ఇంటర్నెట్ ఎన్నో వింతలు, విశేషాలకు నిలయం. ఎన్నో ఆసక్తికర సంఘటనలు, ఆశ్చర్యం కలిగించే విషయాలు, భయంకరమైన, జుగుప్సాకర విశేషాలకు పుట్టిల్లు. ప్రతి రోజు ఏదో ఒక గమ్మత్తైన విషయాన్ని ఇంటర్నెట్ ద్వారా తెలుసుకోవచ్చు. ఇంతకముందు ఒకసారి 48 ఏళ్ల వ్యక్తి కడుపులో 639 మేకులను డాక్టర్లు కనుగొన్నారు.ఇవి అతని కడుపులోకి ఎలా వెళ్ళాయో తెలియక డాక్టర్స్ షాక్ అయ్యారు. ఆ తర్వాత ఒక మహిళా కడుపులోంచి 8 కిలోల కణతిని తీశారు. ఈ వార్తల గురించి తెలిసి అందరు షాక్ అయ్యారు. ఇప్పుడు మళ్ళి అలాంటి ఘటనే ఒకటి చోటు చేసుకుంది. మరి ఆ ఘటన గురించి పూర్తీగా తెలుసుకుందామా.

చైనా వైద్యులు 20 ఏళ్ల క్రితం ఓ వ్యక్తి మింగేసిన టూత్ బ్రేష్‌ను సర్జరీ చేసి తొలగించారు. సుమారు 14 సెంటిమీటర్ల పొడువు గల బ్రేష్‌ను ఆ వ్యక్తి ఆత్మహత్యకు యత్నించినప్పుడు మింగేసినట్లు తెలిసింది. వివరాల్లోకి వెళితే… గ్వాంగ్డాంగ్ ప్రావిన్స్‌లోని షెన్‌జెన్ ఆస్పత్రికి లి అనే 51 ఏళ్ల వ్యక్తి విపరీతమైన కడుపు నొప్పితో వచ్చాడు. లిని సీటీ స్కాన్ చేసిన వైద్యులు అతడి పొట్టలో ఉన్న వస్తువును చూసి నిర్ఘాంతపోయారు. దాంతో అతడ్ని ప్రశ్నించగా తాను 20 ఏళ్ల క్రితం ఒకసారి ఆత్మహత్యకు యత్నించానని, ఆ సమయంలో టూత్ బ్రేష్ మింగేసినట్లు తెలిపాడు. దాని వల్ల 2014 వరకు లికి ఎలాంటి సమస్య రాలేదు. కాని ఆ తరువాత నుంచి మెల్లగా కడుపు నొప్పి పెరుగుతూ వచ్చింది. అలాగే ముత్రాశయంలో కూడా మంటగా ఉండేది. ఆ నొప్పి కాస్తా ఈ ఏడాదిలో జూన్ చివరి నాటికి తీవ్రంగా వేధించడం మొదలెట్టింది.
ఈ క్రింది వీడియో ని చూడండి
దాంతో లి.. గ్వాంగ్డాంగ్ ప్రావిన్స్‌లోని షెన్‌జెన్ ఆస్పత్రికి వచ్చాడు. అతడ్ని సీటీ స్కాన్ చేసిన తరువాత వచ్చిన రిపోర్టును చూసి వైద్యులు షాక్ అయ్యారు. లి పొట్టలో పొడువైన ఏదో వింత వస్తువు కనిపించింది. దాంతో వెంటనే ఆపరేషన్ చేసి దాన్ని తొలగించారు. ఒకవేళ సర్జరీ చేయడం ఆలస్యమైతే టూత్ బ్రష్ లివర్‌కు తాకి ప్రాణాంతకంగా మారేదని లికి ఆపరేషన్ చేసిన వైద్యుడు లియూ జియాలిన్ తెలిపారు. ఇక బయటకు తీసిన బ్రష్ పళ్లు అన్నీ ఉడిపోయి కేవలం గట్టిగా ఉన్న ప్లాస్టిక్ పదార్థం మాత్రమే మిగిలి ఉందని లియూ వెల్లడించారు. సూసైడ్‌కు యత్నించి కోలుకున్న తరువాత లికి వివాహమై ఇద్దరు పిల్లలు ఉన్నారు. దాదాపు రెండు దశాబ్దాలు అవుతుండడంతో ఆ బ్రష్ సంగతే మరిచిపోయానని, అది ఎప్పుడో పొట్టలోనే కరిగిపోయి బయటకు వచ్చేసి ఉండొచ్చని భావించినట్లు లి చెప్పుకొచ్చాడు. ఇప్పుడీ ఘటనకు సంబంధించిన వార్త నెట్టింట హల్‌చల్ చేస్తోంది. మరి ఈ ఘటన గురించి మీ అభిప్రాయాలను మాకు కామెంట్ రూపంలో చెప్పండి.
The post కడుపు నొప్పితో హాస్పిటల్ కు వెళ్లిన వ్యక్తి,.. స్కాన్ చేసి చూసి షాకైన డాక్టర్స్.. appeared first on Telugu Messenger.