ఉత్తరాన్న హిమాలయాలతో మొదలుకుని, దక్షిణాన్న సముద్రంతో ముగిసే మన దేశంలో వింతలు విశేషాలకు కొదవ లేదు. ముఖ్యంగా దక్షిణ భారత దేశంలో రెండు సముద్రాల మధ్య నిర్మానుష్యంగా కనిపించే ఒక గ్రామం గురించి తెలిస్తే ఆశ్చర్యమే కాదు, అయ్యో పాపం అని బాధపడతారు కూడా. ఎందుకంటే ఇండియాలో ఇదే చిట్టచివరి గ్రామం. సముద్రం నుంచి వచ్చే పెను ప్రమాదాల వల్ల ముందు నాశనం అయ్యేది ఈ గ్రామమే. ఆ గ్రామమే ధనుష్కోటి.. ఒకప్పుడు ఈ గ్రామం కళకళలాడుతూ ఉండేది. కానీ ఇప్పుడు ఏకాకిగా ఉండిపోయింది. ఇలా మారడానికి కారణం ఏమిటి.. అసలు ధనుష్కోటి విశేషాలు ఏమిటి.. ఇలా అనేక విషయాల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం.

ధనుష్కోడి.. దేశ చరిత్ర, ఇతిహాసాల్లో ధనుష్కోడికి ప్రత్యేక స్థానం ఉంది. దేశంలోనే చిట్టిచివరి గ్రామం ఇది. తమిళనాడులోని రామేశ్వరానికి సుమారు 19 కిమీల దూరంలో పంబన్ దీవుల్లో ఈ గ్రామం ఉంది. స్వామీ వివేకానంద గారు 1892 లో విదేశీ పర్యటనకు వెళ్లి 1897 లో భారత దేశం తిరిగి వచ్చినపుడు ఇక్కడే కాలు మోపాడు. మన మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాం గారు జన్మించిన పట్టణం కూడా ఇదే. ఈ పట్టణం రామేశ్వరం పంబన్ ద్వీపానికి చిట్ట చివరన ఉంటుంది. ఇక్కడి నుంచి శ్రీలంక కేవలం 29 కిలోమీటర్లు. శ్రీ రాముడు శ్రీలంకకు వెళ్ళడానికి ఏర్పాటు చేసుకున్న వంతెన రామసేతు ఇక్కడే ఉంది. ఇప్పటికీ ఆ వంతెన తాలుకు అవశేషాలను ఇక్కడ చూడవచ్చు. ఈ వంతెన శాటిలైట్ చిత్రాలలో కూడా స్పష్టంగా కనబడుతుంది. హిందూ మహా సముద్రం మరియు బంగాళా ఖాతం ఇక్కడే కలుస్తాయి. రెండు సముద్రాల మధ్యన ఉన్న వర్ణ భేదం స్పష్టంగా చూడవచ్చు. దనుష్కోడికి చేరాలంటే 2016 వరకు సముద్రంలోనే ప్రయాణం చేయాల్సి వచ్చేది. పర్యాటకులు, జాలర్లు సముద్రం ఆటుపోటులు చూసుకుని బస్సుల్లో, జీపుల్లో వెళ్లేవారు. కానీ 2017లో కేంద్ర ప్రభుత్వం రూ.60 కోట్లతో ధనుష్కోటికి జాతీయ రహదారి నిర్మించారు.
ఈ క్రింద వీడియోని చూడండి
అయితే ఈ గ్రామం విశేషాలు తెలుసుకుంటే ఆశ్చర్యం వేస్తుంది. ప్రకృతి విపత్తుల వల్ల ఈ ప్రాంతం మనుషులను మింగేసింది. 1964 కి ముందు ధనుష్కోటి పర్యాటక రంగంలో మరియు పుణ్యక్షేత్రంగా ఒక వెలుగు వెలుగుతూ ఉండేది. ఇక్కడి నుంచి శ్రీలంక కేవలం 29 కిలోమీటర్ల దూరం కావడం వలన అప్పట్లో పర్యాటకులను, సాధారణ ప్రయాణికులను శ్రీలంక చేరవేయడానికి ఇక్కడినుంచి ఫెర్రీ సర్వీసులు కూడా నడిచేవి. పర్యాటకులకు, భక్తులకు వసతి కల్పించడానికి ఇక్కడ హోటళ్ళు, ధర్మశాలలు, బట్టల దుకాణాలు ఉండేవి. భారత భూభాగం నుంచి పంబన్ రైలు వంతెన మీదుగా ధనుష్కోటి పట్టణం వరకు ఒక రైలు మార్గం కూడా ఉండేది. మద్రాసు నుంచి ధనుష్కోటి వరకు బోట్ మెయిల్ అనే పేరుతో ఒక రైలు కూడా నడిచేది. అలాగే ఒక చర్చి, రైల్వే స్టేషన్, రైల్వే హాస్పిటల్, ఉన్నత విద్యాలయం, పోస్ట్ ఆఫీసు, కస్టమ్స్ మరియు ఓడ రేవు కార్యాలయాలు కూడా ఉండేవి. ఇక రామాలయాల గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. నిత్యం పూజలతో కళకళలాడుతూ ఉండేది.

