ఈ ప్రకృతి మనకు ఎంతో ఇస్తుంది. కాని మనం దానికి ప్రతిరూపంగా తిరిగి ఇచ్చేది ఏదీ ఉండదు. ఆ ప్రకృతినే మనం నాశనం చేస్తున్నాం. కాని ఎన్నో ప్రయోజనాలు కలిగించే వృక్ష సంపద మన భూమండలం పై ఉంది. అలాంటి వాటిలో ఓ వృక్షం గురించి ఇప్పుడు చెప్పుకోబోతున్నాం.. రావిచెట్టు గురించి అందరికీ తెలిసిందే. కేవలం నీడని, చల్లదనాన్ని ఇచ్చే చెట్టుగానే కాకుండా ఇది వివిధ రూపాల్లో పలు ఆరోగ్యప్రయోజనాలు కలిగిస్తుందని తెలిసిన విషయమే.రావి చెట్టు భారతదేశపు సర్వసాధారణ వృక్షం. దీనిని హిందీ మరియు ఆంగ్ల భాషలలో ‘పీపల్’ అంటారు. హిందీలో దీన్ని ‘పిప్లీ’ అని కూడా అంటారు. మన గ్రామీణులు వీధి ప్రాంతంలో రావి మొక్కల్ని నాటి, శ్రద్ధగా పెంచుతారు. హిందువులూ, బౌద్ధులూ దీనిని పూజనీయమైన వృక్షంగా భావిస్తారు. మన జానపద సాహిత్యం రావి చెట్టును స్త్రీ గానూ, మర్రి చెట్టుకు భార్యగానూ భావిస్తుంది.

అంజీరు, మేడి, మర్రి, జువ్వి మొదలైన చెట్ల లాగే రావి చెట్టు కూడా మోరేసీ కుటుంబానికి చెందినది…దేవస్థానాల వంటి మతపరంగా పవిత్రమైన ప్రదేశాలలో పెంచబడుతుంది కనుక ఇది ఏర్పడ్డది. రావిని సంస్కృతంలో ‘అశ్వత్థమ్’ అంటారు. ‘భగవద్గీత’ అశ్వత్థాన్ని అవ్యయ వృక్షమని పేర్కొంది. అవ్యయ వృక్షం అంటే ఎప్పటికీ నశించనిదని భావం. మర్రి చెట్టు లాగే ఇది కూడా మహా వృక్షంలా పెరుగుతుంది.భవనాల గోడల పగుళ్ళలో రావి, మర్రి మొక్కలు మొలిచి, గోడల్ని పగలగొట్టుకుని పెరుగుతూ ఉండడం కూడా మనం తరచు చూస్తుంటాం.

రావిచెట్టు ఆకులు మలబద్దకం, మధుమేహం, చెవి సంబంధిత సమస్యల నుంచి ఉపశమనం కలిగిస్తాయి. రావి ఆకులను ఎండబెట్టి వాటిని గ్రైండ్ చేయాలి. ఈ పొడికి సోంపు విత్తనాలను, పచ్చి బ్రౌన్ పౌడర్, బెల్లాన్ని సమాన మొత్తాలలో కలపాలి. ఈ మిశ్రమాన్ని గ్లాసు నీటికి కలపి తాగాలి. ఇది మలబద్దకాన్ని దూరం చేస్తుంది. రావి చెట్టు నుంచి సేకరించిన రసాన్ని వాడితే ఇది రక్తంలోని చక్కెర స్థాయిలను తగ్గిస్తుంది. రావి ఆకు కింద మంటను ఉంచి, దాని నుండి వచ్చే రసాన్ని సేకరించాలి. ఈ రసం చల్లారిన తర్వాత, రెండు, మూడు చుక్కలను చెవిలో వేసుకోవాలి. ఇది చెవుళ్లలోని ఇన్ఫెక్షన్‌ని కొంతవరకూ తగ్గిస్తుంది. ఇలా రావి ఆకులు మనకు ఎంతో ఆరోగ్యం కలిగిస్తాయి.

