ఈ ప్రపంచ వ్యాప్తంగా కొన్ని కోట్ల మంది ముస్లింలు ఉన్నారు. ఒక్కొక్క మతానికి ఒక్కొక్క ఆచారం ఉన్నట్టే ముస్లింలకు కూడా కొన్ని ప్రత్యేక ఆచారాలు ఉన్నాయి. మనకు వారి ఆచారాలలో కొన్ని తెలిసినా కూడా కొన్నిటి గురించి తెలీదు. వాళ్ళ ఆచారాలు ఇతర మతాలలో ఉన్నట్టు ఉండవు. ఈ వీడియోలో ముస్లింలు పాటించే కొన్ని ఆచారాల గురించి తెలుసుకుందా.

వివాహం…
ఇస్లాం వివాహ వ్యవస్థను నికా అంటారు. బ్రహ్మచర్యానికి, వైరాగ్యానికి ఇస్లాం వ్యతిరేకం. . వివాహం మనిషి ఆలోచనలను సమతూకంలో ఉంచి అతని శారీరక నడవడికను క్రమబద్ధీకరిస్తుంది. ఇస్లాంలో వ్యభిచారం లేదా హరామ్ నిషిద్ధం. వివాహం అతి తక్కువ ఖర్చుతో చాలా నిరాడంబరంగా ఉండాలని ఇస్లాం బోధిస్తుంది. కానీ ముస్లింలలో ఒక ఆచారం ఏమిటంటే నికా రోజు ఇచ్చే విందు, వధువు తండ్రి ఇస్తాడు. ఇది చాలా ఖర్చుతో కూడుకున్నది. భారతదేశంలో ముస్లింలపై హిందూ సాంప్రదాయాల ప్రభావం ఎక్కువ. వధూవరుల పెళ్ళిళ్ళ విషయాల్లో కులాలను ప్రోత్సహిస్తుంటారు. ఉదాహరణ : షేక్ లకు షేక్ లలోనే, సయ్యద్ లను సయ్యద్ లలోనే, పఠాన్ లకు పఠాన్ లలోనే, సున్నీలకు సున్నీలలోనే, షియాలకు షియాలలోనే, ధోబీలకు ధోబీలలోనే, మెహ్తర్ లకు మెహ్తర్ లలోనే వెతుకుతూంటారు. వీళ్లెవరూ నూర్ బాషా, దూదేకులను పెళ్ళిచేసుకోరు. కానీ నమాజ్ చేసే విషయంలో మాత్రం అందరు సమానం.

పిల్లలకు పేర్లు పెట్టడం… …
సాధారణంగా పిల్లలు పుట్టినపుడు మొదటి నెలలోనే నామకరణం చేస్తారు. రిలీజియస్ పేర్లు, ప్రకృతికి సంబంధించిన పేర్లు, సాహితీ సంబంధమైన పేర్లు పెడుతుంటారు.
- సలాము చేయుట…
ముస్లింలు తోటి ముస్లింలను పలుకరించే పద్ధతి ఇది. అస్సలాము అలైకుమ్. దీని అర్థం నీపై శాంతి కలగాలి అని అర్థం.. దీనికి అవతలివారు… వాలేకుమ్ అస్సలాం అని బదులిస్తారు. - పురుషులు గడ్డాన్ని పెంచడం..
దీనిని చెహరా అని అంటారు. ఇస్లాంలో పురుషులు గడ్డాన్ని పెంచడం తప్పనిసరి కాదు. ఇది సున్నత్ మాత్రమే. మీసాలు తీసివేసి కేవలం గడ్డాన్ని పెంచడాన్ని ఇస్లాం ప్రోత్సహిస్తుంది. - పురుషులు టోపీ ధరించడం
ముహమ్మద్ ప్రవక్త ఎప్పుడు తలను పగడీ లేదా టోపీతో కప్పి ఉంచేవాడు. దీనిని అనుసరిస్తూ ముస్లిం పురుషులు టోపీలు ధరిస్తారు. పలు దేశాలలో పలు విధాలుగా ధరిస్తారు. టోపీలు సంస్కృతికి, సభ్యతకు మరియు గౌరవానికి ప్రతీకలు. ఈ టోపీ పెట్టుకుని నమాజ్ చేస్తారు.

- ఈద్ ముబారక్
ముస్లింలు పండుగల సమయంలో ఈద్ ముబారక్ అని విష్ చేస్తారు. ఈద్ ముబారక్ అంటే పండుగ శుభాకాంక్షలు అని అర్థం.. రంజాన్ పండుగ, మరియు బక్రీదు పండుగ సందర్భంగా ఈద్ ముబారక్ అని సంబోధిస్తారు. అలాగే ముహమ్మద్ ప్రవక్త పుట్టినరోజునాడు మీలాదున్నబి ముబారక్ అని సంబోధిస్తారు. - స్త్రీలు హిజాబ్ ధరించడం
హిజాబ్ అంటే బురఖా. ఇది గౌరవంతో కూడిన హుందాతనం, వ్యక్తిగతం, మరియు సద్-నీతి. ప్రతి ముస్లిం మహిళ తన ముఖాన్ని ఎవరికీ చూపించకుండా బురఖా కప్పుకుంటుంది.

- పిల్లలకు అఖీఖా చేయడం
పిల్లలకు ఒక వయస్సు వచ్చిన తర్వాత పుట్టుకతో వచ్చే వెంట్రుకలను తొలగించే ప్రక్రియనే అఖీఖా అంటారు. ఒకరకంగా చెప్పాలంటే ఇది హిందూమతస్తులు పాటించే కేశఖండన లాంటిది. - పిల్లలకు బిస్మిల్లాఖ్వానీ చేయడం..
పిల్లలకు స్కూల్ కు వెళ్లే వయసు వచ్చినప్పుడు వాళ్ళకు చేయించే అక్షరాభ్యాసాన్ని బిస్మిల్లాఖ్వానీ అంటారు. పిల్లలకు నాలుగు సంవత్సరాల నాలుగు నెలల నాలుగు రోజులు వయస్సు వచ్చినపుడు ఈ ఆచారం నిర్వహిస్తారు. దీనినే ఖురాన్ ఖ్వానీ అని కూడా అంటారు.ముందు ఖురాన్ ను చదివిస్తారు.
ఈ క్రింద వీడియోని చూడండి
ఇలా ముస్లింలు కొన్ని రకాల ఆచారాలు పాటిస్తారు. వీటిలో కొన్నిటి గురించి ఇస్లాం మతం చెబుతుంది. మరికొన్ని కాలానుగుణంగా ముస్లిములు పెట్టుకున్నారు.
The post ముస్లిమ్స్ గురించిన షాకింగ్ నిజాలు appeared first on Telugu Messenger.