ప్రేమలో పీకల్లోతు మునిగిపోయి ఉన్న ప్రేయసీ ప్రియులు ఒకరి కోసం ఒకరు ఏం చేయడానికైనా, ఎంతకైనా తెగిస్తారు. అది సహజమే. అది రియల్ లవ్ అయితేనే అలా ఉంటుంది. కేవలం ఫాంటసీనో, అట్రాక్షనో అయితే అంత ఉండదు లెండి. అది వేరే విషయం. అయితే రియల్ లవ్‌లో ప్రేమికులు ఒకరి కోసం ఒకరు ఎంతగానో తపన పడతారు. ఒకరిని ఒకరు ఎంతగానో ప్రేమించుకుంటారు. తమ ప్రేయసి లేదా ప్రియుడి కోసం వారు ఏమైనా చేస్తారు. అందుకు ఎంతకూ వెనుకాడరు. దాని పర్యవసానంగా వచ్చే ఫలితం ఎలా ఉన్నా తమ లవర్ కోరికను తీర్చడమే పనిగా పెట్టుకుంటారు. అలాంటి ఓ లవ్ కపుల్ గురించే ఇప్పుడు చెప్పబోయేది. ప్రేమంటే… ఆ జంటది అలాంటి, ఇలాంటి ప్రేమ కాదు. చాలా లావు పాటి ప్రేమ..!

మెరికాకు చెందిన మోనికా రైలీ, ఆమె బాయ్ ఫ్రెండ్ ఇద్దరూ పీకల్లోతు ప్రేమలో మునిగిపోయారు. అయితే ఆమె బాయ్‌ఫ్రెండ్‌కు బాగా లావుగా ఉన్న యువతులంటే ఇష్టం ఎక్కువట. ఈ క్రమంలో మోనికా రైలీ ఓ సంచలన నిర్ణయం తీసుకుంది. బాయ్‌ఫ్రెండ్ కోసం ప్రపంచంలోనే అత్యంత లావైన వ్యక్తిగా మారి తన ప్రియుడి కోరికను తీర్చాలనుకుంది. ఈ క్రమంలో ఆమె వెంటనే తన నిర్ణయాన్ని అమలు చేసింది. నిత్యం కేజీలకు కేజీలు కొవ్వులు, పిండిపదార్థాలు, ప్రోటీన్లు ఎక్కువగా ఉన్నా ఆహారాన్ని తీసుకుంటూ వస్తోంది. కాగా మోనికా రైలీ నిర్ణయం ఆమె తల్లిదండ్రులకు నచ్చలేదట. కానీ రైలీ నిర్ణయంపై ఆమె బాయ్‌ఫ్రెండ్ మొదట ఆశ్చర్యపోయినా, తరువాత ఎంతగానో ఆనందించాడు.

తన కోరికను తీర్చడం కోసం రైలీ తీసుకున్న నిర్ణయంపై ఆమె బాయ్‌ఫ్రెండ్ ఉబ్బితబ్బిబ్బవుతున్నాడు. అయితే రైలీ బాయ్‌ఫ్రెండ్ అంతటి ఆనందంలో ఉండడమే కాదు, రైలీకి నిత్యం ఆహారాన్ని తానే తెచ్చి పెడుతూ స్వయంగా తినిపిస్తున్నాడు కూడా. ప్రపంచంలో అత్యంత లావైన వ్యక్తిగా గిన్నిస్ రికార్డు సాధించాలని, దానికి తోడు తన బాయ్‌ఫ్రెండ్ కోరికను కూడా తీర్చినట్టవుతుందని రైలీ భావిస్తుండడంతో ఆమెకు ఆమె బాయ్‌ఫ్రెండ్ ఎంతగానో సహకారాన్ని అందిస్తున్నాడు. కాగా ప్రస్తుతం ఆమె దాదాపుగా 700 పౌండ్ల (317 కిలోలు) బరువుకు చేరుకుంది.
ఈ క్రింది వీడియో ని చూడండి
ఈ క్రమంలో నిత్యం ఆమెకు బెడ్‌పై పడుకోవడం, లేవడం, బాత్‌రూంకు వెళ్లడం కష్టంగా ఉండడంతో ఆమెను ఆమె బాయ్‌ఫ్రెండే దగ్గరుండి చూసుకుంటున్నాడు. ఆమెకు సహాయకారిగా కూడా ఉంటున్నాడు. అయితే బాయ్ ఫ్రెండ్ కోరిన లావు పాటి కోరిక ఇప్పటికి నెరవేరినా, గిన్నిస్ రికార్డుకు మాత్రం మరికొంత దూరంలోనే ఉంది రైలీ. ఎందుకంటే అమెరికాకు చెందిన జాన్ బ్రోవర్ మిన్నోచ్ అనే వ్యక్తి పేరిట గిన్నిస్‌లో అత్యంత లావైన వ్యక్తిగా (1400 పౌండ్లు) రికార్డు ఉంది.

దాన్ని చేరుకోవాలంటే ఆమె ఇప్పుడు ఉన్న బరువుకు రెట్టింపు బరువు పెరగాల్సి ఉంటుంది. మరి ఆ రికార్డును రైలీ సాధిస్తుందా లేదా అన్నది వేచి చూడాలి. అన్నట్టు రైలీకి యూట్యూబ్ చానల్ కూడా ఉందండోయ్. దాని ద్వారా పలువురు నెటిజన్లు ఆమెకు మద్దతుగా, ఆమె తిండి కోసం అయ్యే ఖర్చుకు సరిపడా డబ్బులను విరాళంగా పంపుతున్నారు. ఏది ఏమైనా రైలీ, ఆమె బాయ్‌ఫ్రెండ్‌లది అత్యంత లావైన, బరువైన ప్రేమే..! కాదంటారా..ఈ వీడియోపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో చెప్పండి..
The post బాయ్ ఫ్రెండ్ ప్రేమను గెలవడానికి 317 KGలు బరువు పెరిగిన యువతి లవ్ స్టోరీ వింటే ఫిదా అవ్వాల్సిందే appeared first on Telugu Messenger.