పెళ్లి అనేది ప్రతి ఒక్కరికి ముఖ్యమే. కొందరు ఆరెంజ్ మ్యారేజ్ చేసుకుంటే కొందరు ప్రేమ పెళ్లి చేసుకుంటారు. అయితే కొందరు పెళ్లి విషయంలో చాలా మొండిగా ఉంటారు. ప్రేమించుకున్న వాడినే చేసుకుంటా లేకుంటే చస్తా అని అంటారు. అతను లేకపోతే జీవితమే లేదనుకుంటారు. అలాంటి వారి కోసమే ఇప్పుడు మీకొక యువతీ జీవితం గురించి చెప్పబోతున్నాను. మరి ఆ యువతీ జీవితం గురించి ఆమె మాటల్లోనే విందాం.

నా పేరు అంకిత. అప్పుడు నాకు 19 సంవత్సరాలు. నాకు అప్పుడే పెళ్లి చేసుకోవాలని ఉండేది కాదు. నాకు కొన్ని కలలు ఉండేవి. లక్ష్యాలు ఉండేవి. దీంతో అతన్ని పెళ్లి చేసుకోనని చెప్పా. కానీ ఏది రాసి పెట్టి ఉంటే అదే జరుగుతుంది కదా.. అదే జరిగింది కూడా. అప్పుడు 2013 జూన్. అమ్మకు క్యాన్సర్ వచ్చిందని తెలిసింది. దీంతో అమ్మ నన్ను అతన్ని పెళ్లి చేసుకోమని ఫోర్స్ చేసింది. అతనికి నాకు 10 సంవత్సరాల ఏజ్ గ్యాప్ ఉంది. దీంతో నేను అప్‌సెట్ అయ్యా. అప్పుడు నా మదిలో ఎన్నో ప్రశ్నలు నన్ను వేధించాయి. పెళ్లి చేసుకుంటే ఏం జరుగుతుంది ? ఎలా జరుగుతుంది ? అతను నా కన్నా వయస్సులో బాగా పెద్దవాడు. నేను అతనితో ఎలా అడ్జస్ట్ అవుతాను ? అని ఆలోచించా.కానీ నాకు వేరే ఆప్షన్ లేదు. దీంతో 2013 డిసెంబర్‌లో నాకు, అతనికి మ్యారేజ్ అయింది. అప్పుడు ఇల్లాలిగా నాకు ఓ కొత్త ప్రయాణం మొదలైంది. అయితే నా భర్త, స్వర్గమనే కొత్త ప్రపంచాన్ని నాకు పరిచయం చేశాడు. మేం హనీమూన్‌కు వెళ్లాం.
ఈ క్రింది వీడియో ని చూడండి
నాకు చాలా సంతోషం వేసింది. అప్పుడు నాకు అతనంటే ఇష్టం ఏర్పడడం ప్రారంభమైంది. నాకు పెళ్లయిన నెల తరువాత నా భర్తను మిస్ అవుతున్నాననిపించేది. అతను నాకు కుటుంబం అంటే ఏంటో తెలియజేశాడు. అమ్మ, నాన్న, ఇతర కుటుంబ సభ్యుల విలువ నాకు తెలిపాడు. ప్రతి ఆదివారం అతను నన్ను మా ఇంటికి తీసుకువెళ్లేవాడు. అతను నా తల్లిదండ్రులను తన సొంత తల్లిదండ్రుల వలె చూసుకునేవాడు. అతను నన్ను ఇంట్లో ఏ పనీ చేయనిచ్చేవాడు కాదు. రోజులు గడుస్తున్నకొద్దీ నేను మంచి లక్షణాలు, వ్యక్తిత్వం ఉన్న వ్యక్తిగా మారిపోయా. దీంతో నేను అతన్ని ప్రేమించడం మొదలు పెట్టా. అయితే నా కెరీర్ పట్ల నాకు బెంగగానే ఉండేది. ఆ విషయంలో నాకు ఎప్పుడూ విచారం ఉండేది. 2014 సెప్టెంబర్‌లో నాకు కొడుకు పుట్టాడు.. నాకు నటి కావాలని ఎప్పుడూ ఆశ ఉండేది. కానీ ప్రెగ్నెన్సీ అనంతరం నా ముఖంపై మొటిమలు బాగా వచ్చాయి. నా పొట్టపై స్ట్రెచ్ మార్క్స్ ఏర్పడ్డాయి. హెయిర్ ఫాల్ కూడా వచ్చేసింది. ఆ సమయంలోనూ నా భర్త మునుపటిలాగే ప్రవర్తించాడు.

అతను అన్నింటినీ లైట్ తీసుకునేవాడు. నాలో ఎలాంటి మార్పు వచ్చినా అతను ఆందోళన చెందేవాడు కాదు. తల్లి లక్షణాలు నాలో బాగా కనిపించేవి. అయితే నా భర్త నన్ను ఎప్పుడూ సంతోషంగా ఉండేలా చూసుకున్నాడు. మా ఇద్దరి మధ్య ఉన్న ప్రేమ మరింత పెరిగింది. నా భర్త నాకు ఒక అద్భుతమైన వ్యక్తిగా కనిపించాడు. నేనిప్పటి వరకు అలాంటి వ్యక్తులను చూడలేదని నాకు అనిపించేది. నాకు ఇప్పుడు నా భర్త, నా బిడ్డే సర్వస్వం. వారే నా జీవితం. ఇతరులెవరికీ ఇవ్వని గౌరవాన్ని నేను నా భర్తకు ఇస్తున్నా. ఇతరులకు మేం ఆదర్శ జంటలా కనిపిస్తాం. ఒక్కోసారి మనకు ఏది మంచిదో, ఏది చెడో మనం నిర్ణయించుకోలేం. కానీ మన తల్లిదండ్రులు కచ్చితంగా ఆ పనిచేయగలరు. మనకు మంచి వాటినే వారు ఇస్తారు. నాకు అంత మంచి భర్తను ఇచ్చినందుకు వారికి నేను ఇప్పటికీ రుణ పడి ఉంటా. కాబట్టి ప్రేమించిన వాడినే పెళ్లి చేసుకుంటా అని మొండిగా ఉండండి. మీ జీవితంలోకి వచ్చిన వాడిని ప్రేమించండి. మీ లైఫ్ ఎప్పుడు హ్యాపీగానే ఉంటుంది.ఇదండీ ఆ యువతీ జీవితం. కాబట్టి మీకు ఎవరు కరెక్టో ఎవరు కాదో తెల్లిదండ్రులకు బాగా తెలుసు కాబట్టి వారు చెప్పింది విని నడుచుకోండి. మరి ఆ యువతీ చెప్పిన విషయం మీద మీ అభిప్రాయాలను మాకు కామెంట్ రూపంలో చెప్పండి. ఈ వీడియో మీకు నచ్చినట్టు అయితే లైక్ చేసి షేర్ చెయ్యండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం మా ఛానెల్ ను సబ్ స్కైబ్ అయ్యి పక్కన ఉన్న బెల్ ఐకాన్ మీద ప్రెస్ చెయ్యండి.
The post ఇష్టంలేని పెళ్లి చేసుకున్న ప్రతి ఒక్కరు ఈ యువతి గురించి తెలుసుకోండి… appeared first on Telugu Messenger.