రూపవతి అయిన యువతిని భార్యగా చేసుకోవాలని చాలామంది యువకులు అనుకుంటారు. కేవలం అందమే కాదు ఆమె మనస్తత్వం ఏమిటి అనే కుతూహలం కూడా వారిలో ఉంటుంది. ఈ నేపథ్యంలో జోతిష్యం, వాస్తు, హస్త సాముద్రికం లాంటివి ఉన్నట్లే ముఖాన్ని బట్టి వారి స్వభావాన్ని అంచనా వేసే శాస్త్రం కూడా ఒకటుంది. ఇది పూర్వం నుంచే ఉన్నా నేడు దీనినే ‘ఫేస్ రీడింగ్’ అని పిలుస్తున్నారు.అలా ఫేస్ రీడింగ్ శాస్త్రం అనుసరించి ఆడవారిని కొందరు పూర్వకాలం పరిణయమాడేవారట.. అదే విధంగా నేటి తరం కొంతమంది అబ్బాయిలు కూడా వీటినే ఫాలో అవుతున్నారు.

ఆనాడు పెద్దలు పెళ్లి చేసుకునే యువతుల గురించి పలు సామెతలను చెప్పేవారు. ప్రతి ఒక్కరూ రూపవతి అయిన భార్యనే కోరుకుంటే మరి రూపం లేని ఆడవారి సంగతి…అందుకే భగవంతుడు కూడా లోకోభిన్న రుచి అన్నట్లుగా ఒక్కో మనిషికి ఒక్కో రుచి ఇష్టం అన్నట్లుగా అభిరుచి ఆకర్షణ అనేవి కల్పించాడు. కొంతమందికి నచ్చని పిల్ల పెళ్లిచూపుల్లో మరికొంత మందికి నచ్చుతోందంటే దానికి కారణాలు అనేకం ఉంటాయి. తాను వలచిందే రంభ, తాను మునిగిందే గంగ అనుకుని సర్దుకుపోయేవారిని మనం గమనిస్తూనే ఉంటాము. అఫ్‌కోర్స్, ప్రస్తుతం అలాంటి ఆచారాలను ఎవరూ కూడా పాటించడం లేదనుకోండి. చూడగానే అమ్మాయి మొహంలో లక్ష్మి కళ తాండవిస్తోందని కాణీ కట్నం లేకుండా చేసుకున్న సందర్భాలు కూడా ఉన్నాయి. వీటన్నింటినీ పక్కకు పెడితే, మనకు పూర్వకాలం నుంచి ఫేస్ రీడింగ్ ఉంది.అందుకే పెద్దలు అమ్మాయిని చూడగానే ఆమె గుణగణాలను గుర్తించేవారు. కొందరు జ్యోతిష్యులు ఈ ఫేస్ రీడింగ్ ఆధారంగా మనలను అంచనావేస్తుంటారు. అలాగే వాత్సాయనుడు కూడా ఆడవారి ముఖాన్ని…ఆకారాన్ని బట్టి వాళ్లను వర్గీకరించాడు. పూర్వకాలం నుంచి ఈ ఫేస్ రీడింగ్ శాస్త్రం ఉంది కానీ దానిని చాలామంది విశ్వసించేవారు కాదు. అలా ఫేస్ రీడింగ్ శాస్త్రం అనుసరించి ఆడవారిని కొందరు పూర్వకాలం పరిణయమాడేవారట..

- చూడగానే పొడవుగా అనిపించే ఆడపిల్ల దాంపత్య సుఖం పట్ల అంతగా ఆసక్తి చూపించదట.
- చూపులకు పొట్టిగా అనిపించే ఆడపిల్ల…ఆనందకరమైన జీవితం అనుభవించాలనే ఆసక్తిని కలిగి ఉం టుందట. సర్ధుకుపోయే స్వభావం ఈమె నైజం. దాంపత్య సుఖం అందిం చాలనే కోరిక మెండుగా ఉంటుందట.
- మధ్యస్తంగా అంటే అం త పొడవు..అంత పొట్టి కాని ఆడపిల్ల…గృహిణిగా పరిపూర్ణ బాధ్యతాయుతంగా ఉంటుందట. అనుకూలమైన నిర్ణయాలు తీసుకుని భర్తకు చేదోడు వాదోడుగా ఉంటుందట.
- జుట్టు కొంచెం ఎరుపు రంగులో ఉన్న ఆడపిల్ల బాగా పొగరుబోతుగా ఉంటుం దట. గయ్యాళిగా తన పంతం నెరవేర్చుకోవాలని ఆరాటపడుతుందట.
- జుట్టు పొడవుగా, ఒత్తుగా ఉండి, శిరోజాలు తుమ్మెదరెక్కల్లా నల్లగా ఆరోగ్యంగా ఉండే ఆడపిల్ల ఇంట్లో అడుగుపెడితే లక్ష్మీదేవి ఆ ఇంట తాండవిస్తుందని, ఆమె అదృష్టజాతకురాలని ఆమెను పెండ్లాడిన భర్తకు అన్నింటా కలిసివస్తుందని నమ్మేవారట.

