చాలా మంది వారికి ఆడపిల్ల లేదని ఆడపిల్ల గౌన్ వారికి పుట్టిన మగపిల్లాడికి వేసి మురిసిపోతూ ఉంటారు. ఇది దాదాపు అందరు చేసే పనే కదా..ఇందులో చెప్పేదేముంది అని అనిపిస్తుంది కదూ.. ఉంది. దీని గురించి తెలుసుకోవాల్సింది చాలా ఉంది. ఇలా చెయ్యడం వలన ఎంత దారుణం జరుగుతుందో ప్రతి ఒక్కరు తెలుసుకోవాలి. ఎందుకంటే ఇలా మగపిల్లాడికి ఆడపిల్ల బట్టలు వేసేవారు ప్రతి 10 మందిలో 9 మంది ఉంటారు. అయితే వారు అలా చెయ్యడం ఎంత తప్పో తెలుసుకుంటే ఇంకెప్పుడు అలా చెయ్యరు. మరి ఇది ఎంత ప్రమాదకరమో ఇప్పుడు తెలుసుకుందాం.
సాధారణంగా మన ఇంట్లోనో లేదా మన పక్కింట్లోనే వారికి ఆడపిల్లలు లేకపోతే వారికి ఉన్న మగపిల్లాడికి ఆడపిల్ల డ్రెస్ వేసి వారిని ఫోటో తీసి ఆ ఫోటోను చూసి ముసిముసి నవ్వులు నవ్వుతు మురిసిపోతూ ఉంటారు. కానీ ఇది సమ్మతం కాదు. ఇలాంటివి చెయ్యొచ్చు కానీ ఒక నిర్ణిత వయసు వరకే చెయ్యాలి. అంటే మూడేళ్ళ వయసు వరకు ఇలాంటివి చేస్తేనే అందంగా ఉంటుంది. వారికి ఊహ తెలియనంత వరకే ఇలా చెయ్యాలి. ఆ మూడేళ్ళ వయసు దాటాకా ఇలాంటివి చేస్తే వారి ఆలోచనలు మారిపోతాయంట. కన్నతండ్రులు వారికి ఇలా లేడి గెటప్ వేసి మురిసిపోతున్నారంటే వారిని ఇష్టపడుతున్నట్టే కదా. అయితే అమ్మాయిలు ఎలా ఉంటారు, ఎలాంటి వస్త్రాలు ధరిస్తారు. ఎలాంటి లో దుస్తులు వేసుకుంటారు. వారిలా నడవాలి, మాట్లాడాలి, హొయలొలుకాలి అనే ఆలోచనలు కలుగుతాయంట. అలా వారు కూడా ఎక్కువగా అమ్మాయిలతోనే స్నేహం చేస్తారంట. యుక్త వయసు వచ్చేసరికి వారు ఈ పరిస్థితి వలన వారిలో జరగాల్సిన హార్మోన్ల సమతుల్యత లేకుండా చివరికి వారు ట్రాన్స్ జెండర్ లా మారే పరిస్థితి కూడా ఉందని మానసిక నిపుణులు తెలియజేస్తున్నారు.

ఇలా కనుక జరిగితే ఆ పిల్లల కంటే ఎక్కువగా బాధపడేది మీరే. ట్రాన్స్ జెండర్స్ అంటే ఇంకా వివక్షత పోనీ సమాజంలో బతుకుతున్నాం మనం. అసలు వారిని దగ్గరకు కూడా రానివ్వని మనుషులు మన చుట్టూ ఎందరో ఉన్నారు. వారిని కన్న తల్లిదండ్రులను కూడా అదో రకంగా చూసే మనుషులు మన మధ్య తిరుగుతున్నారు. ఎవరి దాకానో ఎందుకు మీ పిల్లలు అలా ఉంటె మీరు సమాజంలో తలెత్తుకుని తిరుగుతారా..బయట ఎవరి ఇంట్లోనో జరిగితే మనం నీతులు మాట్లాడతాం. ట్రాన్స్ జెండర్ అయితే తప్పేంటి..అది ఒక ఒక జాతి అని అంటాం కానీ మన ఇంట్లో అలాంటి వాళ్ళు పుడితే మనం అవమానంగా భావిస్తాం. అయితే పుట్టుకతోనే అలా మారేవారు ఉండరు కొందరు ఇలా ఆడపిల్లల వస్త్రాల మీద, వారి అలవాట్ల మీద ఇష్టం పెరిగి కూడా ట్రాన్స్ జెండర్ గా మారుతారు. అలా వారికి ఇష్టాలు కలిగేలా చేసేది కూడా మీరే. కాబట్టి పుట్టిన అబ్బాయిని అబ్బాయిలాగానే పెరగనివ్వండి. పుట్టిన అమ్మాయిని అమ్మాయిలాగానే పెరగనివ్వండి. అప్పుడు మీకే మంచిది.
The post మగపిల్లలకు ఆడపిల్ల గౌన్ వేసి ఫోటోలు తీసుకునే ప్రతి తల్లిదండ్రులు ఈ వీడియో చూస్తే షాక్… appeared first on Telugu Messenger.