సమాజంలో క్రూర మృగాలు పెరిగిపోయాయి. వాటికి అడ్డు, అదుపూ ఉండడం లేదు. మహిళలు కనబడితే చాలు రెచ్చిపోతున్నాయి.. వారిపై అఘాయిత్యాలకు పాల్పడుతున్నాయి. వాటికి కన్నూ మిన్నూ కనిపించదు. వావి, వరుస, చిన్న, పెద్ద అనే తేడాలు ఉండవు. పాశవికంగా దాడి చేయడమే పని. అవకాశం దొరికితే చాలు. మహిళలను వేధింపులకు గురి చేయడానికి రెడీ అవుతున్నారు. వారిని పావులుగా వాడుకునేందుకు యత్నిస్తున్నారు. వారికి ఉండే బలహీనతలను ఆసరగా చేసుకుని మృగాళ్లు రెచ్చిపోతున్నారు.

మహిళలకు భద్రత కల్పిస్తున్నాం అని ప్రభుత్వాలు ఎంత చెబుతున్నప్పటికీ నేటి తరుణంలో జరుగుతున్న కొన్ని సంఘటనలు ఇంకా వారి భద్రతను ప్రశ్నార్థకం చేస్తూనే ఉన్నాయి. మహిళ అనే పదం వినబడితే చాలు.. గుంట నక్కల్లా పొంచి ఉండే కామాంధులు వారిపై దాడి చేసేందుకు సిద్ధంగా ఉంటున్నారు. అవకాశం దొరికితే చాలు..మహిళలను వేధింపులకు గురి చేయడానికి రెడీ అవుతున్నారు. వారిని పావులుగా వాడుకునేందుకు యత్నిస్తున్నారు. వారికి ఉండే బలహీనతలను ఆసరగా చేసుకుని మృగాళ్లు రెచ్చిపోతున్నారు. అయితే సరిగ్గా ఇలాంటి ఓ వ్యక్తి బారి నుంచే ఓ మహిళ చాకచక్యంగా తప్పించుకుంది. ఆమె చేసిన పని తెలిస్తే శబాష్ అంటారు. ఈ ఘటన చెన్నైలో చోటుచేసుకుంది. అసలు ఏం జరిగిందంటే…
ఈ క్రింది వీడియో ని చూడండి
ఆమె పేరు నమ్యా బెయిడ్. చెన్నైలో నివాసం ఉంటోంది. ఈమె ఖాళీగా ఉండడం ఎందుకని ఉద్యోగ ప్రయత్నాలు చేయడం మొదలు పెట్టింది. తన ఫోన్ నంబర్‌ను తెలిసినవారికి ఇచ్చింది. ఏదైనా జాబ్ ఉంటే చెప్పమని వారికి చెప్పింది. దీంతోపాటు పలు ఆన్‌లైన్ జాబ్ సైట్లలోనూ తన రెజ్యూమ్‌తోపాటు తన ఫోన్ నంబర్‌ను కూడా ఇచ్చింది. దీంతో కొన్ని రోజులకు ఒక వ్యక్తి నుంచి నమ్యాకు ఫోన్‌కు వచ్చింది. అతను తనను తాను దీపక్ అనే పేరుతో పరిచయం చేసుకున్నాడు. తాను ఎయిర్ ఫ్రాన్స్ ఉద్యోగినని, నమ్యాకు జాబ్ వచ్చేలా చేస్తానని చెప్పాడు. జాబ్ అవసరం ఉండటంతో అతన్ని నమ్మి సరే అని చెప్పింది నమ్య. ఆ వ్యక్తి నెమ్మదిగా నమ్యాతో మాటలు కలిపాడు. వాట్సాప్ లో ఆమెతో సంభాషణలు చేయడం మొదలు పెట్టాడు. దీంతో నమ్యా ముందు సరే అని ఒప్పుకుంది. అయితే దీపక్ అనే ఆ వ్యక్తి నెమ్మదిగా నమ్యాతో మాటలు కలిపాడు. వాట్సాప్ లో ఆమెతో సంభాషణలు చేయడం మొదలు పెట్టాడు.

చివరకు ఓ రోజున ఆమెకు వాట్సాప్ లో అసభ్యకరంగా మెసేజ్ పెట్టాడు. ఆమెను బట్టలు లేకుండా నగ్నంగా చూడాలని, పలు అసభ్యకర డ్రెస్సులు వేసుకుని ఫొటోలు దిగి పంపాలని, నగ్నంగా మారి రూమ్‌లో ఎవరూ లేకుండా చూసి వాట్సాప్ లో వీడియో కాల్ చేయాలని చెప్పాడు. దీంతో నమ్యాకు అనుమానం వచ్చింది. అతను ఫేక్ అని గుర్తించింది. చివరకు అతనితో వాట్సాప్ సంభాషణను కట్ చేసింది. అయినప్పటికీ అతను ఆమెతో మరింత మాట్లాడేందుకు యత్నించాడు. అయినా ఆమె అతన్ని అవాయిడ్ చేసింది.

ఇంకా ఎక్కువ చేస్తే పోలీసులకు కంప్లెయింట్ ఇస్తానని చెప్పడంతో ఆ వ్యక్తి ఇక మళ్లీ ఆమెతో చాటింగ్ చేసేందుకు యత్నించలేదు. ఇక చిరాకు వచ్చి వాట్సాప్ సంభాషణల ఆధారంగా పోలీసులకు కంప్లైంట్ ఇచ్చింది నమ్య. మహిళలు జాగ్రత్తగా ఉండటం మంచిది. చూసారు కదా ఆ నీచుడు ఎలాంటి స్కెచ్ వేశాడో.ఈ సంఘటనను ఆమె ఫేస్బుక్ లో షేర్ చేసింది. చూశారుగా.. జాబ్ కావాలని ఆమె అడిగితే.. ఆ నీచుడు ఎలాంటి వల వేశాడో. ఏది ఏమైనా ఇలా ఎవరికీ జరగకూడదు..!ఈ వీడియోపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో చెప్పండి..
The post జాబ్ కావాలంటే నగ్న చిత్రాలు పంపాలని అడిగాడు ఓ వ్యక్తి… అతని బారి నుంచి ఆమె తెలివిగా తప్పించుకుంది..! appeared first on Telugu Messenger.