- శిరోజాలు మృదువుగా, పట్టుకుచ్చులా, నల్లగా నిగనిగలాడేలా కనిపించే ఆడపిల్ల పుట్టినింటికి, మొట్టినింటికీ కూడా పేరుతీసుకువచ్చే అనుకూలవతిగా చెబుతారు.
- శిరోజాలు పొట్టిగా, అనారోగ్యంగా ఉన్న ఆడపిల్ల అసూయా, ద్వేషాలతో ఎదుటివారిని ఎప్పుడూ ఆడిపోసుకుంటూ తనతోపాటు ఇతరులను కూడా టెన్షన్స్‌కు గురిచేయడంలో సిద్ధహస్తురాలని ప్రతీతి.
- కొందరి తల పున్నమి చంద్రునిలా గుండ్రంగా ఉంటుంది. చూడగానే చంద్రబింబం వంటి మోము అని అనుకుంటారు అంతా…కానీ..అలా గుండ్రని ముఖం కలిగిన అమ్మాయిలు అదృష్టవంతులు కాదట. జీవితంలో కష్టాలు అనుభవిస్తారు.
- కొందరికి తల గోపురం మాదిరిగా ఎత్తుగా ఉంటుంది. అటువంటి అ మ్మాయిలు కొంచెం నమ్మదగినవారు కాదు. కాలానుగు ణంగా వీరి ప్రవర్తన ఒక్కోరోజు ఒక్కోరకంగా మారిపోతుంది. వీరు తొందరగా నిర్ణయాలు తీసుకుంటారు…మార్చేసుకుంటారు కూడా…వీరి ప్రేమ కూడా ఎక్కువకాలం నిలబడదు. అలా అని ఫేస్ రీడింగ్‌నే పట్టుకు కూచోవడం కూడా మూర్ఖత్వమే అవుతుంది.
- నుదుటి భాగం ఎత్తుగా ఉన్న స్ర్తీ అదృష్టజాతకురాలు. ఐశ్వర్యం జన్మాంతం ఆమెతో ఉంటుందని అంటారు.
ఈ క్రింది వీడియో చూడండి
- నుదిటి భాగం మధ్యలో బాగా లోతుగా ఉన్నట్లుగా కనిపించే అమ్మాయిలను తొందరపడి పెళ్లిచేసుకోకపోవడమే మంచిదని అనుకునేవారట. ఎందుకంటే ఆమె చంచల స్వభావి అని మోసం చేసే నైజం ఎక్కువ అనేవారు.
- నుదిటి భాగం పొడవుగా ఉండి పక్కన నరాలు పైకి కనిపించేలా ఉండే అమ్మాయికి అసూయ ఎక్కువగా ఉంటుందట. ఈ అసూయతోటే సంసారాన్ని కూడా నరకం చేసుకుంటుందని అటువంటి వారిని పెళ్లాడటం అంత శ్రేయస్కరం కాదని అనుకునేవారట.
- ఆడవారి నుదుటి భాగం పొడవు ఎక్కువగా వెడల్పు ఎక్కువగా ఉండే వారిని దురదృష్ట జాతకురాలిగా అభివర్ణించేవారు. వీరి జీవితం అంతా కూడా మధ్యతరగతి ఆడవారిలా కోరికలు నెరవేరక అసంతృప్తితో కూడిన జీవితం గడపవలసి వస్తుందని అనేవారట.
ఇలా ఆడవారి పేస్ ను బట్టి వారి స్వభావాన్ని తెలుసుకుని పెళ్లి చేసుకునేవారు. మరి పేస్ ను బట్టి స్వభావాన్ని తెలుసుకునే ఈ విధానం గురించి మీ అభిప్రాయాలను మాకు కామెంట్ రూపంలో చెప్పండి.
The post ఫేస్ రీడింగ్ టిప్స్ తో ఒక అమ్మాయి క్యారెక్టర్ ఎలాంటిదో ఇట్టే తెలుసుకోవచ్చు appeared first on Telugu Messenger.