మీరు ఇంత అందంగా, ఆరోగ్యంగా, యవ్వనంగా ఉండటం వెనుక సీక్రెట్ ఏమిటని ఎవరైనా అడిగితే.. ఆమె ఏం చెబుతుందో తెలుసా? ‘‘టాయిలెట్ ఈజ్ ద సీక్రెట్ ఆఫ్ మై ఎనర్జీ’’ అంటోంది. అదేంటీ, చండాలంగా అనుకుంటున్నారా? అదే ఆమె ప్రత్యేకత. మూత్రం వేస్ట్ చేయకుండా కూల్ డ్రింక్‌లా తాగేయడమే కాదు.. దాన్ని ముఖానికి సైతం పూసుకుంటోంది. మూత్రం తాగుతోంది సరే, ముఖానికి ఎందుకు రాసుకోవడం? కంపు కొట్టదా? అనే కదా మీ తర్వాతి ప్రశ్న. అది కూడా నిజమే. కానీ, తన మేను మెరవాలంటే మూత్రం ఒక్కటే మార్గం అని చెబుతోంది. ఈ వింత అలవాటు ఉన్న ఆ మహిళ గురించి పూర్తీగా తెలుసుకుందామా.

ఆమె పేరు రుబీ కైరో. వయస్సు 30 ఏళ్లు. అమెరికాలోని మేరీల్యాండ్‌లో ఉంటోంది. ఆమె ఓ న్యూస్ వెబ్‌సైట్‌తో మాట్లాడుతూ.. ‘‘19 ఏళ్ల వయస్సులో మా నాన్న ఈ సీక్రెట్ చెప్పారు. ‘యూరిన్ థెరపీ’ వల్ల అందం పెరుగుతుందని, ఆరోగ్యంగా ఉంటారని తెలిపారు. నీకు బ్యూటీ క్వీన్ కావాలని ఉంటే యూరిన్ థెరపీ ప్రయత్నించు అని చెప్పారు’’ అని కైరో తెలిపింది. ముఖం మెరవాలంటే..: ‘‘ఉదయం నిద్రలేవగానే నా మూత్రాన్ని మాయిశ్చరైజర్‌లా ముఖానికి రాసుకుంటా. కొన్ని గంటల తర్వాత దాన్ని శుభ్రం చేసుకుంటా. రాత్రి నిద్రపోయే ముందు కూడా కాస్త మూత్రాన్ని రాసి పడుకుంటే ముఖం కాంతివంతంగా ఉంటుంది. చాలామంది ఈ విషయాన్ని బయటకు చెప్పరు, అనుకరించరు. ఎందుకంటే.. ఈ పని వారికి జుగుప్స కలిగిస్తుంది. కానీ, అలాంటి వ్యక్తులు వెళ్లి ‘హాట్ డాగ్స్’ వంటివి తింటారు. వాటిలో ఏముంటుందో వారికి తెలీదు’’ అని అంది.
ఈ క్రింద వీడియో చూడండి
మూత్రాన్ని రాసుకున్న తొలి రోజుల్లో ముఖం కాస్త పొడిబారినట్లు కనిపిస్తుంది. ఎందుకంటే ముఖంలో ఉండే మలినాలు బయటకు వస్తాయి. ఆ తర్వాత అవన్నీ తొలగిపోయి ముఖం అందంగా మారుతుంది. వారంలో కనీసం రెండుసార్లు 140 మిల్లీ లీటర్ల మూత్రం తాగుతా. దీనివల్ల రక్తంలో బ్లడ్ సుగర్, కొవ్వు తగ్గి మధుమేహం వ్యాధి రాకుండా అరికడుతుంది’’ అని కైరో తెలిపింది. నా బాయ్‌ఫ్రెండ్ బ్రయిన్ అఫెన్‌బర్గర్‌కు 56 ఏళ్లు. నేను మొదట్లో అతడిని కలిసినప్పుడు తలపై జుట్టు లేదు. దీంతో అతడిని మూత్రం తాగమని సలహా ఇచ్చా. మిరాకిల్.. అతడి నెత్తిపై జుట్టు మొలవడం ప్రారంభమైంది. మూత్రం తాగుతూ శాఖాహారాన్ని మాత్రమే తినేవారికి మరిన్ని ప్రయోజనాలు ఉంటాయని, దూమపానానికి కూడా దూరంగా ఉండాలని కైరో సూచించింది. ఏది ఏమైనా.. అందం కోసం మరీ మూత్రాన్ని తాగేసే సాహసం ఎవరు చేస్తారు చెప్పండి. మరి మూత్రాన్ని తాగుతున్న ఈ మహిళ గురించి మీ అభిప్రాయాలను మాకు కామెంట్ రూపంలో చెప్పండి.
The post ఆమె తన మూత్రాన్ని ముఖానికి పూసుకొని, తాగేస్తోంది.. కారణం ఇదేనట! appeared first on Telugu Messenger.