని అనిపిస్తుంది కదా..మరి ఈ భార్యాభర్తల ఘటన గురించి మీ అభిప్రాయాలను మాకు కామెంట్ రూపంలో చెప్పండి.