Quantcast
Channel: Viral – Telugu Messenger
Viewing all articles
Browse latest Browse all 2371

తల్లికోసం ప్రాణత్యాగం చేసిన రియల్ హీరో ఇప్పటికి ఇలాంటి కొడుకులు ఉన్నారా.!

$
0
0

సృష్టికి మూలం ‘అమ్మ’…త్యాగానికి ప్రతిరూపం ‘అమ్మ’…తీర్చుకోలేనిది ‘అమ్మ’ రుణం… ఈ సృష్టిలో అమ్మ కన్నా గొప్పది ఇంకేమీ లేదు. అమ్మే లేకపోతే మనం లేము. మనల్ని నవమాసాలు మోసి, పురుటి నొప్పులు భరించి మనకు జన్మనిస్తుంది. పుట్టాక మనల్ని కంటికి రెప్పలా కాపాడి, మన ఆలనా పాలనా చూసి, పెంచి పెద్ద చేస్తుంది. మరి అలాంటి అమ్మకి మనం ఏమి చేసినా తక్కువే.ఈ కాలంలో ఎవరి గురించి వాళ్ళు ఆలోచించేవారే తప్ప మనకు జన్మనిచ్చిన వారి గురించి ఆలోచించేవాళ్ళే లేరు.నేను బాగుంటే చాలు అనుకుంటారు తప్ప తల్లిదండ్రులను పట్టించుకోలేని వాళ్ళు అడుగడునా ఉంటారు.అయితే అందరు అలాగే ఉండరు.ఇప్పుడు నేను మీకు చెప్పబోయే ఘటన గురించి వింటే ఈకాలంలో ఇలాంటి వాళ్ళు కూడా ఉంటారా అని అనిపించకమానదు.మరి ఆ ఘటన గురించి పూర్తీగా తెలుసుకుందామా.

కృష్ణా జిల్లా కోడూరు మండలం ఇస్మాయిల్ బేగ్ పేటకు చెందిన కోట వంశీధర్… తూర్పుగోదావరి జిల్లా రామచంద్రపురం “SI” గా పనిచేస్తున్నారు. వంశీధర్ ఎంత SI అయినా అమ్మచాటు బిడ్డా.తల్లి అంటే అతడికి పంచప్రాణాలు.ఇక ఈమధ్య బంధువుల పెళ్ళికి హాజరవడానికి తన తల్లిని తీసుకొని కారులో బయలుదేరాడు.పెళ్లి వేడుకలు అయిపోయాకా ఇద్దరు తిరిగు ప్రయాణం అయ్యారు.మధ్యాహ్నం సమయంలో విజయవాడ నుంచి అవనిగడ్డ కరకట్టపై నుంచి వెళుతుండగా కారు టైరులో గాలి తగ్గిపోయి “కేఈబీ కెనాల్” కాలువలోకి కారు దూసుకెళ్లింది. ప్రమాదం పసికట్టిన “వంశీధర్” క్షణాల్లో డోర్ తీసుకొని బయటకు దూకేసాడు.దాంతో ఆ కార్ కాలువలో మునికిపోయింది.అప్పుడే ఆ కారులో అమ్మ ఉంది కదా ? అది గమనిచకుండా నేను దూకేసానే అని కన్నీళ్ళతో అమ్మకోసం ఆ కాలువలో దూకేసాడు.కారు డోర్ లాక్ చేసి ఉంది.నీరు నిండిపోయి అమ్మ ప్రాణాలతో కొట్టుకుంటుంది.అలాంటి పరిస్థితిలో ఉన్న తన తల్లిని ప్రాణాలకు తెగించి మరీ అతికష్టం మీద ఆమెను ఒడ్డుకు చేర్చాడు.అప్పటికే దాదాపు 10నిమిషాలు నీటిలోనే ఉన్నాడు వంశీధర్.దాంతో చాల అలిసిపోయాడు.వారి పరిస్థితి చూసిన అక్కడి గ్రామస్థులు అబులేన్స్ కి కాల్ చేసి వారికి సహాయం చేసారు.. తల్లి ప్రాణాలతో బయటపడకా చాల ఆనందపడ్డాడు వంశీధర్..కాని అప్పుడే అతడికి మరో ఆలోచన వచ్చింది.కారులో ఉన్న డబ్బులు.అమ్మ మెడలోని బంగారం కారులోనే ఉన్నాయి అని గుర్తొచ్చింది..

అంతే మల్లి ఆ కాలువలో దూకేసాడు.అప్పటికే అలసిపోవడంతో తల్లి వద్దు అని చెప్పినా వినకుండా వంశిధర్ మల్లి నీటిలోకి దుసేసాడు.అప్పుడే అనుకోకుండా పట్టుజారి నీటిలో కొట్టుకుపోయాడు.కళ్ళముందే కొడుకు గల్లంతవడం చూసి తల్లి “లక్ష్మి” కన్నీరు మున్నీరు అవుతుంది.తల్లి కోసం ప్రాణాల మీదకు తెచ్చుకున్న ఈ కొడుకు ఉదంతం స్థానికంగా విషాదం నింపింది.అంత మంచి మనసున్న SI వంశీధర్ కోసం తన తోటి పోలీసులు అధికారులు ఇంకా వెతుకుతూనే ఉన్నారు.. కాని అతడి జాడ మాత్రం దొరకడం లేదు.చూసారా ? ప్రమాదంలో చిక్కుకున్నప్పుడు తల్లి ప్రాణం ముఖ్యమా ? నా ప్రాణం ముఖ్యమా అనే ఆలోచన వస్తే నన్ను నమ్ముకొని నాకుటుంబం ఉంది అని చెప్పి ఎవ్వరైనా ముందు తమ ప్రాణాలకే ప్రాదాన్యత ఇస్తారు కాని ఇక్కడా వంశీధర్ అలా చేయలేదు.. చిన్నతనం నుండి తనను వేలుపట్టుకొని నడిపించిన తన అమ్మ చనిపోతే ఎలా ? అనే ఆలోచన రాగానే తన ప్రాణాలకు విలువేలేదు అనుకున్నాడు.అందుకే తన ప్రాణాలు పోగొట్టుకొని మరీ తన తల్లిని రక్షించి అందరికి ఆదర్శం అయ్యాడు వంశీధర్.


Viewing all articles
Browse latest Browse all 2371

Trending Articles