రావి ఆకులు లేతగా ఉన్నప్పుడు నున్నగా మెరుస్తూ, ఎర్రగా ఉంటాయి. ముదిరే కొద్దీ అవి ఆకుపచ్చగా మారి, ఈనెలు ప్రస్ఫుటంగా పెరిగి గరుకుగా తయారవుతాయి. రావి ఆకు హృదయాకారంలో ఉంటుంది. అయితే ఆకు శీర్షం తోకలా పొడవుగా సాగి ఉంటుంది. సాగిన శీర్షం ఎంత పొడవు ఉంటుందో, దాదాపుగా ఆకు కాడ కూడా అంతే ఉంటుంది. ఆకులు కిందికి వేళ్ళాడుతూ కొద్దిపాటి గాలికి కూడా అటూ ఇటూ కదులుతూ సన్నని శబ్దం చేస్తాయి. ఆకులకుండే ఈ ప్రత్యేకమైన కదలికల కారణంగానే రావి చెట్టుకి సంస్కృతంలో ‘చలపత్ర వృక్షమ్’ అనే పేరుకూడా ఏర్పడింది.

రావి కాయలు కొమ్మకూ, ఆకు కాడకూ మధ్య జతలు జతలుగా వస్తాయి. కాయలు అడ్డంగా అరంగుళం వ్యాసం కలిగి, లేతగా ఉన్నప్పుడు ఆకుపచ్చగా మెత్తగా ఉండి, పండే కొద్దీ ఎర్రగా రక్తవర్ణానికి మారతాయి. ఆడ పూలు, మగ పూలు వేర్వేరుగా ఉంటాయి. కరవు రోజుల్లో రావి కాయల్నీ, లేత చిగురుటాకుల్నీ ప్రజలు తింటారు. రావి ఆకులు చాలా బలవర్ధకమైన ఆహారం. వీటిలో 14 శాతం వరకూ ప్రోటీన్లు (మాంసకృత్తులు)ఉన్నాయి. రావి ఆకుల్లో గడ్డిజాతి మేతలలో కంటే మూడురెట్లు ఎక్కువ మాంసకృత్తులు ఉన్నాయి. పశువులకు, ప్రత్యేకించి ఏనుగులకు రావి ఆకులు అతి ఇష్టమైన మేత. నైట్రోజెన్, కాల్షియం, ఫాస్ఫరస్ అధికంగా ఉండే కారణంగా గొర్రెలూ, మేకలూ, పశువులకు రావి ఆకులు అత్యంత శ్రేష్ఠమైన మేతగా పరిశోధనలు నిర్ధారించాయి. రావిచెట్టు కాండం నుంచి స్రవించే జిగురును రబ్బర్ టైర్లకు పంక్చర్లు వేసేందుకు ఉపయోగిస్తారు. గట్టిపడిన ఈ జిగురును సీలింగ్ వాక్స్ గానూ ఉపయోగిస్తారు.రావి కలప అంతగా శ్రేష్ఠమైనది కాదు. దానిని ప్యాకింగు బాక్సులు, అగ్గి పెట్టెల తయారీలో ఉపయోగిస్తారు. బండి చక్రాల, కొయ్య గిన్నెల, స్పూన్ల తయారీలోనూ రావి కలపను వినియోగిస్తారు.
ఈ క్రింది వీడియో ని చూడండి
ఇక ఈ ఆకుతో వశీకరణం చేసుకోవచ్చు అని చెబుతారు ..మరి ఇది చెడు చేయడానికి ఉపయోగించకూడదు అని పెద్దలు చెబుతారు. ఇలా చేస్తే వారికి తిరిగి రివర్స్ అవుతుంది , అయితే ఇది ఎలా చేస్తారు అంటే, రావి చెట్టు నుంచి రెండు రావి ఆకులు కోయాలి, వాటిని ఇంటికి తీసుకువచ్చి ఒక కర్పూరం వెలిగించి ఆ మసితో ప్రియురాలి పేరు లేదా మీ వైపు ఎవరు మారాలి అని అనుకుంటున్నారో వారి పేర్లు రాయాలి.. ఆకుని చెట్టుదగ్గర ఓ బండరాయి కింద పెట్టాలి. మరో ఆకుని ఇంటి డాబా పైన పెట్టి బరువైన రాయి పెట్టండి. ఆ రావి చెట్టుకి నీళ్లలో పంచదార కలిపి అవి పోయాలి. ఇలా 15 రోజులు చేస్తే మీ కోరిక నెరవేరుతుంది. అయితే ఇవన్నీ కేవలం కల్పితం అసత్యం అని కొందరు కొట్టిపారేస్తారు, మరికొందరు నమ్ముతారు. మరి చూశారుగా ఎవరి నమ్మకాలు వారివి మరి దీనిపై మీ అభిప్రాయం కామెంట్ల రూపంలో తెలియచేయండి.
The post రావి ఆకుతో ఎవరినైనా వశపరచుకోండి appeared first on Telugu Messenger.