వాళ్లు రైతులు.. రోజువారీగా వ్యవసాయానికి వెళుతున్నారు. నాలుగు రోజుల క్రితం.. వారి భూమిలో పెద్ద రాయి కనిపించింది. అది కూడా గొయ్యిలా ఏర్పడి. పైనుంచి బలంగా పడిన ఆనవాళ్లు కనిపించింది. ఎవరైనా కావాలని వేశారా అనే ఆలోచన వచ్చింది రైతులకు. చుట్టుపక్కల అలాంటి గుర్తులు ఏమీలేవు. కనీసం వాహనాల ఆనవాళ్లు కూడా కనిపించలేదు. పైనుంచి పడినట్లుగా అనిపించింది. ఆకాశం నుంచి భారీ శబ్దంతో ఉల్క పడినట్టు చూసిన కొందరు రైతులు అంటున్నారు. పిడుగులా పడటంతో రైతులంతా ఒక్కసారిగా వణికిపోయారు. వెంటనే పోలీసులు, అధికారులకు సమాచారం ఇచ్చారు. పురావస్తు శాఖ అధికారులు కూడా స్పాట్ కు వచ్చారు. బీహార్ రాష్ట్రంలోని మధుభాని జిల్లాలో ఈ షాకింగ్ ఘటన జరిగింది. అసలు విషయం అప్పుడు బయటపడింది. లేత గోధమ రంగులో అచ్చం రాయిని పోలిన ఆకృతిలో ఉంది. అందులో నుంచి పొగ కూడా బయటకు వస్తోంది. చాలా బరువు కూడా ఉంది.

పొలంలో 4 అడుగుల లోతు గొయ్యి పడటంతో పది మంది వరకు రైతులు కలిసి ఆ రాయిని పైకి లేపాల్సి వచ్చింది. వింత రాయిని పరిశీలించిన అధికారులు అది కచ్చితంగా ఉల్క అయి ఉంటుందని అంటున్నారు. 15 కిలోలు (33 పౌండ్లు) వరకు ఉంటుందని మధుబాని జిల్లా మేజిస్ట్రేట్ సిరిశాత్ అశోక్ తెలిపారు. ఇది ఉల్క లేదా గ్రహాంతర రాయి తేల్చేందుకు సైంటిస్టులు దానిపై ప్రయోగాలు చేస్తున్నారు. ఉల్క మాదిరిగా ఉన్న ఈ రాయిని పాట్నా మ్యూజియంకు తరలించగా బీహార్ సీఎం నితీశ్ కుమార్ స్వయంగా అయస్కాంతంతో ఉల్కను పరీక్షించారు. సాధారణంగా ఆకాశం నుంచి రాలిపడే ఉల్కల్లో దుమ్ము, ధూళికణాలతో కాలిన రాయి మాదిరిగా ఉంటాయి. యూఎస్ స్పేస్ ఏజెన్సీ నాసాకు చెందిన సైంటిస్టులు మాత్రం ఉల్క అనడానికి నమ్మశక్యంగా లేదని చెబుతున్నారు. 2013 ఫిబ్రవరిలో రష్యాలోని ఉరల్ పర్వతంలో ఉల్క పడి 1200 మంది వరకు గాయపడగా.. వేలాది ఇళ్లు ధ్వంసమయ్యాయి. 2016లో తమిళనాడులో కూడా ఇలాంటి ఉల్క పడటంతో ఒక బస్సు డ్రైవర్ మృతిచెందగా, ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు.
ఈ క్రింద వీడియోని చూడండి
కొన్ని ఏళ్ల నుంచి మిస్టరీ మారిన గ్రహాంతర వాసుల జాడపై ఎన్నో సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఏలియన్స్ ఉన్నాయని కొందరు లేవని మరికొందరు వాదిస్తున్నారు. ఏలియన్స్ కూడా మనుషులతో రహాస్యంగా జీవిస్తున్నాయని కొందరు చెబుతున్నారు. సైంటిస్టులు మాత్రం ఏలియన్స్ ఉన్నారా? అనేదానిపై ఇప్పటివరకూ ఎలాంటి కచ్చితమైన అనవాళ్లు కనిపెట్టలేకపోయారు. గ్రహాంతర వాసులే ఉల్కలను తమ కంట్రోల్లోకి తీసుకుని క్రమక్రమంగా భూగ్రహంపై అడుగుపెట్టేందుకు ఇలాంంటి ప్రయత్నిస్తున్నారా? లేదా మనలాగే గ్రహాంతర వాసులు కూడా తమకు అనువైన గ్రహం ఉందా? అని అన్వేస్తున్నారా లేదా భూగ్రహంపై ఆధిపత్యం కోసం ప్రయత్నిస్తున్నారని కొందరు అంటున్నారు.
మరి ఆకాశం నుంచి పడిన ఈ ఉల్క గురించి మీ అభిప్రాయాలను మాకు కామెంట్ రూపంలో చెప్పండి. అలాగే మేము చేసిన ఈ వీడియో మీకు నచ్చినట్టు అయితే లైక్ చేసి షేర్ చెయ్యండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం మా ఛానెల్ ను సబ్ స్కైబ్ అయ్యి పక్కన ఉన్న బెల్ ఐకాన్ మీద ప్రెస్ చెయ్యండి.
The post ఆకాశంలో పెద్ద శబ్దం.. ఏంటని చూస్తే..! appeared first on Telugu Messenger.