కానీ 1964లో ఏర్పడిన తుఫాను రామేశ్వరం వద్ద తీరం దాటింది. దీంతో 23 అడుగుల ఎత్తులో ఉప్పెన వచ్చింది. ఫలితంగా ఆ గ్రామంలో నివసిస్తున్న 1800 మంది చనిపోయారు. తుపాను సమయంలో 115 మంది ప్రయాణికులతో వెళ్తున్న రైలు కూడా ఉప్పెనలో చిక్కుకుంది. ఆ విషాద గుర్తులు ఇప్పటికీ దనుష్కోడిలో కనిపిస్తూనే ఉంటాయి. ప్రస్తుతం ఇక్కడ జాలర్లు మాత్రమే నివసిస్తున్నారు. 2004లో ఏర్పడిన సునామీ సైతం 1,600 అడుగుల ఎత్తైన అలలతో దనుష్కోడిని ముంచేశాయి. దీంతో ఈ ప్రాంతంలో అడుగుపెట్టాలన్నా, నివసించాలన్నా ప్రజలు వణికిపోతున్నారు. రామేశ్వరానికి రైలు లేదా బస్సులో చేరుకోవచ్చు. లేదా మధురైలో విమానం దిగి రామేశ్వరం మీదుగా దనుష్కోడికి వెళ్లేందుకు ట్యాక్సీలు అందుబాటులో ఉంటాయి. రాత్రి వేళ్లలో ఈ ప్రాంతాన్ని సందర్శించడం ప్రమాదకరం. వర్షాకాలం, తుపాన్ల సమయంలో ఈ ప్రాంతం భయానకంగా ఉంటుంది. ఎందుకంటే ఈ ప్రాంతంలో రెండు సముద్రాలు ఉంటాయి. అవి రెండు ఒకే చోట కలుస్తాయి. ఫలితంగా అక్కడ విభినఒ్న వాతావరణం కనిపిస్తుంది.

ఆ ప్రాంతంలో బంగాళాఖాతం నిశబ్దంగా ఉంటే, హిందూ మహా సముద్రం అలలతో ఎగసిపడుతుంది. ఈ రెండు సముద్రాల్లో ఎక్కడ వాయుగుండం ఏర్పడినా ఈ ప్రాంతం మునిగిపోతుంది. ఈ ప్రాంతానికి 18 మైళ్ల దూరంలోనే శ్రీలంకలోని తలైమన్నార్ పోర్టు ఉండేది. అక్కడికి చేరుకోవడం కోసం చెన్నై నుంచి పంబన్ దీవి వరకు రైల్లో ప్రయాణించి, అక్కడి నుంచి ఓడల్లో శ్రీలంక చేరుకునేవారు. అయితే, 1964 తర్వాత ఆ మార్గం అతలాకుతలమైంది. అయితే, 1982లో శ్రీలంకలో అంతర్యుద్ధం వల్ల ఓడల రవాణా సేవలను నిలిపివేశారు. ఇప్పటికీ అక్కడ రైల్వే స్టేషన్ గోడలు, చర్చి తదితర శిథిల భవనాలు కనిపిస్తూనే ఉంటాయి. ఏది ఏమైనా ఒక అద్భుత నగరం పకృతి విపత్తు వలన కాలగర్భంలో కలిసిపోయింది. ఇదండీ ధనుష్కోటి విశేషాలు.. ఈ సారి రామేశ్వరం వెళ్లినప్పుడు తప్పకుండా ఈ చిట్టచివరి గ్రామాన్ని సందర్శించి సెల్ఫీ తీసుకోండి.
The post దేశంలో చిట్టచివరి గ్రామం ఇది, రెండు సముద్రాల మధ్య ఏకాకిలా.. appeared first on Telugu Messenger.