మహారాష్ట్రలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో అక్కడి జనజీవనం అస్తవ్యస్తంగా మారింది. ఇక ఆ రాష్ట్ర రాజధాని ముంబైలో ఎటు చూసిన వర్షపు నీరే కనిపిస్తోంది. దీంతో సముద్రం నడిరోడ్డుపైకి వచ్చిందా అన్న అనుమానం కలుగుతోంది. ఇదిలా ఉంటే వారాంతంలో ముంబై నగరంలో భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ ముందుగానే హెచ్చిరించింది. శుక్రవారం నుంచి ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షంతో… ఆ వర్షపు నీరు ప్రధాన రహదారులపై నిలిచిపోయింది.దీంతో ట్రాఫిక్‌కు తీవ్ర అంతరాయం ఏర్పడింది. ఇళ్లకు చేరుకునేందుకు ప్రజలు నానా ఇబ్బందులు పడ్డారు. ఇక ఎంతకూ వర్షం తగ్గకపోవడంతో లోకల్ ట్రైన్స్‌ను అధికారులు నిలిపివేశారు. ఇక భారీ వర్షాలతో పలు విమానాలు రద్దు కాగా మరికొన్ని విమానాలను దారి మళ్లించారు. మొత్తం మీద 11 విమానాలను ఎయిర్‌పోర్టు అధికారులు రద్దు చేశారు. భారీ వర్షాలతో ముంబై నగరంలో వరదలు వచ్చే ప్రమాదం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఇదే జరిగితే అక్కడి సాధారణ ప్రజల పరిస్థితి దారుణంగా తయారయ్యే అవకాశం ఉందని హెచ్చరించింది.

ముంబైలో గడిచిన 24 గంటల్లో ముంబై నగరంలో సగటున 150 నుంచి 180 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదయ్యింది. నగర పరిసర ప్రాంతాల్లో 50 నుంచి 100 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైనట్టు వాతావరణ శాఖ వెల్లడించింది. అత్యధికంగా శాంతాక్రూజ్‌లో 192 మిల్లీమీటర్ల వర్షం కురిసింది. భారీ వర్షాలతో లోతట్టు ప్రాంతాలన్నీ జలమయమయ్యాయి. రహదారులపై వర్షం నీరు నిలిచి జలాశయాలను తలపిస్తున్నాయి. దీంతో ప్రయాణీకులు నానా అవస్థలు పడుతున్నారు. సముద్రం తీరానికి దూరంగా ఉండాలని, మ్యాన్‌హోల్స్ తెరవద్దని ప్రజలకు బీఎంసీ అధికారులు సూచించారు. రైల్వే ట్రాక్‌పై నీరు ప్రవహించడంతో ముంబై-కొల్హాపూర్ మధ్య నడిచే మహాలక్ష్మీ ఎక్స్‌ప్రెస్ రైలు బద్లాపూర్- వాంగనీ మధ్య వరద నీటిలో చిక్కుకుపోయింది. ఈ రైల్లో 700 మంది ప్రయాణీకులున్నట్టు సెంట్రల్ రైల్వే డీఆర్ఎం వెల్లడించారు.
ఈ క్రింద వీడియోని చూడండి
వాన నీటిలో చిక్కుకుపోయిన వారిని రక్షించడానికి సహాయక సిబ్బంది అక్కడకు చేరుకున్నారు. ప్రయాణీకులు ఎవరూ రైల్లో నుంచి బయటకు రావద్దని అధికారులు సూచించారు. ప్రయాణికులంతా రైల్లోనే ఉండాలని దిగి వెళ్లేందుకు ప్రయత్నం చేయకూడదని రైల్వే అధికారులు హెచ్చరించారు. రైలు సురక్షిత ప్రాంతంలోనే ఉందని అధికారులు తెలిపారు. తమ క్షేమం కోసం రైల్వే పోలీసులు సిటీ పోలీసులు ఉన్నారని వారు సహాయం చేస్తారని అధికారులు ప్రయాణికులకు భరోసా ఇచ్చారు. ఎన్డీఆర్ఎఫ్ నుంచి తదుపరి సమాచారం వచ్చేవరకు అంతా రైల్లోనే ఉండాలని సూచించారు. రైలు మెట్లు వరకు నీరు చేరింది. రెస్క్యూ ఆపరేషన్‌కు వాతావరణం ఆటంకంగా మారింది. ఎన్డీఆర్ఎఫ్, నేవీ, బద్లాపూర్, ముంబై అగ్నిమాక విభాగాలకు చెందిన మొత్తం ఎనిమిది సహాయక బృందాలు రెస్క్యూ ఆపరేషన్‌లో పాలుపంచుకుంటున్నాయి. ఇప్పటి వరకు 500 మందిని బయటకు తీశారు. వీరిని సురక్షిత ప్రాంతానికి తరలిస్తున్నారు.

ప్రయాణీకులను సురక్షితంగా బయటకు తేవడానికి లైఫ్ జాకెట్లు, బోట్లు, హెలికాప్టర్ సైతం వినియోగిస్తున్నారు. శుక్రవారం కురిసిన భారీ వర్షాలకు నగరవాసులు 2005 జూలై 26న కురిసిన భారీ వర్షాలను గుర్తుకు తెచ్చుకుంటున్నారు. ఆరోజు కురిసిన భారీ వర్షానికి ముంబై నగరం నీటిపాలైందని చెబుతూ నాటి చేదు జ్ఞాపకాలకు సంబంధించిన ఫోటోలను ట్విటర్ వేదికగా పోస్టు చేస్తున్నారు ముంబై నగరవాసులు. ముంబైను దేవుడే కాపాడాలంటూ నగరవాసులు ట్విటర్ వేదికగా పోస్టులు పెడుతున్నారు. ఇదిలా ఉంటే ముంబై నగరంలో భారీ వర్షాలు శనివారం సాయంత్రం నుంచి తగ్గే అవకాశం ఉందని ఓ ప్రైవేట్ వాతావరణ శాఖ కేంద్రం తెలిపింది. మరి ముంబైలో కురుస్తున్న ఈ వర్షాల మీద మీ అభిప్రాయాలను మాకు కామెంట్ రూపంలో చెప్పండి. అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్టు అయితే లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం మా ఛానెల్ ను సబ్ స్కైబ్ అయ్యి పక్కన ఉన్న బెల్ ఐకాన్ మీద ప్రెస్ చెయ్యండి.
The post ముంబై లో దారుణం.. వరద నీటిలో చిక్కుకున్న రైలు.. appeared first on Telugu Messenger.