ఈరోజుల్లో సెల్ ఫోన్ ఉంటే అందులో కచ్చితంగా వాట్సాప్ ఉంటుంది. తాజాగా ఈ ప్రముఖ సామాజిక మాధ్యమం వాట్సప్.. అత్యంత ప్రమాదకరమైన వైరస్ బారిన పడినట్లు గుర్తించారు. ఆండ్రాయిడ్ ఆధారిత ఫోన్లలో నిక్షిప్తం చేసుకున్న సమాచారాన్ని గప్‌చుప్‌గా తరలించే స్పైవేర్‌ను వాట్సప్‌లో ప్రవేశపెట్టినట్లు తెలుస్తోంది. సైబర్ ఇంటెలిజెన్స్ కంపెనీ ఎన్ఎస్ఓ ఈ స్పైవేర్‌ను రూపొందంచిదని, వాయిస్ కాల్ ప్రోగ్రామ్ ద్వారా దీన్ని ప్రవేశపెట్టినట్లు వాట్సప్ సంస్థ గుర్తించింది. దీన్ని సరిచేసింది. వాట్సప్‌లో చొరపడిన ప్రమాదకరమైన స్పైవేర్‌ను తొలగించామని ప్రకటించింది. స్మార్ట్ ఫోన్ల వినియోగదారులు తమ వాట్సప్ యాప్‌ను అప్‌డేట్ చేయడం ద్వారా ఈ వైరస్‌ను నాశనం చేయవచ్చని వెల్లడించింది. ఇజ్రాయెల్‌లోని హెర్జిలియాలో ప్రధాన కేంద్రంగా ఈ సైబర్ ఇంటెలిజెన్స్ సంస్థ తన కార్యకలాపాలను కొనసాగిస్తోంది.

ప్రముఖ సామాజిక మాధ్యమం వాట్సప్.. అత్యంత ప్రమాదకరమైన వైరస్ బారిన పడినట్లు గుర్తించారు. ఆండ్రాయిడ్ ఆధారిత ఫోన్లలో నిక్షిప్తం చేసుకున్న సమాచారాన్ని గప్‌చుప్‌గా తరలించే స్పైవేర్‌ను వాట్సప్‌లో ప్రవేశపెట్టినట్లు తెలుస్తోంది. సైబర్ ఇంటెలిజెన్స్ కంపెనీ ఎన్ఎస్ఓ ఈ స్పైవేర్‌ను రూపొందంచిదని, వాయిస్ కాల్ ప్రోగ్రామ్ ద్వారా దీన్ని ప్రవేశపెట్టినట్లు వాట్సప్ సంస్థ గుర్తించింది. దీన్ని సరిచేసింది. వాట్సప్‌లో చొరపడిన ప్రమాదకరమైన స్పైవేర్‌ను తొలగించామని ప్రకటించింది. స్మార్ట్ ఫోన్ల వినియోగదారులు తమ వాట్సప్ యాప్‌ను అప్‌డేట్ చేయడం ద్వారా ఈ వైరస్‌ను నాశనం చేయవచ్చని వెల్లడించింది. ఇజ్రాయెల్‌లోని హెర్జిలియాలో ప్రధాన కేంద్రంగా ఈ సైబర్ ఇంటెలిజెన్స్ సంస్థ తన కార్యకలాపాలను కొనసాగిస్తోంది.
/cdn.vox-cdn.com/uploads/chorus_image/image/63336553/akrales_180215_2310_0013.0.jpg)
సౌదీ అరేబియాకు చెందిన ప్రముఖ జర్నలిస్ట్ జమాల్ ఖషోగ్గి కొద్దిరోజుల కిందట టర్కీలోని ఇస్తాంబుల్‌లో దారుణ హత్యకు గురైన విషయం తెలిసిందే. ఈ హత్యోదంతంలోనూ స్పైవేర్ కీలక పాత్ర పోషించినట్లు తెలుస్తోంది. ఖషోగ్గికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని ఈ వైరస్ చేరాల్సిన చోటికి చేరవేసినట్లు అనుమానిస్తున్నారు. ఖషోగ్గి సన్నిహితుడొకరు కూడా వాట్సప్ ద్వారా ఈ వైరస్ బారిన పడ్డారని, అతనిపై హత్యాయత్నం జరిగి ఉండొచ్చని చెబుతున్నారు.
ఈ క్రింది వీడియో చూడండి
ఆండ్రాయిడ్ ఆధారిత స్మార్ట్ ఫోన్లను హ్యాక్ చేయడం ఈ స్పైవేర్ ప్రధాన ఉద్దేశం. స్మార్ట్ ఫోన్లలో భద్రపరచుకున్న ఎలాంటి సమాచారాన్ని, సందేశాన్నయినా స్పైవేర్ ఇట్టే సంగ్రహించగలదని అంటున్నారు. స్మార్ట్‌ఫోన్ కెమెరాలను నియంత్రించడంతో పాటు వాటిని తనకు అనుకూలంగా మార్చుకునే సామర్థ్యం దీనికి ఉందని నిపుణులు విశ్లేషిస్తున్నారు.మానవహక్కుల కార్యకర్తల ఫోన్లను హ్యాక్ చేయడమే దీని వెనుక ప్రధాన ఉద్దేశమని చెబుతున్నారు. వారితో పాటు కీలక కేసులను వాదించే లాయర్లపైనా ఈ స్పైవేర్‌ను ప్రయోగించినట్లు సమాచారం.

ఈ లోపాన్ని తాము సరిచేశామని వాట్సప్ సంస్థ ప్రతినిధి ఒకరు వెల్లడించారు. వాట్సప్ యూజర్లు తమ యాప్‌ను అప్‌డేట్ చేసుకోవడం ద్వారా ఈ స్పైవేర్‌ను తొలగించుకోవచ్చని అన్నారు. వాట్సాప్ వాయిస్ కాలింగ్ ద్వారా వచ్చే మిస్డ్ కాల్స్‌తో ఈ వైరస్ ఫోన్లలోకి ప్రవేశించి ఉంటుందని సంస్థ ప్రతినిధులు అంచనా వేశారు. వాయిస్ కాలింగ్స్‌కు అదనపు భద్రతా ఫీచర్లను అందుబాటులోకి తీసుకొచ్చే ప్రయత్నంలో తాము మొదటి సారిగా దీన్ని గుర్తించినట్లు వెల్లడించారు. ఎంతమంది వినియోగదారులు ఈ స్పైవేర్ బారిన పడ్డారనే విషయాన్ని మాత్రం నిర్ధారించడం కష్టమని అన్నారు.
ఈ క్రింది వీడియో చూడండి